A Gajam in Begambazar costs Rs. 10 lakhs | బేగం బజార్ లో గజం రూ. 10 లక్షలు | Eeroju news

A Gajam in Begambazar costs Rs. 10 lakhs

బేగం బజార్ లో గజం రూ. 10 లక్షలు

హైదరాబాద్, ఆగస్టు 19, (న్యూస్ పల్స్)

A Gajam in Begambazar costs Rs. 10 lakhs

హైదరాబాద్‌లో భూమి ధర ఎక్కువగా ఎక్కడ ఉంటుంది అంటే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట, గచ్చిబౌలి పేర్లు వినిపిస్తాయి. కానీ, వాటిని తలదన్నేలా బేగంబజార్‌లో భూమి ధర ముంబయితో పోటీ పడుతోంది. ముంబయిలో మాదిరిగా ఇక్కడ గజం భూమి తక్కువలో తక్కువ రూ.10 లక్షల వరకు పలుకుతోంది. భూమి లభ్యత లేకపోవడంతో పాత భవనాలే నూతన నిర్మాణాలకు పునాది వేస్తున్నాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్రకు చెందిన హోల్‌సేల్‌ వ్యాపారులు ఎంతోమంది ఇక్కడే స్థిరపడ్డారు. చదరపు అడుగుల చొప్పున అమ్మకాలు జరిగే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలోనే పలుకుతున్నాయి.

హైదరాబాద్‌లో బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, కోకాపేట భూములకు అత్యధిక ధరలు ఉన్న మాట నిజమే. కానీ, అంతకు మించిన ధరలు ఉస్మానియా ఆస్పత్రి సమీపంలోని బేగంబజార్‌లో పలుకుతున్నాయి. ముంబయిలో మాదిరిగా ఇక్కడ భూములకు ధరలు ఉన్నాయి. ఇక్కడ గల్లీ, వీధిని బట్టి గజానికి కనీస ధర రూ.10 లక్షలకు తక్కువ కాకుండా పలుకుతోంది. ఇక్కడ కొత్తగా స్థలాల లభ్యత లేదు. పాతవి, పురాతన, శిథిలావస్థకు చేరిన భవనాలే ఇక్కడి యజమానులకు రూ.కోట్లలో కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఆ పాత భవనాల కోసం రియల్ ఎస్టేట్ వ్యాపారులు నిరంతరం అన్వేషిస్తూనే ఉంటారు.

పాత భవనం అమ్మకానికి ఉందన్న విషయం తెలిస్తే చాలు రెక్కలు కట్టుకుని క్షణాల్లో అక్కడ వాలిపోతారు. అందరి కంటే ఎక్కువగా ఇస్తామంటూ పోటీ పడుతుంటారు. ఒకరికి మించి ఇంకొకరు రేటు పెంచుకుంటూ పోతుంటారు. ఈ క్రమంలో వ్యాపారుల మధ్య పోటీ వేలం పాటను తలపిస్తుందంటే నమ్మశక్యం కాదు. భూమి యజమానికి కాసుల పంట కురిపించేలా పోటీ ఉంటుంది. పలు సందర్భాల్లో కొనుగోలుదారుల ఒత్తిడుల వల్ల అమ్మకందారుడు ‘టాస్‌’ వేసి మరీ ఆ స్థలాన్ని అమ్ముతుండడం విశేషం.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో స్థిరంగా ఉన్న బేగం బజార్ భూముల ధరలకు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన 2014 తర్వాత రెక్కలొచ్చాయి. రాజస్థాన్, గుజరాత్, యూపీ, మహారాష్ట్ర చెందిన హోల్‌సేల్‌ వ్యాపారులు ఎంతోమంది తమ వారిని రప్పించుకొని ఇక్కడే స్థిరపడ్డారు. రోజువారీ కోట్ల రూపాయల్లో వ్యాపార లావాదేవీలు కొనసాగిస్తున్నారు. చదరపు అడుగుల చొప్పున క్రయ విక్రయాలు జరిగే మడిగ దుకాణాల ధరలు కూడా రూ. కోట్లలోనే పలుకుతున్నాయి.

A Gajam in Begambazar costs Rs. 10 lakhs

 

The value of the land will increase drastically | భారీగా పెరగనున్న భూముల విలువ | Eeroju news

Related posts

Leave a Comment