A check to the sand mafia | ఇసుక మాఫియాకు చెక్ | Eeroju news

A check to the sand mafia

 ఇసుక మాఫియాకు చెక్

విజయవాడ, జూలై 12, (న్యూస్ పల్స్)

A check to the sand mafia

ఇసుక మాఫియాకు చెక్ పడింది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చీ రాగానే ఇసుక మాఫియాకు కళ్లెం వేసేలా ఇసుక విధానాన్ని తీసుకొచ్చారు. ప్రజల కళ్లలో దుమ్ము కొట్టి, ఇసుకను పొలిమేర దాటించిన ఇసుకాసురుల భరతం పట్టే బ్రహ్మాస్త్రంగా కొత్త చట్టాన్ని రూపొందించారు. చంద్రబాబు 2014-2019 పాలనలో ఉచిత ఇసుక విధానం ద్వారా ఇసుక మాఫియా కోట్లు కొల్లగొట్టిందని జగన్ ప్రభుత్వం ఆరోపిస్తూ అప్పట్లో నూతన విధానం తీసుకొచింది. నూతన ఇసుక పాలసీపై 2019 సెప్టెంబర్ 4న జగన్ ప్రభుత్వం జీవో 70, 70 జారీ చేసింది. దాని ప్రకారం టెండర్లు నిర్వహించి ఇసుక విక్రయాలకు ఒక విధానాన్ని తీసుకొచ్చారు. ఆ తర్వాత ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానాల్లో ఇసుక విక్రయాలు జరిపారు.

అయినా జరగాల్సిన తంతు జరిగిపోయింది. ఇక చంద్రబాబు మొదటి తీసుకొచ్చిన ఉచిత విధానం కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంది. మొదటి ఉచిత ఇసుక విధానం అమల్లో అక్రమ ఇసుక తవ్వకాలపై ఎన్జీటీ తీవ్రంగా స్పందించింది. ఏకంగా 100 కోట్ల రూపాయల జరిమానా విధించింది. ఈ తీర్పునకు సంబంధించి వచ్చిన ఆరోపణలు కూడా సీఎంగా చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతంలో జరిగిన అక్రమ ఇసుక తవ్వకాలపైనే కావడం గమనార్హం. ఇప్పుడు చంద్రబాబు రెండోసారి ఉచిత ఇసుక విధానాన్ని తిరిగి తీసుకొచ్చారు. కొత్త ప్రభుత్వంలో ఉచితంగానే ఇసుకను అందిస్తామని చెప్పిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేసింది. కలెక్టర్లకు ఇచ్చిన అంతర్గత ఉత్తర్వుల మేరకు తాత్కాలికంగా ఇసుక సరఫరా చేసేందుకు వీలుగా ఉత్తర్వులు ఇచ్చారు.

కొత్త విధానం వచ్చే వరకు ఈ ఉత్తర్వులు అమల్లో ఉంటాయి. అలాగే గత ప్రభుత్వం తీసుకొచ్చిన ఇసుక పాలసీలను రద్దు చేసింది. ఏపీలో ఇసుక అమ్మకాల కోసం ఇచ్చిన ఉత్తర్వుల్లో తమ లక్ష్యాలను ప్రభుత్వం వివరించింది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇసుక అమ్మకాల కోసం జిల్లా కలెక్టర్ చైర్మన్ గా కమిటీలు ఏర్పాటు చేస్తారు. ఎస్పీ, జేసీ వంటి అధికారులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. ర్యాంపుల్లో తవ్వకాలు, లోడింగ్, అన్ లోడింగ్, పాలనా ఖర్చులు, పన్నుల ఆధారంగా జిల్లా కమిటీలు ఇసుక రేట్లను నిర్ణయిస్తాయి. ఇసుక కొనుగోలుదారులు యూపీఐ పేమెంట్స్ ద్వారానే చెల్లింపులు చేయాలి. ప్రతీ వినియోగదారులు రోజుకు గరిష్టంగా 20 టన్నుల ఇసుక మాత్రమే కొనుగోలు చేయాలి.

పరిమితికి మించి స్టాక్ పెట్టడం, ప్రభుత్వం నుంచి తీసుకున్న ఇసుక తిరిగి అమ్మడం, ఇతర రాష్ట్రాలకు తరలింపు నిషేధం. అయితే రాష్ట్ర ఖజానాకు రెవెన్యూ లేకుండా ఇసుక సరఫరా జరపాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వినియోగదారులకు ఇసుకను ఉచితంగా ఎలాంటి అక్రమాలకు తావు లేకుండా అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఇసుక సరఫరాపై మార్గదర్శకాలు విడుదల చేసింది. అయితే గత అనుభవాల దృష్ట్యా ఈసారి చంద్రబాబు ప్రభుత్వం ఉచిత ఇసుక పాలసీని రెండోసారి ఏ విధంగా అమలు చేస్తుందో చూడాలి.

* ఇసుక అమ్మకాల కోసం జిల్లా కలెక్టర్ ఛైర్మన్ గా కమిటీల ఏర్పాటు
* కమిటీల్లో సభ్యులుగా ఎస్పీ, జేసీ వంటి అధికారులు
* ఇసుక అక్రమాలపై నిఘా కోసం జిల్లా స్థాయి టాస్క్ ఫోర్స్ లు ఏర్పాటు
* ట్రాక్టర్ తో అక్రమ రవాణ చేస్తూ పట్టుబడితే రూ.10వేలు జరిమానా
* 10 టైర్ల లారీతో మొదటిసారి పట్టుబడితే 25వేల జరిమానా
* రెండోసారి పట్టుబడితే రూ.50వేల వరకు జరిమానా
* రెండోసారి ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిన టీడీపీ ప్రభుత్వం
* సరసమైన ధరలకు ఇసుకను వినియోగదారులకు అందుబాటులో ఉంచడం
* ఇసుక లావాదేవీల్లో పారదర్శకత తీసుకురావడం
* అక్రమ ఇసుక తవ్వకాలు, రవాణను అరికట్టడం

 

A check to the sand mafia

 

Free sand is for real traders | ఉచిత ఇసుక రియల్ వ్యాపారులకేనా | Eeroju news

Related posts

Leave a Comment