రిషికొండ ప్యాలస్ నిర్మాన ఖర్చు రూ 409 కోట్ల 39 లక్షలు
మంత్రి కందుల దుర్గేష్
అమరావతి
Minister Kandula Durgesh
శాసనసభలో రిషికొండ ప్యాలెస్ కు సంబంధించి జరిగిన చర్చలో సభ్యుల ప్రశ్నలకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ వివరణ ఇచ్చారు.
మొదటి ప్రశ్నకు సమాధానంగా విశాఖపట్నం జిల్లా ఎండాడ గ్రామంలో సర్వే నెంబర్ 19 లో రిషికొండ పైన ఉన్నటువంటి 61 ఎకరాల విస్తీర్ణంలో 9 ఎకరాల 88 సెంట్లలో భవనాన్ని నిర్మించడం జరిగింది. 7 బ్లాక్ లతో ఉన్నటువంటి ఒక రిసార్ట్ ను ఏపీ టీడీసీ వాళ్ళు నిర్మించడం జరిగింది. రిషికొండలో భవనాల నిర్మిత విస్తీర్ణం పరిశీలిస్తే విజయనగరం, కళింగ, గజపతి, వేంగి బ్లాక్ లతో కలిపి మొత్తం ఐదు బ్లాక్ లు ఉన్నాయి.
ఏ బ్లాక్ లో మళ్ళీ మొత్తం మూడు బ్లాకులు ఉన్నాయి. అన్ని బ్లాక్ ల నిర్మిత విస్తీర్ణం 1,45,765 చదరపు అడుగులు.. వీటి కోసం రూ. 222 కోట్ల 92 లక్షలు ఖర్చు అయ్యింది. భవనాలు కాకుండా చేపట్టిన మిగితా పనులు చూస్తే హార్డ్ స్కేపింగ్, స్లో ప్రొటెక్షన్ వర్క్.. వీటన్నింటికీ కలిపి రూ. 186 కోట్ల 47 లక్షలు ఖర్చయింది. 9 ఎకరాల 88 సెంట్లలో జరిగిన భవనాల నిర్మాణానికి, ఇతర పనులకు సంబంధించి మొత్తంగా రూ. 409 కోట్ల 39 లక్షలు ఖర్చు అయింది.
దీనికి సంబంధించి ఒక్కొక్క చదరపు అడుగుకు (ఎస్ఎఫ్టీ కి) రూ. 23,261 ఖర్చు అయింది. రెండవ ప్రశ్నకు సమాధానంగా ఇతర అంశాలకు కోసం దాదాపు రూ. 71 కోట్ల 91 లక్షలు ఖర్చు అయింది. ఇది ఎండాడలో రిషికొండ భవనాల నిర్మాణానికి చేసిన వ్యయం, ఎన్ని ఎకరాల్లో భవనం నిర్మించారు అనడానికి సమాధానమని అన్నారు.
Amaravati | అమరావతిలో లగ్జరీ విల్లాలకు డిమాండ్ | Eeroju news