Onion rates hike | ఉల్లి… లొల్లి… | Eeroju news

ఉల్లి... లొల్లి...

ఉల్లి… లొల్లి…

ముంబై, నవంబర్ 11, (న్యూస్ పల్స్)

Onion rates hike

కొంత కాలంగా నిత్యవసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. అసలే అత్తెసరు ఆదాయంతో ఈసురోమంటూ కుటుంబాన్ని ఈదే సామాన్యుడు ఈ పెరిగిన ధరలతో బెంబేలెత్తిపోతున్నాడు. బియ్యం, పప్పు, ఉప్పుల ధరలు అందనంత ఎత్తులో ఉన్నాయి. దీనికి తోడు నిన్నమొన్నటి వరకు కురిసిన వర్షాలకు పంటలు కూడా వరునుడు ఎత్తుకుపోయాడు. దీంతో నిత్యవసర సరుకుల ధరలు మరింత పైపైకి ఎగబాకుతున్నాయి. ఓ పక్క పెరిగిన ధరలతో అల్లాడిపోతుంటే.. మరోవైపు టమాట, ఉల్లి ధరలు కూడా ఠారెత్తిస్తున్నాయి. వారం క్రితం కాస్త పర్లేదు అనేంతగా రూ. వందకు 4 కేజీల వరకు విక్రయించిన వ్యాపారులు హఠాత్తుగా ధరలు పెంచేశారు. కేవలం వారం రోజుల్లోనే రెండు సార్లు ధరలు పైకెగబాకాయి.

తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో ఇదే తంతు కనిపిస్తోంది. నిన్న మొన్నటి వరకు హోల్‌సేల్‌ మార్కెట్లలో రూ.40 నుంచి 60 వరకు పలికిన కిలో ఉల్లిపాయల ధర ఇప్పుడు రూ.70 నుంచి 80కి చేరింది. సొమవారం కొన్ని ప్రాంతాల్లో రూ.80 కంటే అధిక ధర పలికడంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ బడ్జెట్లు తల్లకిందులై వినియోగదారులు అల్లాడిపోతున్నారు. ఇక వ్యాపారులు మాత్రం ద్రవ్యోల్బణంతోపాటు ఉల్లి కొనుగోలు ధరలు పెరగడమే ఇందుకు కారణమని చెప్తున్నారు.

మండీల్లో కిలో ఉల్లి ధర రూ.60 నుంచి రూ.70కి పెరిగిందని, అమ్మకాలపై ప్రభావం చూపుతుండటం వల్లనే విక్రయాలు తగ్గాయని అంటున్నారు. అయినప్పటికీ ఉల్లిపాయలను జనం కొంటూనే ఉన్నారని ఢిల్లీ మార్కెట్‌లోని ఓ వ్యాపారి తెలిపారు. అదుపు లేకుండా పెరిగిపోతున్న ధరలపై వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉల్లితోపాటు వెల్లుల్లి, టమాట ధరలు కూడా రెట్టింపు కావడంతో కొనుగోలుదారులు వాపోతున్నారు. పెరిగిపోతున్న ధరలకు ప్రభుత్వం కళ్లెం వేసి తమను ఆదుకోవాలని వేడుకుంటున్నారు.

ఉల్లి... లొల్లి...

బాబూ.. ఇదేం పని.. రైలు బాత్రూమ్ పక్కన ఉల్లిపాయల కటింగ్. #dirtyfood in #train #viral | FBTV NEWS

Related posts

Leave a Comment