Director Komal R Bharadwaj | ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయిని కథ ‘రహస్య ఇదం జగత్‌’ | Eeroju news

Director Komal R Bharadwaj

ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయిని కథ ‘రహస్య ఇదం జగత్‌’

Director Komal R Bharadwaj

 

ఈ జగతే ఒక రహస్యం, అందులో మేము టచ్‌ చేసింది చిన్న పాయింట్‌ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయిని కథ ‘రహస్య ఇదం జగత్‌’ : దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌

సైన్స్‌ ఫిక్షన్‌ అండ్‌ మైథాలాజికల్‌ థ్రిల్లర్స్‌గా రూపొందుతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. ఈ చిత్రంలో నేటి తరం ప్రేక్షకులను అలరించే ఎన్నో ఆసక్తికరమైన విషయాలు వున్నాయని ఈ చిత్రం ప్రమోషన్‌ కంటెంట్‌ చూస్తే అర్థమవుతోంది. మన పురాణాలు, ఇతిహాసాల గురించి… శ్రీచక్రం గురించి చర్చిస్తూ ఓ కొత్త అనుభూతిని కలిగించడానికి రాబోతున్న చిత్రం రహస్యం ఇదం జగత్‌. రాకేష్‌ గలేబి, స్రవంతి పత్తిపాటి, మానస వీణ, భార్గవ్‌ గోపీనాథం ముఖ్యతారలుగా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సింగిల్‌ సెల్‌ యూనివర్శ్‌ ప్రొడక్షన్‌ పతాకంపై కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ దర్శకత్వంలో పద్మ రావినూతుల, హిరణ్య రావినూతుల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. .నవంబరు 8న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్బంగా దర్శకుడు కోమల్‌ ఆర్‌ భరద్వాజ్‌ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.

మీ నేపథ్యం ఏమిటి:
నాకు చిన్నప్పటి నుంచే నాకు సినిమాలంటే చాలా ఆసక్తి. మా నాన్న స్టేజీ షోలకు రైటర్‌. అమ్మ కూడా కవితలు రాస్తుంటేవారు. మా ఇంటి వాతావరణం నుంచే నాకు సినిమాలపై ఆస్తక్తి పెరిగింది. చిన్నప్పటి నుంచే నేను దర్శకుడవుతాను అని ఇంట్లో చెప్పేవాడిని.కానీ అమెరికా వెళ్లి ఎం.ఎస్‌ చేశాను. ఇక నా గురించి నేను రియలైజ్ అయిన తరువాత ఫిలిం స్కూల్‌లో జాయిన్‌ అయ్యాను. ఆ తరువాత చాలా షార్ట్‌ ఫిలింస్ చేశాను. చాలా అవార్డులు కూడా దక్కాయి. ఇక సినిమా తీయగలను అనే కాన్పిడెన్స్‌ వచ్చిన తరువాత రహస్యం ఇదం జగత్‌ సినిమా చేశాను. బ్యూటిఫుల్‌ కంటెంట్‌, వండర్‌ఫుల్‌ విజువల్స్‌ టెక్నికల్‌గా చాలా సౌండ్‌తో ఈ సినిమా చేశాను.

సైన్స్‌ అండ్‌ మైథలాజికల్‌గా కాన్సెప్ట్‌తో ఈ సినిమా తీయాలని ఎందుకనిపించింది?
దర్శకుడిగా ఒక వైవిధ్యమైన కొత్త కథలో రావాలని అనుకున్నాను. ఆ సమయంలోనే ఈ కథ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. ఇండియాకు చెందిన శ్రీ చక్రం గురించి అమెరికాలో అన్వేషణ జరిగింది. శ్రీ చక్రం గురించి తవ్వకాలు జరిగిన ప్రదేశం నేను వుండే ప్లేస్‌కు చాలా దగ్గరగా వుంటుంది. శ్రీ చక్రం కోసం జరిగిన అన్వేషణ. నన్ను బాగా ఇన్‌స్పయిర్‌ చేసింది. ఈ కథను ఇంట్రెస్టింగ్‌ చెప్పొచ్చు అనిపించింది. మన కథను, మన పురాణాల కథను తీసుకుని ఫిక్షన్‌ను యాడ్‌ చేసి లార్జన్‌దేన్‌ లైఫ్ కథ చెప్పాలి అనుకోని చెప్పాను.వామ్‌ హోల్‌ కాన్సెప్ట్‌తో ఇతర లోకాలకు ట్రావెల్‌ కావొచ్చు. సైన్స్‌ ప్రకారం వామ్‌హోల్స్‌తో ట్రావెల్‌ చేస్తే ఇంకో టైమ్‌లోకి వెళతాం అని చెప్పే కథ ఇది.

ఈ కథలో వున్న ఇంట్రెస్టింగ్‌ పాయింట్‌ ఏమిటి?
ఈ కథలో ఆడియన్స్‌ బాగా థ్రిల్ల్‌గా ఫీలయ్యే అంశాలు చాలా వున్నాయి. మన కథలు, మన పురాణాలు గురించి మన పూర్వీకులు గురించి ఈ సినిమాలో చాలా ఇంట్రెస్టింగ్‌ పాయింట్స్‌ వున్నాయి. సైన్స్‌, వామ్‌హోల్స్‌ గురించి ముందే పురాణాల్లో రాశారు. ఈ సినిమా చూసిన వాళ్లు చాలా మంచి ఎక్స్‌పీరియన్స్‌ను పొందుతారు.
ఇలాంటి కాంప్లికేట్‌ కథను ఎంత వరకు సరళంగా చెప్పారు?
ఇలాంటి హెవీ కథను.. పోర్స్‌ఫుల్‌ కాకుండా.. సింపుల్‌ఫైగా చెప్పాను. ఈ కథలో సందర్భ, కథకు తగ్గట్టుగా క్యారెక్టర్స్‌ , ఎలిమెంట్స్‌ వుంటాయి. క్యారెక్టర్‌ ట్రావెల్స్‌లో ఈ కథలన్నీ బయటికొస్తాయి. చాలా సింపుల్‌ఫై చేశాం.

యూఎస్‌లో సాఫ్టవేర్‌ రంగంలో సెటిలైన మీరు దర్శకత్వం వైపుకు రావడం రిస్క్‌ అనిపించలేదా?
రిస్క్‌ వుంది. కానీ దర్శకత్వం అనేది నా యాంబిషన్‌ పాషన్‌తో వున్న వాళ్లు అందరూ రిస్క్‌ తీసుకుని ఎదిగిన వాళ్లే. మణిరత్నం రాజమౌళి, నాగఅశ్విన్‌ ఈ రోజు వాళ్లు మంచి పొజిషన్‌లో వున్నారంటే వాళ్ల కెరీర్‌లో వాళ్ల కూడా ఎంతో రిస్క్‌ తీసుకున్నారు. నేను కూడా నా కథను , నా పొటెన్షియల్‌ నమ్మి ఈసినిమ చేశాను. లైఫ్‌లో సాధించాలంటే రిస్క్‌ తీసుకోవాల్సిందే.
చాలా మంది అప్రిషియేట్‌ చేశారు. అందరికి ఇంట్రస్టింగ్‌ స్టోరీ.
ఈ సినిమాలో అందరిని కొత్తవాళ్లను ఎందుకు తీసుకున్నారు?
ఈ సినిమాలో అందరూ కొత్తవాళ్లే అయినా ఆర్టిస్టులు నటులుగా ప్రూవ్ అయిన వాళ్లే. .కొత్తవాళ్లు..ఈ కథను తెలియని వాళ్లతో ఈ సినిమా బెటర్‌గా వుంటుందనేది నా ఫీలింగ్‌. ఎందుకుంటే ఇందులో వున్న సస్పెన్స్‌ ఎలిమెంట్స్‌కు వాళ్లే ప్లస్‌గా వుంటారు. ఇలాంటి కథలకే కొత్తవాళ్లే కరెక్ట్‌. అప్పుడే ఈ కథ ఈసినిమాతో ఎలివేట్‌ వుంటుంది ఎక్కువ థ్రిల్ల్‌ వుంటుంది. కొత్తవాళ్లైనా చాలా బాగా నటించారు.

రహస్యం ఇదం జగత్‌ టైటిల్‌ జస్టిఫికేషన్ ఏమిటి:
యూనివర్శ్‌ ఈజ్‌ మిస్టరీ. . పురాణాల్లో లోకాల మధ్య తిరిగిన వాళ్లు వామ్‌హోల్‌, కాన్సెప్ట్‌కు సంబంధ వుంది. లోకల మధ్య తిరిగారు అంటారు. కానీ వాళ్లు ఎలా తిరిగారు. 14 లోకాలు వుంటే వీటిలో ఎన్నో కథలు వున్నాయి. ఈ జగతే ఒక రహస్యం, అందులో మేము టచ్‌ చేసింది చిన్న పాయింట్‌,
మీ తదుపరి సినిమాలు ఏమిటి?
నా దగ్గర మంచి కథలు వున్నాయి. బేసికల్‌గా బడ్జెట్‌తో రెడీగా వున్నాయి. ఈ ఎక్స్‌పీరియన్స్‌తో నా లోపాలు సరిదిద్దుకుని. నేను ఏ సినిమా తీసిన ఇప్పటి వరకు ఎవరూ టచ్‌ చేయని కథలతోనే సినిమా చేస్తాను.

Director Komal R Bharadwaj

The movie unit unveiled the trailer of ‘Bumper’ with entertainment and thriller elements | ఎంటర్ టైన్ మెంట్, థ్రిల్లర్ అంశాలతో కూడిన “బంపర్” చిత్ర ట్రైలర్ ఆవిష్కరించిన చిత్ర యూనిట్ | Eeroju news

Related posts

Leave a Comment