Jagan mohan reddy | 11వ తేదీ…. 11 గంటలకు.. 11 మంది వస్తారా… | Eeroju news

11వ తేదీ.... 11 గంటలకు.. 11 మంది వస్తారా...

11వ తేదీ…. 11 గంటలకు.. 11 మంది వస్తారా…

విజయవాడ, నవంబర్ 5, (న్యూస్ పల్స్)

Jagan mohan reddy

ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలను జనవరి పదకొండో తేదీ నుంచి జరగనున్నాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలి పూర్తి స్థాయి బడ్జెట్‌ను ఈ అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశ పెట్టనున్నారు. ఇప్పటికే బడ్జెట్ కసరత్తు పూర్తయింది. అయితే ఇప్పుడు ఖరారు చేసిన తేదీ , సమయం మాత్రం  యాధృచ్చికంగా ఉన్నా.. అవి వైసీపీని సోషల్ మీడియాలో ట్రోల్ చేసేలా ఉండటం వైరల్ గా మారింది. వైసీపీకి పదకొండు మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందుకే పదకొండు పేరుతో సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తూ ఉంటారు టీడీపీ , జననస, బీజేపీ పార్టీలకు చెందిన సోషల్ మీడియా కార్యకర్తలు. తాజాగా ఏపీ అసెంబ్లీ సమావేశాల తేదీలను ఖరారు చేశారు. అన్ని పదొకొండు వచ్చేలా ఖరారు చేశారు.

పదకొండో తేదీన.. పదకొండు గంటలకు అసెంబ్లీ ప్రారంబమవుతుంది. వెంటనే బడ్జెట్ ప్రవేశ పెడతారు. అంటే పదకొండు గంటలకే బడ్జెట్ ప్రవేశ పెడతారు. ఈ సమావేశాలను పదకొండు రోజుల పాటు నిర్వహించాలని ప్రాధమికంగా నిర్ణయించినట్లుగా అధికారవర్గాలు చెబుతున్నాయి. మమాలుగా అయితే బీఏసీ సమావేశంలో  ఖరారు చేశారు. సాధారణంగా ప్రధాన ప్రతిపక్షం కూడా లేనందున ప్రభుత్వం చెప్పినట్లుగానే అసెంబ్లీ జరుగుతుంది కాబట్టి.. అనుకుంటే పదకొండు రోజులే జరుగుతుంది. అంతకు మించి నవంబర్‌లో  నెలలో జరుగుతున్న సమావేశాలు కావడంతో పదకొండో నెల.. పదకొండో తేదీ.. పదకొండు గంటలు.. పదకొండు రోజులు.. మరి ఆ పదకొండు మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వస్తారా అని ట్రోల్ చేస్తన్నారు.

వైసీపీకి ఉన్న పదకొండు మంది ఎమ్మెల్యేల గురించి ఇలా ప్రస్తావిస్తున్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కావాలా వద్దా అన్నదానిపై ఇంకా వైసీపీ ఎలాంటి నిర్ణయం ప్రకటించలేదు. ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని జగన్ గతంలో స్పీకర్ అయ్యన్న పాత్రుడికి లేఖ రాశారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం  చేసిన తర్వాత వైసీపీ నేతలు అసెంబ్లీ వైపు రాలేదు.

జగన్ అసెంబ్లీకి వస్తే గతంలో టీడీపీ అధినేత చంద్రబాబును అవమానించినట్లుగా అవమానిస్తారని..  ఎదురుదాడి చేయడానికి సరైన సంఖ్యా బలం లేకపోవడంతో పరిస్థితి దారుణంగా ఉంటుందని వైసీపీ వర్గాలనుకుంటున్నాయి. అందుకే అసెంబ్లీ సమావేశాలకు వైసీపీ హాజరయ్యేది కష్టమని అంచనా వేస్తున్నారు. అసెంబ్లీకి రాక మందే ఇలా పదకొండు పేరుతో ట్రోల్ చేస్తున్నారని.. ఇక సభకు హాజరయితే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదంటున్నారు. అయితే ఈ అంశంపై వైసీపీ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది.

11వ తేదీ.... 11 గంటలకు.. 11 మంది వస్తారా...

 

AP Budget | 11 నుంచి ఏపీ బడ్జెట్ భేటీ | Eeroju news

Related posts

Leave a Comment