Dharmana Prasada Rao | పక్క చూపులు చూస్తున్న ధర్మాన | Eeroju news

Dharmana Prasada Rao

పక్క చూపులు చూస్తున్న ధర్మాన

శ్రీకాకుళం, అక్టోబరు 30, (న్యూస్ పల్స్)

Dharmana Prasada Rao

రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పిన సీనియర్ ఆయన. వైసీపీకి చెందిన ఆ నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుండి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. పార్టీ మారతారని, రాజకీయ సన్యాసం తీసుకున్నారని ఆయన మౌనంపై రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి. ధర్మాన ప్రసాదరావు అంటే తెలుగు రాస్ట్రాలలో తెలియనివారు ఉండరు. మంచి వాక్చాతుర్యంతో పాటు రాజకీయ వ్యూాహరచనలో ఆయనది అందెవేసిన చేయి. ఇంతటి గొప్ప నేత ఎన్నికల ఫలితాలు వచ్చినప్పటి నుంచి సైలెంట్ అయిపోయారు. పార్టీ కార్యకలాపాలకు సైతం దూరంగా ఉంటున్నారు. చివరకు తాను ఎంతగానో ఇష్టపడే దివంగత నేత Y.S. రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు సైతం దూరంగా ఉన్నారు.

దాంతో ఆ సీనియర్ ఆలోచన ఏంటి అన్నది అంతుపట్టడం లేదు. తాడేపల్లిలో జగన్ మోహన్ రెడ్డి నిర్వహించిన శ్రీకాకుళం జిల్లా స్థాయి రివ్యూ సమావేశానికి సైతం ఆయన గైర్హాజరయ్యారు. దీంతో అందరి దృష్టి ప్రసాదరావుపైనే పడింది. ఎందుకు హాజరుకాలేదన్న అంశంపై పెద్దఎత్తున చర్చ నడిచింది. అత్యంత విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. ఆయన రాజకీయ వైరాగ్యంలో ఉన్నారని.. రాజకీయంగా ఎటువైపు అడుగులు వేయాలా? అని సమాలోచనలు చేస్తున్నారని తెలుస్తోంది. ప్రసాదరావు ఆలోచనలు అన్నీ కుమారుడు, రాజకీయ వారసుడు ధర్మాన రామమనోహర్ నాయుడు భవిష్యత్తు చుట్టూనే తిరుగుతున్నాయని ఆయన సన్నిహితులుచెబుతున్నారు.కుమారుడ్ని ఏ పార్టీలో చేర్పిస్తే రాజకీయంగా నిలదొక్కుంటారు అని ధర్మాన ప్రసాదరావు ఆలోచిస్తున్నారట.

2024 ఎన్నికల్లో కుమారుడికి శ్రీకాకుళం శాసన సభ టికెట్ ఇవ్వాలని జగన్‌నిఅడిగి భంగపడ్డారు ప్రసాదరావు. దాంతో ధర్మానకు ఆ ఆవేదన వెంటాడుతోందంట.ఈ కారణాలు విశ్లేషించుకున్న తరువాతే ధర్మాన వ్యూహాత్మక మౌనం పాటిస్తున్నారని ఆయన ఆంతరంగికులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీలో కొనసాగుతారా? లేక.. వదిలేస్తారా అన్న మీమాంస నెలకొంది.ధర్మాన ప్రసాదరావు మౌనం కొనసాగిస్తున్న కొద్దీ ఆయనపై రకరకాల ప్రచారాలు ఊపందుకుంటున్నాయి. ప్రస్తుతం ధర్మాన అన్న, మాజీ ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణ దాస్ కే మళ్ళీ జిల్లా పార్టీ పగ్గాలు అప్పజెప్పారు.

ధర్మాన కృష్ణ దాస్ ఇప్పటికే మూడు సార్లు జిల్లా వైసిపి అధ్యక్షునిగా కొనసాగటంతో ఆయన స్థానంలో వేరొకరికి పార్టీ పగ్గాలు అప్పగించాలన్న ఆలోచన కూడా మొదట చేసారట జగన్ మోహన్ రెడ్డి. దానికోసం కొంతమంది జిల్లా నేతల పేర్లు కూడా సెలక్ట్ చేసారట. కానీ చివరి నిమిషంలో జిల్లాలోని సామాజిక సమీకరణాలు,పార్టీ పట్ల విధేయత, సీనియారిటీ, కుటుంబ నేపథ్యం వంటి అంశాల నేపథ్యంలో వెలమ సామాజిక వర్గానికి చెందిన కృష్ణ దాస్ కే మళ్ళీ 4వ సారి జిల్లా అధ్యక్షుడిని చేసింది పార్టీ అధిష్టానం. అదే సందర్భంలో కళింగ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాంకి శ్రీకాకుళం పార్లమెంట్ పరిశీలికునిగా, మత్స్యకార సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు డాక్టర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షునిగా నియమిస్తూ పార్టీ అధిష్ఠానం కార్యవర్గ కూర్పు చేసింది.

పార్టీ ప్రతిపక్షంకి పరిమితి అయిన నేపథ్యంలో జిల్లా పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన కృష్ణదాస్ ముందు ఇప్పుడు అనేక సవాళ్లు ఉన్నాయి. కృష్ణ దాస్ ముందున్న మొదటి సవాల్ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న ఆయన తమ్ముడు, మాజీమంత్రి ధర్మాన ప్రసాదరావును యాక్టివ్ చేయడం.జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమించిన తర్వాత ప్రమాణస్వీకారోత్సవానికి రావాలని పేరాడ తిలక్, డాక్టర్ అప్పలరాజులతో కలిసి కృష్ణ దాస్ తన తమ్ముడి బంగళాకు వెళ్లి కలిసారట. కానీ ప్రసాదరావు ఆ కార్యక్రమానికి హాజరుకాలేదు. అదే సమయంలోనే జిల్లా నుంచి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయాలి కాబట్టి కొందరి పేర్లను కూడా సూచించాలని ధర్మాన ప్రసాదరావుకు కోరారట. ఆయన సూచించిన పేర్లను తీసుకొనే పార్టీ అధిష్టానానికి పంపించారట.

ఇప్పుడు తమ్ముడ్ని యాక్టివేట్ చేయడం కృష్ణ దాస్ కి పెద్ద విషయమేమీ కాదనీ అతని సన్నిహితులు అంటున్నారు.కానీ వయసులో కృష్ణ దాస్ కంటే ప్రసాదరావు చిన్నవాడయినప్పటికీ ధర్మాన అని గూగుల్ లో వెతికితే ధర్మాన ప్రసాదరావు పేరే మొదట వస్తుంది. కృష్ణదాస్ కంటే రాజకీయాలలో అంత సీనియార్టీ సాధించారు ప్రసాదరావు. కాబట్టి కేవలం అన్న కోసం తన రాజకీయ వ్యూహాలను మార్చుకోడన్న వాదన కూడా ధర్మాన ప్రదరావు సన్నిహితుల నుండి వినిపిస్తుంది. దానికి తోడు దీపం ఉన్నప్పుడే కుమారుడు రామ్మోహన్ నాయుడు రాజకీయ భవిష్యత్ ను చక్కదిద్దాలన్న ఆలోచన కూడా ప్రసాదరావు మదిలో ఉంది.ఓడిపోయినప్పటి నుంచి ధర్మాన ప్రసాదరావు పార్టీ కార్యక్రమాలకు హాజరుకావడం లేదు.

ఆరోగ్యం బాగాలేదని అందుకే విశ్రాంతి తీసుకుంటున్నాని ధర్మాన ప్రసాదరావు సన్నిహితులు అంటున్నారు. కానీ జగన్ వ్యవహార శైలి కూడా ధర్మాన ప్రసాదరావు మౌనానికి కారణమన్న వాదన వినిపిస్తుంది. పార్టీ నుంచి చాలామంది బయటకి వెళ్ళి పోవడానికి కూడా జగన్ వ్యవహారం తీరే కారణమంటున్నారు. ఎన్నికల్లో ఘోర పరాజయం తరువాత కూడ జగన్మోహన్ రెడ్డి లో మార్పు రాకపోవడం.. వైసీపీ పరిస్థితి పై కేడర్ లో నమ్మకం తగ్గడం కూడా ధర్మానను ఆలోచన లోనెట్టిందనే వాదన కూడా జిల్లాలో వినిపిస్తుంది.మరో వైపు ధర్మాన ప్రసాదరావు.. ఆధ్యాత్మిక కార్యక్రమాలపై దృష్టి సారించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబoతో కలిసి దేవాలయాలకు వెళుతున్నారు. దీంతో ధర్మాన తన కుమారుడ్ని రాజాకీయల్లో యాక్టివ్ చేసి తన శేష జీవితాన్ని ప్రశాంతంగా గడపాలని నిర్ణయించుకుని ఉంటారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

Dharmana Prasada Rao

 

There are four airports in AP | ఏపీలో నాలుగు ఎయిర్ పోర్టులు | Eeroju news

Related posts

Leave a Comment