AP free gas bookings | ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం | Eeroju news

ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం

ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం

విజయవాడ, అక్టోబరు 26, (న్యూస్ పల్స్)

AP free gas bookings

ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్‌. ప్రభుత్వం దీపావళి ధమాకా వార్త చెప్పింది. ఈ నెల 29 నుంచి ఉచిత గ్యాస్‌ పథకం బుకింగ్స్‌ ప్రారంభమవుతందన్నారు ఏపీ మంత్రి నాదెండ్ల మనోహర్. ఈనెల 31 నుంచి మార్చి 31 వరకు మొదటి సిలిండర్‌ ఎప్పుడైనా తీసుకోవచ్చని అన్నారు. గ్యాస్ కనెక్షన్ ఉండి… తెల్ల రేషన్ కార్డు, ఆధార్ ఉన్నవాళ్లు ఈ పథకానికి అర్హులని అన్నారు. అర్హత ఉన్న ప్రతీ కుటుంబం అక్టోబర్ 31 నుంచి మార్చ్ 31 వరకు మొదటి సిలిండర్ ఎప్పుడైనా తీసుకోవచ్చని చెప్పారు.

గ్యాస్ సిలిండర్ అందిన వెంటనే మీరు డబ్బు చెల్లిస్తే 48 గంటల్లో ప్రభుత్వం తిరిగి డీబీటీ ద్వారా నగదు వెనక్కి ఇచ్చేస్తుందన్నారు. ఏమైనా ఇబ్బందులు ఉంటే 1967 కు కాల్ చేసి సేవలు పొందొచ్చని మంత్రి చెప్పారు. వీలైనంత ఎక్కువ మందికి పథకాలు అందేలా చర్యలు తీసుకుంటామని.. ప్రస్తుతం 1.47 కోట్లు వైట్ రేషన్ కార్డ్స్ ఉన్నట్లు వెల్లడించారు. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నారని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు.

అధికారంలోకి వస్తే ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఉస్తామని కూటమి హామీ ఇచ్చింది. ఆ హామీ మేరకు ఆ పథకాన్ని అమలుచేస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ దీపావళి నుంచి ఈ పథకం అమలులోకి వస్తుంది. అర్హులైన వారందరికీ ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లను ప్రభుత్వం ఉచితంగా ఇవ్వనుంది. ఈ పథకానికి ఏడాదికి 2వేల 684 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

ఫ్రీ గ్యాస్ బుకింగ్స్ ప్రారంభం

 

Funds into beneficiary accounts of gas cylinders within 48 hours | 48 గంటల్లో గ్యాస్ సిలిండర్ల లబ్దిదారుల ఖాతాల్లోకి డబ్బులు | Eeroju news

Related posts

Leave a Comment