Revanth Reddy | రేవంత్ మౌనానికి కారణం ఏమిటో… | Eeroju news

రేవంత్ మౌనానికి కారణం ఏమిటో...

రేవంత్ మౌనానికి కారణం ఏమిటో…

హైదరాబాద్, అక్టోబరు 25, (న్యూస్ పల్స్)

Revanth Reddy

ధరలు పెంచింతే.. ఆదాయం వచ్చేది, ఖజానా నిండేది.. ఆరు గ్యారంటీలు అమలయ్యేది. ఇదీ సీఎం రేవంత్‌కు అధికారులు చేసిన ప్రతిపాదన. మద్యం ధరలు.. విద్యుత్‌, ఎల్‌ఆర్ఎస్ చార్జీలు పెంచేద్దామని సూచించగా.. రేవంత్‌ పెదవి విరిచినట్లు టాక్. ప్రస్తుతానికి ఇవన్నీ పక్కనపెట్టమని చెప్పారట. రేవంత్ నిర్ణయం వెనక కారణం ఏంటి.. అధికారుల ప్రతిపాదనలపై మౌనానికి కారణం ఏంటి.. సచివాలయవర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి..తెలంగాణ సర్కార్‌.. ఆర్ధిక ఇబ్బందులతో అల్లాడుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల హామీల అమలుతో పాటు.. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల కోసం నిధుల కొరత రేవంత్ సర్కార్‌ను తీవ్రంగా వేధిస్తోంది. ఇప్పటికే రైతు రుణమాఫీ కోసం సుమారు 18 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసిన తెలంగాణ ప్రభుత్వం..

2లక్షలపైన పంట రుణాలను మాఫీ చేసేందుకు కావాల్సిన 13వేల కోట్ల రూపాయల నిధుల కోసం వేట కొనసాగిస్తోంది.ఇక అటు గతేడాది డిసెంబర్‌లో అమలు చేయాల్సిన రైతుభరోసా.. ఇంతవరకు అమలు చేయలేదు. రైతుభరోసా కోసం కనీసం 20 వేల కోట్ల రూపాయలు కావాలని అంచనా. ఆరు గ్యారంటీల హామీల్లోని మహిళలకు నెలకు 25వందల రూపాయల పధకం అమలు చేయాల్సి ఉంది. దళితబంధు, మూసీప్రక్షాళనలాంటి ఎన్నో అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలకు నిధుల కొరత ఉంది.ఓ వైపు హామీలు.. మరోవైపు అభివృద్ధి పథకాలు.. వీటన్నంటికి నిధుల కోసం.. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సీఎం రేవంత్, ఆర్ధిక మంత్రి భట్టి విక్రమార్క వివిధ శాఖల అధికారులను ఆదేశించారు.

రెండు నెలల పాటు కసరత్తు చేసి ఆదాయపెంపుపై.. ఆ అధికారులు ప్రభుత్వానికి సిఫారసులు చేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా భూముల రిజిస్ట్రేషన్ చార్జీలను పెంచాలని అందులో సూచించారని తెలుస్తోంది. రాష్ట్రంలో మద్యం ధరలను పెంచాలని కూడా చెప్పారట.ఎక్సైజ్ శాఖ ద్వారా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుండగా.. మద్యం ధరలను పెంచితే… ఆదాయం పెరుగుతుందని ప్రపోజల్ పెట్టారని తెలుస్తోంది. అటు విద్యుత్ చార్జీలను కొంతమేర పెంచే అవకాశాన్ని పరిశీలించాలని రేవంత్ సర్కార్‌కు అధికారులు సూచించారని టాక్‌. గృహ వినియోగదారులకు 2వందల యూనిట్ల వరకు ఎలాగూ ఉచితంగా అందిస్తున్నాం కాబట్టి.. మిగతా సెక్టార్లతో పాటు.. కమర్షియల్ విద్యుత్ చార్జీలు కొంత పెంచితే ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని అధికారులు సూచించారట.

ఇక హైదరాబాద్‌లో విలువైన భూములను అమ్మేద్దామనే మరో ప్రతిపాదనను కూడా తెలంగాణ ప్రభుత్వం ముందుపెట్టారట అధికారులు. తొమ్మిదిన్నరేళ్ల కాలంలో బీఆర్ఎస్ సర్కార్‌ హైదరాబాద్‌లో సుమారు 15వేల కోట్ల రూపాయల భూములను అమ్మేసిందని.. హైదరాబాద్, రంగారెడ్డిలో విలువైన ప్రభుత్వ భూములు ఇంకా ఉన్నాయని.. వాటిలో కొంతమేర అమ్మకాలు జరిపితే.. ఇప్పటికిప్పుడు సుమారు 10వేల కోట్ల రూపాయలను సమకూర్చుకోవచ్చని అధికారులు ప్రపోజల్స్ పెట్టారని తెలుస్తోంది.భూములను అమ్మకపోతే.. కనీసం ఆర్బీఐకి తాకట్టు పెట్టడం ద్వారా కూడా రుణం పొందవచ్చని ప్రతిపాదించారట. మరోవైపు ఎల్ఆర్ఎస్‌పై ఇప్పటికే కసరత్తు మొదలుపెట్టగా.. గతంలో నిర్ణయించిన చార్జీల కంటే.. కాస్త పెంచేద్దామని అధికారులు సూచించారని సమాచారం.

ఇలా ప్రభుత్వ ఆదాయాన్ని పెంచేందుకు అధికారులు పలురకాల ప్రతిపాదనలు చేశారని సచివాలయ వర్గాల సమాచారం.ఐతే ఆదాయ పెంపుపై అధికారులు ఇచ్చిన ప్రతిపాదనలపై.. సీఎం రేవంత్ పెదవి విరిచారని తెలుస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలుదీరి ఏడాది కాకముందే ఇలా హైదరాబాద్‌లో భూములు అమ్మేస్తే.. బీఆర్ఎస్ సర్కార్‌కు, తమకు తేడా ఏముంటుందని రేవంత్ భావిస్తున్నారట. భూముల రిజిస్ట్రేషన్ విలువ ఎలాగూ పెంచుతున్నాం.. మళ్లీ ఎల్ఆర్ఎస్ చార్జీలను పెంచడం సరికాదని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారని అంటున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ ద్వారా భారీగానే ఆదాయం వస్తుండగా.. మళ్లీ మధ్యం ధరలను పెంచితే జనాల నుంచి ఎలాంటి స్పందన వస్తుందోనన్న సందేహాన్ని కూడా వ్యక్తం చేశారట.

విద్యుత్ చార్జీలను పెంచితే.. జనం నుంచి వ్యతిరేకత రావడంతో పాటు పారిశ్రామికవర్గాల నుంచి కూడా ఆందోళనలు వచ్చే ఛాన్స్ ఉందని భావిస్తున్నారట. ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు కాకముందే.. ఇలా ధరలు, చార్జీలు పెంచితే ప్రతిపక్షాలతో పాటు జనాల నుంచి వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందని.. ఆదాయ పెంపు ప్రతిపాదనలను కొన్నాళ్లపాటు పక్కనపెట్టాలని అధికారులకు రేవంత్‌ చెప్పారని సమాచారం. దీంతో ఆదాయం ఎలా పెంచాలో అర్థం కాక.. అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారట.

రేవంత్ మౌనానికి కారణం ఏమిటో...

 

Revanth | కేడర్ ను సిద్ధం చేస్తున్న రేవంత్ | Eeroju news

Related posts

Leave a Comment