BRS | మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..? | Eeroju news

మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..?

మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..?

ముంబై, అక్టోబరు 24, (న్యూస్ పల్స్)

BRS

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి గులాబీ పార్టీ దూరమైంది. గులాబీ పార్టీ పోటీ చేయడం లేదన్న సంకేతాలు ఇవ్వడంతో మహారాష్ట్రకు చెందిన ఆ పార్టీ నేతలు మహారాష్ట్ర రాజ్యసమితి పేరుతో అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీ అవుతున్నారు. మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్ పేరుతో వివిధ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలు ఒక్కటిగా ఎన్నికల బరిలో ఉండాలని నిర్ణయం తీసుకున్నాయి. దీంతో మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలని భావించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సమితి పేరును భారత రాష్ట్ర సమితిగా మార్చారు.

ఆ తర్వాత జరిగిన రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోవటంతో ఇక జాతీయ రాజకీయాలపై ఏ మాత్రం ఫోకస్ పెట్టడం లేదని టాక్. మహారాష్ట్ర పై కేసీఆర్ అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఏర్పాట్లు కూడా చేశారు. రైతు సమస్యలే ప్రధాన అజెండాగా ప్రస్తావిస్తూ రైతు సంఘాలను ఏకతాటిపైకి తెచ్చారు.గతంలో గులాబీ పార్టీ మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభ్యత్వ నమోదు చేపట్టింది. నెల రోజుల పాటు జరిగిన ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో దాదాపు 20 లక్షల మంది గులాబీ పార్టీలో చేరారు.

ఆ తర్వాత తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలైంది. మూడోసారి అధికారంలోకి వస్తామని భావించినా.. అధికారం దక్కపోవడంతో కేసీఆర్ జాతీయ రాజకీయాలవైపు చూడటం లేదట.దాదాపు ఏడాదిన్నర పాటు మహారాష్ట్ర రాజకీయాల్లో హల్ చల్ చేసిన మహా గులాబీ నేతలు.. కేసీఆర్ నిర్ణయంతో ఒక్కసారిగా సైలెంట్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల నాటికి కేసీఆర్.. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీపై నిర్ణయం తీసుకుంటారని భావించినా వారికి నిరాశే ఎదురైంది.

బీఆర్ఎస్ లో చేరిన ఎంతో మంది వివిధ పార్టీల నేతల్లో కొందరు ప్రధాన రాజకీయ పార్టీల్లో చేరిపోగా, మరికొందరు ఒకటిగా చేరి మహారాష్ట్ర రాజ్యసమితి పేరుతో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.అదే విధంగా మహా రాజకీయాల్లో రైతు సంఘాల పాత్ర కీలకం కావడంతో రైతు సంఘాల నేతలంతా మహారాష్ట్ర పరివర్తన్ ఫ్రంట్ పేరుతో ఒక్కటయ్యారు. ఫ్రంట్ లో కీలక పాత్ర పోషిస్తూనే 80 నియోజకవర్గాల్లో మహారాష్ట్ర రాజ్యసమితి అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉండాలన్న లక్ష్యంగా అడుగులు వేస్తున్నారట.

మహారాష్ట్ర ఎన్నికల్లో ..బీఆర్ఎస్..?

 

BRS | బీఆర్ఎస్ లో ఏం జరుగుతోంది..? | Eeroju news

Related posts

Leave a Comment