Telangana | తెలంగాణ ఆదాయం తగ్గింది | Eeroju news

తెలంగాణ ఆదాయం తగ్గింది

తెలంగాణ ఆదాయం తగ్గింది

హైదరాబాద్

Telangana

మాజీ ఎంపీ బి .వినోద్ కుమార్ తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ లో ఆర్థిక అంశాల పై మాట్లాడారు. .ఆర్థిక శాఖ పై సచివాలయం లో సమీక్ష చేసినపుడు సీఎం ఓ రకంగా ఐఎస్బీ కార్యక్రమం లో మరో రకంగా మాట్లాడారు. రాష్ట్రానికి మద్యం ఆదాయం మినహా అన్నిటిలో తగ్గింది. సీఎం రాష్ట్ర ఆదాయం తగ్గుదల విషయం లో ఉన్నట్టు పత్రికల్లో వార్తలు వస్తున్నాయి. .రాష్ట్రానికి ఆదాయం ఎందుకు తగ్గిందని సీఎం లోతుగా సమీక్ష చేయడం లేదు రేవంత్ పదినెలల్లో ఏ వర్గం లో విశ్వాసం నమ్మకం కలిగించలేకపోయారు ..అందుకే ఆదాయం తగ్గిందని అన్నారు.

హైడ్రా కూల్చివేతల ప్రభావం రియల్ ఎస్టేట్ రంగం పై పడింది. రాష్ట్రానికి పెట్టుబడులు రావడం లేదు. ఎకానమీ లో డబ్బులు పంప్ చేయడం అనేది ప్రధానమైన విషయం ..కేసీఆర్ అదే చేశారు. .కరోనా సమయం లోనూ కేసీఆర్ రైతుబంధు డబ్బులు ఇచ్చారు. కరోనా తర్వాత ఆర్థికంగా రాష్టం వీ షేప్ లో కోలుకుంది. వంత్ పాలన లో జీరో షేప్ గా మారింది. తెలంగాణ జి ఎస్ డి పి ని వన్ ట్రిలియన్ ఎకానమీ గా మారుస్తా అని రేవంత్ అంటున్నారు. ముంబై మహానగరం ఎకానమీ 300 బిలియన్ డాలర్లే. హైదరాబాద్ ఎకానమీ ని 600 బిలియన్ల డాలర్ల కు రేవంత్ చేరుస్తా అంటున్నారు ..కానీ పాలన తీరు అలా లేదు.

కేసీఆర్ 200 బిలియన్ డాలర్ల స్థాయికి అంటే 16 లక్షల కోట్ల స్థాయికి తీసుకెళ్లారు. .కేసీఆర్ ఓ విజన్ తో వ్యవహరించడం లో అది సాధ్యపడింది. కేసీఆర్ హయం లో అప్పుల విషయంలో ప్రతి రోజూ రేవంత్ తప్పులు ప్రచారం చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో అప్పుల పై వడ్డీ అత్యంత తక్కువ కడుతున్నది తెలంగాణే . రేవంత్ రెడ్డి ,మంత్రులు కాంగ్రెస్ నేతలకు ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా ..తెలంగాణ ను బద్నాం చేయకండి ..చంపకండని అన్నారు. కేసీఆర్ అప్పులు చేసినా ఆస్తులు నిర్మించారు. లక్ష కోట్ల లోపే ఖర్చు చేసి కాళేశ్వరం తో కేసీఆర్ లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చారు.

రేవంత్ ముప్పై కిలోమీటర్ల మూసి కి లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తున్నాడు. పదినెలలైనా రేవంత్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బలోపేతానికి ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సొంత గడ్డపై కేసీఆర్ కు ప్రేమ ఉండబట్టే ఆర్థిక పరిస్థితి ని బలోపేతం చేసే చర్యలు తీసుకున్నారు. .జీవో 29 పై సుప్రీం కోర్టు బంతిని హై కోర్టు కే చేర్చింది. రిజర్వేషన్లపై రేవంత్ ప్రభుత్వానికి రాజ్యాంగ స్ఫూర్తి కొరవడింది. ఓపెన్ కేటగిరీ లో గ్రూప్ వన్ మెయిన్స్ పరీక్షను 1 : 50 కాకుండా 1:65 రాస్తున్నారు. పాత సాంప్రదాయాలకు రాష్ట్ర ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని అన్నారు.

తెలంగాణ ఆదాయం తగ్గింది

 

Rains in Telangana | తెలంగాణలో రాగల మూడురోజులు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు | Eeroju news

Related posts

Leave a Comment