Election Commission | ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్ | Eeroju news

ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్

ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్

న్యూఢిల్లీ, అక్టోబరు 15, (న్యూస్ పల్స్)

Election Commission

భారతదేశంలో మరో మినీ ఎన్నికల సమరానికి వేళ అయ్యంది. దేశంలోనే జీఎస్డీపీ, జీడీపీలో నెంబర్ వన్ గా ఉన్న మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్‌ రాష్ట్రానికి అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాష్ట్రాల్లో ఎన్నికల సందడి నెలకొంది. రాజకీయ ప్రసంగాలు, నేతల ప్రచారాలు, కౌంటర్లు, ప్రతి కౌంటర్లతో వేడి వాతావరణం సంతరించుకోనుంది.ఈ మేరకు భారత ఎన్నికల సంఘం (సీఈసీ) ఈ వారం ఎన్నికల నోటిఫికేషన్ ను ప్రకటించే అవకాశం ఉందని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇక వచ్చే నెలలో అంటే నవంబర్‌ రెండో వారం కానీ మూడో వారంలో కానీ ఎన్నికలు నిర్వహించనుంది కేంద్ర ఎన్నికల సంఘం.

ఈ క్రమంలోనే షెడ్యూల్ ఖరారు చేసేందుకు కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది.ఉత్తర్‌ప్రదేశ్‌లోని రాయబరేలీ పాటు వయనాడ్‌ సీట్ గెలిచిన రాహుల్ గాంధీ, వయనాడ్ స్థానాన్ని వదులుకున్నారు. దీంతో ఆ స్థానం ఖాళీగా మారింది. అయితే ఇది దక్షిణ భారతంలోని కేరళలో ఉంది. ఈ స్థానాన్ని ఈసారి కూడా కాంగ్రెస్ పార్టీ దక్కించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్టు సమాచారం.

తాజాగా హరియాణా, జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో పాటు ఫలితాలు సైతం వెల్లడయ్యాయి. ఇక ప్రభుత్వాలు కొలువుదీరడం తరువాయిగా నిలుస్తోంది. ఆర్టికల్‌ 370 రద్దు తర్వాతే జమ్ముకశ్మీర్‌లో ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించింది భారత ఎన్నికల సంఘం. ఇప్పుడు దేశ ఆర్థిక రాజధాని, సూపర్ మెట్రో సిటీ ముంబయి ఉన్న మహారాష్ట్ర, కోల్ స్టేట్ ఝార్ఖండ్‌ రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలను సైతం నిర్వహించేందుకు ఈసీ ప్రక్రియను వేగవంతం చేసింది.త్వరలోనే ఈ రెండు రాష్ట్రాలకు శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది.

అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 3 మధ్యలో దీపావళి, ఛత్‌ పూజ వంటి పెద్ద పండుగలున్నాయి. దీంతో ఎన్నికలను నవంబర్‌ రెండు లేదా మూడో వారంలో నిర్వహిస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో ఈసీ ఉన్నట్లు సమాచారం.ఈ రెండు ముఖ్యమైన పండుగల సమయంలో మహారాష్ట్రలోని బిహారీ ఓటర్లు తమ సొంత రాష్ట్రానికి, స్వస్థలాలకు వెళ్తారు. ఓటింగ్ శాతం పెంచేందుకు కృషి చేస్తున్న ఈసీ, ఎన్నికలను నవంబర్‌ తొలివారం తర్వాతే ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు సమాచారం.

45 సీట్లలో బైపోల్…
మహారాష్ట్ర, ఝార్ఖండ్‌ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అధిక స్థానాల్లో సీఈసీ బైపోల్స్ నిర్వహించనుందని అధికార వర్గాలు అంటున్నాయి.పలు రాష్ట్రాల్లోని దాదాపు 45 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండు లోక్ సభ స్థానాలకు బైపోల్స్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నాయి. ఇక పశ్చిమ బంగాల్లోని బసిర్‌హట్‌ ఎంపీ, తృణమూల్‌ కాంగ్రెస్‌ నేత షేక్‌ నూరల్‌ ఇస్లాం మృతి చెందడంతో బైపోల్ జరగాల్సిన అనివార్య పరిస్థితి నెలకొంది. దీంతో దేశవ్యాప్తంగా మరో మినీ సార్వత్రిక ఎన్నికల సమరం మొదలుకానుంది. కేంద్రంలోని అధికార బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీలు రాష్ట్రాలకు చెందిన స్థానిక రాజకీయ పార్టీలతో తలపడనున్నాయి. మహారాష్ట్రతో పాటు ఝార్ఖండ్ రాష్ట్రాల్లో అధికార పార్టీ తన ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటుందా లేక ప్రతిపక్షంలోకి మారిపోతుందా అన్నది త్వరలోనే తేలిపోనుంది.

ఈ వారంలోనే మహారాష్ట్ర, జార్ఖండ్ నోటిఫికేషన్

Is the calculation of NEET clear | నీట్ లెక్క తేలినట్టేనా | Eeroju news

Related posts

Leave a Comment