Telangana | వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు | Eeroju news

వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు

వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు

హైదరాబాద్

Telangana

హైదరాబాద్సచివాలయంలో తెలంగాణ వికలాంగుల జాబ్ పోర్టల్ ను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క సోమవారం ఆవిష్కరించారు. మహిళా సంక్షేమ శాఖ డైరెక్టరెట్ హెల్ప్ లైన్ లో పదిమందికి అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేసారు. ఈ కార్యక్రమానికి హాజరైన మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, వికలాంగుల సహకార కార్పొరేషన్ చైర్మన్ వీరయ్య, దివ్యాంగులు వయోవృద్ధులు సాధికారత శాఖా జేడీ శైలజ తదితరులు హజరయ్యారు.

మంత్రి సీతక్క మాట్లాడుతూ ఉపాధి రంగాల్లో దివ్యాంగులకు అవకాశాలు తక్కువ . ఇతర వర్గాల వర్గాల వారిలా ఫైట్ చేయాలంటే ఎన్నో అవరోధాలు వున్నాయి. శారీరకంగా వచ్చే లోపం మన చేతిలో లేదు. పోషకాహార లోపం,ప్రమాదం వల్ల వికలాంగులుగా మారే ప్రమాదం వుంది. అందుకే వాళ్లకి ఉపాది అవకాశాలు కల్పించేందుకు ఆన్లైన్ జాబ్ పోర్టల్ ను ప్రారంభిస్తున్నామని అన్నారు. ప్రైవేటు ఉద్యోగాల్లో వికలాంగులకు రిజర్వేషన్లు పాటించాలి. దివ్యాంగులు కంపెనీల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. ఆన్లైన్ జాబ్ పోర్టల్ లో రిజిస్టర్ చేసుకుంటే చాలు.

వారి అర్హతను బట్టి ఉద్యోగాలు వస్తాయి. దుకోసమే పోస్టల్ లో అందుబాటులోకి తెచ్చాము. సంక్షేమ నిధుల్లో ఐదు శాతం దివ్యాంగులకు కేటాయిస్తున్నాం. ప్రైవేట్ జాబ్లో నాలుగు శాతం రిజర్వేషన్లు కల్పించాలని ప్రయత్నిస్తున్నామని అన్నారు. గతంలో ఒక శాతం ఉంటే దాన్ని నాలుగు శాతానికి పెంచెందుకు ప్రయత్నిస్తున్నాం. ఇందిరమ్మ ఇండ్లు వంటి సంక్షేమ పథకాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు పాటిస్తాం. సబిలిటీని దృష్టిలో పెట్టుకొని వారిని ముందుకు తీసుకురావడానికి మా ప్రభుత్వం కృషి చేస్తోంది. సంక్షేమము, విద్యా, ఉద్యోగ రంగంలో దివ్యాంగులకు చేయూతనిచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి వుందని అన్నారు.

వికలాంగులకు ప్రైవేటు రంగంలో నాలుగు శాతం రిజర్వేషన్లు

 

Minister Sitakka met with Union Minister Shivraj Chauhan | కేంద్రమంత్రి శివరాజ్ చౌహన్ తో మంత్రి సీతక్క భేటీ | Eeroju news

Related posts

Leave a Comment