Nara Lokesh | పట్టుబిగిస్తున్న నారా లోకేష్ | Eeroju news

పట్టుబిగిస్తున్న నారా లోకేష్

పట్టుబిగిస్తున్న నారా లోకేష్

విజయవాడ, అక్టోబరు 9, (న్యూస్ పల్స్)

Nara Lokesh

నారా లోకేష్ పై ప్రత్యర్థులు చేయని ప్రచారం లేదు. కానీ తనకు తానుగా పనితనం నిరూపించుకుని ముందుకు సాగారు లోకేష్. ఈ ఎన్నికల్లో ఘనవిజయం సాధించారు. పోగొట్టుకున్న చోట వెతుక్కున్నారు. గెలిచిన తర్వాత హంగు ఆర్భాటానికి దూరంగా ఉన్నారు. తనకు దక్కిన మంత్రి పదవులను సద్వినియోగం చేసుకుంటున్నారు. తనదైన మార్కు కనిపించేలా చూస్తున్నారు. ముఖ్యంగా ఏపీ విద్యా వ్యవస్థలో సమూల మార్పులకు శ్రీకారం చుట్టారు.గత ఐదేళ్ల వైసిపి పాలనలో విద్యావ్యవస్థలో అనేక లోపాలు వెలుగు చూశాయి. వాటిని సరి చేసే పనిలో ఉన్నారు లోకేష్.

నాడు నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చామని వైసిపి ప్రజాప్రతినిధులు చెప్పుకుంటూ వచ్చారు.కానీ వాస్తవ పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉంది.పాఠశాలల సర్దుబాటు,విలీన ప్రక్రియతో వేలాది విద్యాసంస్థలు వృధాగా ఉన్నాయి.వాటిని వినియోగంలోకి తెచ్చేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.విద్యారంగ సమస్యలపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.సాధారణంగా ముందు ప్రభుత్వ పథకాలకు తర్వాత వచ్చే ప్రభుత్వం మంగళం పలకడం వైసిపి నుంచి ప్రారంభం అయింది.కానీ అందుకు విరుద్ధంగా లోకేష్ విద్యావ్యవస్థలో జగన్ ప్రవేశపెట్టిన పథకాలపై ఫోకస్ పెట్టారు.

విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలపై ఆరా తీశారు. వాటి చెల్లింపులకు ఆదేశాలు జారీ చేశారు.ఇటీవల విశాఖలో పర్యటించారు నారా లోకేష్.అక్కడ వివిధ అభివృద్ధి పనుల్లో పాల్గొన్నారు. పార్టీ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ సెల్ లో వినతులు స్వీకరించారు. కేవలం లోకేష్ పర్యటన షెడ్యూల్ విశాఖకే పరిమితం అయింది. కానీ అదే సమయంలో శ్రీకాకుళం జిల్లాలోని ఓ పాఠశాల లో భవనం పైనుంచి జారిపడి ఓ విద్యార్థి మృతి చెందాడు. కేవలం నాడు నేడు పథకంలో భాగంగా చేపట్టిన నిర్మాణంలో నిర్లక్ష్యం మూలంగా ఆ బాలుడు ప్రాణం కోల్పోయాడు. దీనిపై లోకేష్ స్పందించారు.

ఎటువంటి హంగు ఆర్పాటం లేకుండా.. శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వెళ్లారు. పాఠశాలల్లో నాడు నేడు భవనాల పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. వీలైనంత త్వరగా ఈ పనులను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.లోకేష్ రాష్ట్ర మంత్రి. ఆపై ముఖ్యమంత్రి తనయుడు. తెలుగుదేశం పార్టీకి భావినేత. కానీ ఇవేవీ లోకేష్ పట్టించుకోలేదు. స్వయంగా పార్టీ శ్రేణులతో మమేకం అవుతున్నారు. రాష్ట్రమంత్రిగా తన శాఖల ప్రగతిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. గెలిచిన వెంటనే తనను గెలిపించిన మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రజాదర్బార్ను ప్రారంభించారు.

రోజులో కొద్ది గంటలను వారికోసం కేటాయిస్తున్నారు. అయితే అలా ప్రారంభించిన వినతుల విభాగం ఒక్క మంగళగిరి నియోజకవర్గ ప్రజలతో ఆగడం లేదు.రాష్ట్ర నలుమూలల నుంచి వస్తున్న ప్రజలు నేరుగా లోకేష్ కు పత్రాలు అందిస్తున్నారు.అయితే పార్టీలోనూ లోకేష్ మార్క్ స్పష్టంగా కనిపిస్తోంది.గత ఐదేళ్లుగా ఆయన వ్యవహరించిన తీరు కూడా టిడిపి శ్రేణులను ఆకట్టుకుంది.టిడిపి శ్రేణుల సమన్వయంతో సాధించిన ఈ గెలుపుతో.. వారికి న్యాయం చేయాలన్న ప్రయత్నంలో లోకేష్ ఉన్నారు.అందుకే నామినేటెడ్ పోస్టుల భర్తీ బాధ్యతను చంద్రబాబు లోకేష్ కు అప్పగించారు.మున్ముందు లోకేష్ ప్రభుత్వంతో పాటు పార్టీలో యాక్టివ్ రోల్ ప్లే చేసే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

పట్టుబిగిస్తున్న నారా లోకేష్

The reins of Telangana TDP are Nara Lokeshka.. Brahmanika | తెలంగాణ టీడీపీ పగ్గాలు నారా లోకేష్‌కా..బ్రాహ్మణికా.! | Eeroju news

Related posts

Leave a Comment