Akkineni Nagarjuna argument | కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన | Eeroju news

కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన

కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన

హైదరాబాద్, అక్టోబరు 9, (న్యూస్ పల్స్)

Akkineni Nagarjuna argument

ప్రముఖ సినీ నటుడు నాగార్జున తాజాగా కోర్ట్ ముందు హాజరై.. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పై చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. తాజాగా కోర్టు ముందు హాజరైన నాగార్జున మాట్లాడుతూ.. మంత్రి కొండా సురేఖ మాట్లాడిన మాటలు అన్నీ కూడా అసత్య ఆరోపణలు. రాజకీయ దురుద్దేశంతోనే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేసింది. ఎంతో పేరు ప్రతిష్టలు ఉన్న మా కుటుంబం పై ఇలాంటి ఆరోపణలు చేయడం మమ్మల్ని మనోవేదనకు గురి చేసింది అంటూ తెలిపినట్టు సమాచారం.ముఖ్యంగా మంత్రి మాట్లాడిన మాటలు అన్నీ కూడా టెలివిజన్ ఛానల్స్ ప్రసారం చేశాయి. అన్ని పేపర్స్ కూడా ప్రచురితం చేశాయి. దీనివల్ల మా కుటుంబం మరింత మానసిక క్షోభ అనుభవిస్తోంది.

సినిమా రంగం ద్వారా మా కుటుంబానికి ఎంతో మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. మా కుటుంబం పట్ల ప్రజలు ఆదరాభిమానాలు చూపిస్తున్నారు. జాతీయస్థాయిలో అనేక అవార్డులు కూడా వచ్చాయి. ముఖ్యంగా సినిమా రంగంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా మేము చేస్తున్నాము. మా కొడుకు విడాకులు మాజీ మంత్రి కేటీఆర్ వల్ల అయ్యాయి అని, మంత్రి కొండా సురేఖ అసభ్యంగా మాట్లాడారు. అలా మాట్లాడటం వల్ల మా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లింది. కాబట్టి కొండా సురేఖ పై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను అంటూ నాగార్జున కోర్టు ముందు కోరినట్లు సమాచారం.

ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ప్రస్తుతం నాగార్జున కోర్టు ముందు కొండా సురేఖ పై క్రిమినల్ కేస్ ఫైల్ చేయాలని చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారుతున్నాయి.అసలు విషయంలోకెళితే తెలంగాణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్ పై ఆగ్రహంతో సినీ సెలబ్రిటీలపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా సమంత – నాగచైతన్య విడిపోవడానికి ప్రధాన కారణం కేటీఆర్ అని, ఆమె చేసిన కామెంట్లు సర్వత్రా వైరల్ అయ్యాయి. అంతేకాదు ఎన్ – కన్వెన్షన్ హాల్ గతంలోనే కూల్చివేయాలని చెప్పగా.. నాగార్జున కూల్చివేయకూడదని కేటీఆర్ ను అడిగారని, అయితే కేటీఆర్ తన వద్దకు సమంతను పంపిస్తే ఆ కూల్చివేతను ఆపేస్తానని కేటీఆర్ చెప్పారు.

అయితే నాగార్జున కూడా తనకు భారీ ఆదాయాన్ని ఇచ్చే కన్వెన్షన్ కూల్చివేతను తట్టుకోలేక.. సమంతను కేటీఆర్ దగ్గరకు పంపించే ప్రయత్నం చేశారు. కానీ సమంత నాగార్జునతో గొడవకు దిగింది. ఈ నేపథ్యంలోనే సమంత – నాగచైతన్యకు విడాకులు ఇప్పించారు అంటూ అసత్య ప్రచారాలు చేస్తూ కొండా సురేఖ చేసిన కామెంట్లపై సినీ ఇండస్ట్రీ ఒక్కసారిగా భగ్గుమందిముఖ్యంగా సినీ సెలబ్రిటీలంతా ఏకతాటిపై నిలిచి అటు అక్కినేని కుటుంబానికి ఇటు సమంతాకు అండగా నిలిచారు. ఈ కుటుంబం పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కొండా సురేఖ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వరుస ట్వీట్స్ వేశారు.

చిరంజీవి, రవితేజ , ఎన్టీఆర్, అల్లు అర్జున్, కిరణ్ అబ్బవరం ఇలా ఎంతోమంది హీరోలు మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చేసిన కామెంట్లకు దిగివచ్చిన కొండా సురేఖ సమంతకు సారీ చెప్పింది. కానీ అక్కినేని కుటుంబానికి ఎటువంటి క్షమాపణలు కోరలేదు.నాగార్జున వేసిన పరువునష్టం పిటిషన్ పై నాంపల్లి కోర్టులో సోమవారం విచారణ జరిగింది. సీనియర్ న్యాయవాది అశోక్ రెడ్డి ఆయన తరఫున వాదనలు వినిపించారు. తెలంగాణ మంత్రి కొండా సురేఖ నటుడు నాగార్జున కుటుంబంపై అనుచిత వ్యాఖ్యలు చేశారని.. ముఖ్యంగా నటీనటులు నాగ చైతన్య, సమంత విడాకులపై చేసిన వ్యాఖ్యలు వారి కుటుంబం పరువు ప్రతిష్టలు దిబ్బతినేలా ఉన్నాయని వాదనలు వినిపించారు.

వాదనలు విన్న కోర్టు పిటిషనర్ నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేయాలని.. ఆయనను కోర్టుకు హాజరు కావాలని, సాక్షులు సైతం రావాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలతో నాగార్జున, అమల, నాగచైతన్య నాంపల్లి కోర్టుకు మంగళవారం మధ్యాహ్నం హాజరయ్యారు. వీరితో పాటు నాగార్జున ఓ సోదరి, ఆయన మేనకోడలు సుప్రియ ఇతర సాక్షులు కోర్టుకు హాజరయ్యారు. నాగార్జున స్టేట్ మెంట్ రికార్డు చేసుకున్న కోర్టు మంత్రి కొండా సురేఖపై చర్యలు తీసుకుంటారా, లేక మందలించి వదిలేస్తారా అనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. దీంతో పరువు నష్టం దావా వేసిన నాగార్జున నేడు కోర్టు ముందు హాజరై ఈ విధంగా మాట్లాడినట్లు సమాచారం

కొండా సురేఖపై క్రిమినల్ కేసు పెట్టండి కోర్టులో అక్కినేని నాగార్జున వాదన

కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత భావోద్వేగం..|Samantha is emotional on Konda Surekha’s comments..

Related posts

Leave a Comment