Nagarjuna | మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా | Eeroju news

మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా

మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా

హైదరాబాద్‌ అక్టోబర్ 5

Nagarjuna

అక్కినేని కుటుంబంపై మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల కోర్టులో అక్కినేని నాగార్జున పరువు నష్టం దావా వేశారు. సెక్షన్‌ 356 బీఎన్‌ఎస్‌ కింద చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు. అయితే న్యాయమూర్తి సెలవులో ఉండటంతో విచారణ వాయిదా పడింది. సోమవారం దీనిపై విచారణ జరుగనుంది.

మంత్రి సురేఖ మీడియా సమావేశంలో మాట్లాడిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో, టీవీల్లో, పత్రికల్లో ప్రధానంగా వచ్చాయని నాగార్జున తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ కథనాల క్లిప్పింగులను కోర్టుకు సమర్పించారు. మంత్రి వ్యాఖ్యలతో తాను షాక్‌కు గురయ్యానని, అక్కినేని కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలకు భంగం కలిగించారని పిటిషన్‌లో వివరించారు.

కేటీఆర్‌పై తప్పుడు ఆరోపణలు చేశారని, కన్వెన్షన్‌హాల్‌ కూల్చడానికి, మంత్రి వ్యాఖ్యలకు ఎలాంటి సంబంధంలేదని తెలిపారు.కన్వెన్షన్‌ సెంటర్‌ తనకు (నాగార్జున) చెందినదని, నాగచైతన్య-సమంత విడాకులకు లింక్‌ లేదని, కేటీఆర్‌పై నిందారోపణలు చేసి అక్కినేని కుటుంబానికి ఉన్న పరువుకు నష్టం కలిగించేలా ఆమె వ్యాఖ్యలు చేశారని పేర్కొన్నారు. జాతీయ చానళ్లు కూడా మంత్రి మీడియా సమావేశాన్ని ప్రసారం చేశాయని తెలిపారు.

బిగ్‌బాగ్‌ హోస్ట్‌గా, సినిమా హీరోగా, నిర్మాతగా తనకు, తమ కుటుంబానికి ఉన్న పేరు ప్రతిష్ఠలను పాడుచేసేలా మంత్రి వ్యాఖ్యలు ఉన్నాయని, కావాలని ఆమె తమ కుటుంబాన్ని టార్గెట్‌ చేసి మాట్లాడారని పేర్కొన్నారు. తమకు న్యాయం చేయాలని, కేసు నమోదు చేసి వాస్తవాలను వెలికి తీయాలని కోర్టును కోరారు.

మంత్రి కొండా సురేఖ అనుచిత వ్యాఖ్యలు.. నాగార్జున పిటిషన్‌పై విచారణ వాయిదా

కొండా సురేఖ వ్యాఖ్యలపై సమంత భావోద్వేగం..|Samantha is emotional on Konda Surekha’s comments..

Related posts

Leave a Comment