జూన్ 22 న జిఎస్ టి మండలి సమావేశం | GST Council meeting on June 22 | Eeroju news

న్యూఢిల్లీ జూన్ 13

వస్తువులు, సేవల పన్ను(జిఎస్ టి) మండలి జూన్ 22 న సమావేశం కావాలని నిర్ణయించింది. ఈ సమావేశం ఈ ఏడాది తొలి సమావేశం కానున్నది. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం తెలిపారు. ఈ 53వ జిఎస్ టి కౌన్సిల్ సమావేశం జూన్ 22న న్యూఢిల్లీలో జరుగనుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.

జిఎస్ టి కౌన్సిల్ సాధారణంగా ప్రతి మూడు నెలలకోసారి సమావేశం కావల్సి ఉంటుంది. కానీ 2022 నుంచి ఇప్పటి వరకు కేవలం ఆరు సార్లే సమావేశం అయింది. జరుగనున్న జిఎస్ టి కౌన్సిల్ సమావేశం ఏజెండా ఏమిటన్నది తెలియలేదు. అయితే రాష్ట్ర ఆర్థిక మంత్రులు కొన్ని పరోక్ష పన్నులను కేంద్ర బడ్జెట్ లో చేర్చాలని కోరవచ్చని అనుకుంటున్నారు.

బెట్టింగ్ వాటి మీద జిఎస్ టి 28 శాతం వేయడం వల్ల జిఎస్ టి ఆదాయం గణనీయంగా పెరిగింది. ముఖ్యంగా ఆన్ లైన్ గేమింగ్, క్యాసినోలు, గుర్రపు పందేలు వంటి వాటిమీద అధిక జిఎస్ టి విధించబడుతోంది. గుర్రపు పందేలాడేవారికి జిఎస్ టి తో  పాటు ఎంట్రీ ఫీజు కూడా గణనీయంగానే ఉంది. హైదరాబాద్ లో ఆఫ్ కోర్సు టోట్ ఎంట్రీ ఫీజు రూ. 150 వరకు ఉంది. ఇక రేస్ కోర్స్ మెయిన్ ఎంట్రీ ఫీజయితే దీనికంటే డబుల్ ఉంటుంది. జిఎస్ టి రేట్లు హేతుబద్ధంగా ఉన్నాయా అన్నది ప్రశ్న.                       

Related posts

Leave a Comment