Rhea Singha | మిస్ యూనివర్స్ గా రియా | Eeroju news

మిస్ యూనివర్స్ గా రియా

మిస్ యూనివర్స్ గా రియా

జైపూర్, సెప్టెంబర్ 23,(న్యూస్ పల్స్)

Rhea Singha

Miss Universe India 2024: 18 ఏళ్ళకే మిస్ యూనివర్స్ ఇండియా కిరీటం.. రియా సింఘా గురించి ఈ విషయాలు తెలుసా..?మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 కిరీటాన్ని రియా సింఘా దక్కించుకుంది. రాజస్థాన్‌లోని జైపూర్‌లో జరిగిన మిస్‌ యూనివర్స్‌ ఇండియా 2024 గ్రాండ్‌ ఫినాలో రియా విజేతగా నిలిచి ప్రతిష్టాత్మక టైటిల్‌ను కైవలం చేసుకుంది. దీంతో రియా ఇప్పుడు ప్రపంచ మిస్‌ యూనివర్స్‌ 2024 పోటీలో భారత్‌ తరఫున బరిలో నిలచే అవకాశాన్ని దక్కించుకుంది.ఈ విజయాన్ని అందుకున్న తర్వాత రియా ఆనందానికి హద్దులు లేకుపోయాయి. ఈ కిరీటాన్ని అందుకున్న తర్వాత మీడియాతో మాట్లాడిన ఆమె తన సంతోషాన్ని పంచుకుంది.

మిస్‌ యూనివర్సట్ ఇండియా టైటిల్‌ను గెలుచుకోవడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపింది. తాను ఈ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడ్డానని, ఇంతకు ముందుకు విజేతలుగా నిలిచిన వారి నుంచి చాలా నేర్చుకున్నాని రియా చెప్పుకొచ్చింది. ఇక ఈ ఈవెంట్‌కు న్యాయనిర్ణేతగా నటి, మిస్ యూనివర్స్ ఇండియా 2015 ఊర్వి రౌటేలా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..

“ఈ సంవత్సరం భారతదేశం మళ్లీ మిస్ యూనివర్స్ కిరీటాన్ని గెలుచుకుంటుంది” అని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇక వాస్‌ మియూనిర్స్‌ పోటీలో ఈ ఏడాది భారత దేశానికి మిస్‌ యూనివర్స్‌ కిరీటం కచ్చితంగా వస్తుందని ఆమె ధీమా వ్యక్తం చేశారు. అలాగే.. మిస్‌ యూనివర్స్‌ ఇండియా పోటీలో అమ్మాయిలుందరూ చాలా కష్టపడ్డారని, వారి అంకితభావం అద్భుతమని రౌటేలా కొనియాడారు.

మిస్ యూనివర్స్ గా రియా

 

Mathu Vadalara 2 Movie Review | ‘మత్తువదలరా2’ కు మేము ఊహించిన దానికంటే ఎక్కువ రెస్పాన్స్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది: డైరెక్టర్ రితేష్ రానా | Eeroju news

Related posts

Leave a Comment