Janasena | జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు | Eeroju news

జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు

జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు

ఒంగోలు, సెప్టెంబర్ 21, (న్యూస్ పల్స్)

Janasena

ప్రస్తుతం టీడీపీలో లీడర్ షిప్ కు కొదవలేదు. ఫుల్ టైట్ గా ఉంది. అయితే వైసీపీ అసంతృప్తుల్లో చాలా మంది జనసేనవైపు చూస్తుండడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్ గా మారుతోంది. అటు జనసేనకు కూడా పెద్ద నాయకుల అవసరం ఉంది. రాజకీయాల్లో వలసలు కామన్. కలిసి వచ్చే వారిని కలుపుకొని పోవడమూ అంతే కామన్. అయితే ఈ వలసలు కాస్తా కూటమి ప్రభుత్వానికి ఎంత వరకు ఎఫెక్ట్ చూపుతాయన్నది కీలకంగా మారింది. కూటమి పరిణామాలు మారుతాయా? ఇబ్బంది రాకుండా డీల్ చేస్తారా అన్నది హాట్ టాపిక్ అవుతోంది.

వైసీపీ నుంచి వలసలు ఆటోమేటిక్ గా కూటమివైపు వస్తున్నాయి. అక్కడ గుడ్ బై చెబుతున్న వారు అయితే టీడీపీ లేదంటే జనసేన వైపు చూస్తున్నారు. ముఖ్యంగా టీడీపీతో గతంలో చాలా విబేధించిన వారైతే తమకు ఆప్షన్ గా జనసేనను చూస్తున్నారు. అటు జనసేన పార్టీకి కూడా బలమైన క్యాడర్ ఉన్నా.. పెద్ద స్థాయి నేతలు లేక ఎదగలేకపోతోంది. నిజానికి మొన్నటి ఎన్నికల్లోనూ చాలా మంది చివరి నిమిషంలో టీడీపీ నుంచి జనసేనలో వచ్చి చేరిన వారే టిక్కెట్లు దక్కించుకున్నారు. ఇప్పుడు కూడా జనసేనలో పెద్ద స్పేస్ కనిపిస్తోంది. ఇది వైసీపీ నుంచి బయటకు రావాలనుకుంటున్న నేతలకు ప్లస్ పాయింట్ గా మారింది.

ఒంగోలు కార్పొరేషన్‌ లో కార్పొరేటర్లలో చాలా మంది బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గరి వారే ఉన్నారు. ఇటీవలే వారంతా టీడీపీలో చేరారు. ఒకవేళ బాలినేనికి జనసేనలో లైన్ క్లియర్ అయితే వారు అక్కడికి షిఫ్ట్ అవుతారా అన్నది కీలకంగా మారింది. ఇదే జరిగితే కూటమిలో కాస్త గడబిడ ఖాయమే అంటున్నారు. మరోవైపు పార్టీలోకి బయటి నుంచి ఒకరు వస్తుంటే అప్పటికే పార్టీలో ఉన్న వారిలో అసంతృప్తి సహజమే. ఇప్పటికే ప్రకాశం జిల్లా పార్టీ అధ్యక్షుడు షేక్ రియాజ్ సైతం సైలెంట్ అయిపోయారు. దీన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఎలా టాకిల్ చేస్తారన్నది కీలకంగా మారింది.

వైసీపీ నుంచి జనసేనలోకి రావాలనుకుంటున్న లీడర్లతో ఆయా నియోజకవర్గాల్లో ఉన్న సిట్టింగ్ టీడీపీ ఎమ్మెల్యేలకు చెక్ పడుతుందా అన్నది చర్చనీయాంశంగా మారింది. మరోవైపు కూటమిలోకి తప్పులు చేసిన వారు అక్కర్లేదని, కుళ్లిన కోడిగుడ్లు వద్దే వద్దంటున్నారు కూటమి నేతలు. మంచి వాళ్లనే ఆమోదిస్తామంటున్నారు.వైసీపీ నుంచి సీనియర్లు, జూనియర్లు అన్న తేడా లేకుండా పార్టీ నుంచి వైదొలుగుతున్నారు. క్యాడర్, లీడర్ షిప్ అంతా నిరాశ నిస్పృహలతోనే వీడుతున్నారా అన్న డౌట్లు పెరుగుతున్నాయి.

ఇన్నాళ్లూ జగన్ వెంట తిరిగి వారే ఇక మీ వెంట నడవడం మా వల్ల కాదంటూ చేతులెత్తేస్తున్నారు. కొందరు అంటీ ముట్టనట్లుగా ఉంటే.. ఇంకొందరు గుడ్ బై చెబుతున్నారు. ఇటీవలే వైసీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలిగా ఉన్న ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకి రాజీనామా చేశారు. అటు వైసీపీ రాజ్యసభ ఎంపీ మోపిదేవి వెంకటరమణ కూడా పార్టీ వీడారు. మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కూడా గుడ్ బై చెప్పేశారుఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన వారిలో కిలారు రోశయ్య, మద్దాలి గిరి, పెండెం దొరబాబు, నూర్జహాన్ ఉన్నారు. ఇందులో నూర్జహాన్ ఏలూరు నగరపాలక సంస్థ మేయర్‌ గా ఉన్నారు.

ఆ దంపతులిద్దరూ జగన్ కు గుడ్ బై చెప్పేశారు. పార్టీలో ఇన్నాళ్లు కీలక వ్యవహరించిన మాజీ మంత్రులు, తాజా మాజీలు, వైఎస్ కుటుంబానికి వీర విధేయులుగా ఉన్న వారంతా ఒక్కొక్కరుగా పార్టీకి గుడ్‌బై చెబుతుండడం వైసీపీలో హాట్ టాపిక్ అయింది. పార్టీ ఓడిపోయింది కాబట్టి నాయకులంతా వైసీపీని వీడుతున్నారని అనుకోవడానికి లేదంటున్నారు. తీవ్రమైన అసంతృప్తి, నాయకత్వంపై నమ్మకం లేకపోవడం, 11 సీట్లకే పరిమితమై ప్రజాదరణ కోల్పోవడం, క్యాడర్ లో నిరాశ ఉండడం ఇవన్నీ కారణాలుగా చెబుతున్నారు.

జనసేనలో చేరికలు.. గుర్రుగా కూటమి నేతలు

 

MLA Nimmaka who received public petitions at the Janasena office | జనసేన కార్యాలయంలో ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే నిమ్మక | Eeroju news

Related posts

Leave a Comment