YS Jagan vs Anil Kumar | అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. | Eeroju news

అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్..

అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్..

నెల్లూరు, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్)

YS Jagan vs Anil Kumar

 

సాధారణ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత వైసీపీ అధ్యక్షుడు ఇల్లు చక్కదిద్దుకునే పనిలో పడ్డారు. పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిస్తున్నారు. వరుసగా జిల్లా పార్టీ ప్రెసిడెంట్లను మారుస్తున్నారు. ఆ క్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేశారు. ఇప్పటి దాకా జిల్లా అధ్యక్షుడిగా ఉన్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డిని నెల్లూరు సిటీ ఇన్చార్జ్‌గా షిఫ్ట్ చేశారు. దాంతో వైసీపీలో నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ పరిస్థితి ఏంటన్నది అర్థం కాకుండా తయారైంది.

రాష్ట్రంలో వైసీపీ ఘోర ఓటమి చవి చూశాక లోపాలను సరిదిద్దుకునే పనిలో పడింది. రానున్న కాలంలో పార్టీ నాయకులు, కార్యకర్తలను కాపాడుకోవడంతో దూకుడుగా ముందుకు వెళ్లే నేతల కోసం జల్లెడ పడుతోంది. ఇప్పటివరకు నేతల పనితీరును పరిగణలోకి తీసుకుంటూ.. పార్టీ పట్ల వారి కమిట్‌మెంట్ లెక్కలు వేసుకుంటూ.. వివిధ జిల్లాలకు ప్రెసిడెంట్లను నియిమిస్తుంది. ఆ క్రమంలో ఇటీవలే ఉమ్మడి చిత్తూరు జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కట్ట బెట్టింది.ఉమ్మడి నెల్లూరు జిల్లా వంతు వచ్చింది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి కొనసాగారు.

చిత్తూరు జిల్లాకు చెందిన ఆయన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి ఎమ్మెల్సీగా గెలిచారు. పొలిటికల్‌గా పెద్దగా ఫోకస్ అవ్వని చంద్రశేఖర్‌రెడ్డికి ఎన్నికల మందు అప్పటి వరకు జిల్లా అధ్యక్షుడిగా ఉన్న వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి టీడీపీలో చేరడంతో.. జగన్ పార్టీ పదవి కట్టబెట్టారు.ప్రస్తుతమున్న పరిస్థితుల్లో చంద్రశేఖర్ పార్టీ సారథ్యానికి సరిపోరని భావించిన జగన్ ఆయన్ని నెల్లూరు సిటీ ఇన్చార్జ్‌గా నియమించి.. సర్వేపల్లి మాజీ శాసనసభ్యుడు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అధ్యక్షుడిగా నియమించారు. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అధికార పార్టీపైనా, మరీ ముఖ్యంగా టీడీపీ సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డిపైనా ఒంటి కాలితో లెగుస్తూ దూకుడు ప్రదర్శిస్తున్నారు.

ప్రస్తుతం జిల్లాలో కూటమి సర్కారుకు వ్యతిరేకంగా ఆ మాత్రం వాయిస్ వినిపిస్తున్న నాయకుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఒక్కరే. ప్రభుత్వ వ్యతిరేక స్వరం వినిపించడంలో విమర్శలు ఎక్కు పెట్టడంలో ఆయన దూకుడు కొనసాగుతుంది. ఆ స్థాయిలో దూకుడు ప్రదర్శించడంలో పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి విఫలమయ్యారు. అదీకాక 2019 ఎన్నికల్లో అప్పటి జిల్లా వైసీపీ అధ్యక్షుడు వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి సారథ్యంలో జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. పదికి పది అసెంబ్లీ స్థానాలను వైసీపీ కైవసం చేసుకుంది. ఇక మొన్నటి ఎన్నికల్లో సీన్ రివర్స్ అయి ఆ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు.

ఆ క్రమంలో దూకుడుగా వ్యవహరించే మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఖరారైంది .. అయితే గతంలో కాకాణి పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేసినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గ పార్టీ వ్యవహారాలకే పరిమితమయ్యారన్న విమర్శలు ఉన్నాయి. అదే విషయాన్ని పార్టీ నేతలు అధినేత వైయస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకు వెళ్లినట్టు సమాచారం. అయినా జగన్ మరో ప్రత్యామ్నాయం లేక కాకాణి వైపే మొగ్గు చూపారంటున్నారు.జిల్లా పార్టీ అధ్యక్షుడిగా మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేరు ఖరారు చేసిన జగన్.. ఎమ్మెల్సీగా ఉన్న పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి నెల్లూరు సిటీ బాధ్యతలు కట్టబెట్టారు. అసలు కాకాణి పేరు ప్రకటించానికి ముందు ఆయన స్థాయిలో వాయిస్ వినిపించే నేత కోసం వైసీపీ పెద్దలు జిల్లాలో జల్లెడ పట్టారంట. కానీ ఆ స్థాయిలో స్పీడ్ గా ముందుకు సాగే నేత కనిపించక.. కాకాని గోవర్ధన్ రెడ్డినే ఖారారు చేశారంటున్నారు.

మాజీ మంత్రి, నెల్లూరు సిటీ మాజీ ఎమ్మెల్యే, ఫైర్ బ్రాండ్ నేత అనిల్‌కుమార్ యాదవ్ సైలెంట్ అవ్వడం కూడా కాకాణికి కలిసి వచ్చినట్లు కనిపిస్తుంది. వైసీపీ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు తనమన అన తేడా లేకుండా అందరిపై అనిల్ దూకుడు ప్రదర్శించారు. ఇష్టారాజ్యంగా ప్రవర్తించారు. దాంతో జిల్లా వైసీపీ నేతలకు కూడా శత్రువయ్యారు. ఇక రెండో టర్మ్‌లో అనిల్‌కు మంత్రి పదవి పీకేసిన జగన్.. కాకాణికి ఛాన్స్ ఇచ్చారు. కాకాణిపై అనిల్ అప్పట్లో బహిరంగంగానే ధ్వజమెత్తారు.ఆ దూకుడు కారణంగా అనిల్ తాను రెండు సార్లు గెలుపొందిన నెల్లూరు సిటీ నుంచి మూడో సారి పోటీ చేయలేకపోయారు. సర్వేల పేరు చెప్పిన వైసీపీ అధ్యక్షుడు ఆయన్ని నరసరావుపేట ఎంపీ అభ్యర్ధిగా పంపించారు.

అక్కడ అనిల్ దాదాపు లక్షన్నర పైచిలుకు ఓట్ల తేడాతో పరాజయం పాలయ్యారు. అప్పటి నుంచి ఆయన జనంలో తిరగడమే మానేశారు. నెల్లూరు సిటీకి కూడా రహస్యంగానే వచ్చి వెళ్లిపోతున్నారంట. పొరుగు రాష్ట్రాల్లో తన వ్యాపారాలు చూసుకుంటూ కాలం గడిపేస్తున్నారంట. కాకాణి గోవర్ధన్‌ను జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా నియమించడంతో.. జిల్లా పార్టీలో అనిల్ యాదవ్‌కు స్థానం లేకుండా పోయిందంటున్నారు. ఆయన సొంత నియోజకవర్గం నెల్లూరు సిటీకి కూడా చంద్రశేఖర్‌రెడ్డిని ఇన్చార్జ్‌‌గా ప్రకటించడంతో నెక్ట్స్ ఎలక్షన్స్‌లో పోటీకి అనిల్‌కు నియోజకవర్గమే కరువైనట్లు కనిపిస్తుంది. ఓవరాల్‌గా చూస్తే నెల్లూరు జిల్లా వైసీపీ ముఖచిత్రమే మారిపోవడం ఖాయమంటున్నారు.

అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్..

 

 

YS Jaganmohan Reddy | దూరమవుతున్న పార్టీ పిల్లర్లు… | Eeroju news

Related posts

Leave a Comment