Telangana | 15 ఏళ్ల వాహానాలు దాటితే…వాహానాలు ఇక స్క్రాపే.. | Eeroju news

Telangana

15 ఏళ్ల వాహానాలు దాటితే…వాహానాలు ఇక స్క్రాపే..

హైదరాబాద్, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్)

Telangana

తెలంగాణలో 15ఏళ్లు దాటిన వాహనాలను తక్కు కింద మార్చేందుకు రంగం సిద్ధమవుతోంది. విపరీతమైన వాయు, శబ్ద కాలుష్యాన్ని నియత్రించేందుకు తెలంగాణ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ప్రస్తుతం 15 ఏళ్లు దాటిన వాహనాలు తెలంగాణ 30 లక్షలకుపైగా ఉన్నాయి. అందులో ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నుంచే 15 ఏళ్లు నిండిన 20 లక్షల వాహనాలు ఉన్నాయి. వాటిలో 17 లక్షల బైకులు, 3.5 లక్షల కార్లతో పాటు లక్ష గూడ్స్ క్యారేజీలు, 20,000 ఆటోలు ఉన్నాయి,2025, జనవరి ఒకటవ తేదీ నుంచి ప్రమాదకరమైన మరియు కాలుష్యకారక వాహనాలను స్క్రాప్‌కు పంపాలని నిర్ణయించింది.

15 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాహనాలు….అవసరమైన ఫిట్‌నెస్ పరీక్షల్లో ఫెయిల్‌ అయితే… ఆ వాహనాలకు ఇకపై రిజిస్ట్రేషన్ చేయరు. రోడ్లపై తిరిగేందుకు ఆ వాహనాలకు అనుమతి ఉండదు. వెహికల్‌ ఫిట్‌నెస్‌ పరీక్షలో పాసయితే… గ్రీన్‌ ట్యాక్స్‌ చెల్లించి… మూడు నుంచి ఐదేళ్లు అదనంగా నడుపుకోవచ్చు. ఫిట్‌నెస్‌ టెస్ట్‌లో ఫెయిల్‌ అయిన వాహనాలు మాత్రం స్ర్కాప్‌కే. అలా కాదని… ఆ వాహనాలను రోడ్డెక్కిస్తే… అధికారులు తగిన చర్యలు తీసుకుంటారు.

తెలంగాణలో ప్రస్తుతం 15ఏళ్లు పైబడిన వాహనాలు 30లక్షలకుపైగా ఉన్నాయి. అందులో గ్రేటర్‌ హైదరాబాద్‌లోనే 20లక్షలకుపైగా వాహనాలు ఉన్నాయి. వాటిలో 15 లక్షలు బైక్‌లు కాగా.. మూడున్నర లక్షల కార్లు, లక్ష గూడ్స్‌ క్యారేజీలు, 20వేల ఆటో రిక్షాలు ఉన్నాయి. రవాణా శాఖ ఇప్పటికే స్క్రాపేజ్‌ విధానానికి సంబంధించిన ముసాయిదాను సిద్ధం చేసి… ఆమోదం కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది. ప్రస్తుతం ఢిల్లీలో మాత్రమే 15ఏళ్లు దాటిన వాహనాలను రోడ్లపైకి అనుమతించడంలేదు. అయితే.. కర్నాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, రాజస్థాన్‌తోపాటు అనే రాష్ట్రాలు తెలంగాణ తరహాలోనే త్వరలోనే ఈ విధానాన్ని అమలు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసుకుంటున్నాయి.

దాదాపు వెయ్యి ఆర్టీసీ బస్సులు స్ర్కాప్‌కు వెళ్లాల్సిన కేటగరిలో ఉన్నాయి. అంతేకాదు… దాదాపు 2వేల స్కూల్‌ బస్సులు కూడా 15ఏళ్లు పైబడినవే. అందుకే.. తెలంగాణ ప్రభుత్వం పాత వాహనాల స్క్రాపింగ్‌ను ప్రోత్సహించేందుకు పన్ను రాయితీని పరిశీలిస్తోంది. పాత వాహనాలు తక్కుకు ఇచ్చేసి.. కొత్త వాహనాలను కొనుగోలు చేసే క్రమంలో… మోటారు వాహనాల పన్నుపై 10 శాతం నుంచి 15 శాతం వరకు రాయితీని అందించాలని కూడా భావిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. స్క్రాపేజ్‌ విధానానికి సంబంధించిన ముసాయిదాను ఇప్పటికే సమర్పించామని… రాష్ట్ర ప్రభుత్వం త్వరలోనే ఆమోదించే అవకాశం ఉందని అంటోంది రవాణా శాఖ.

ప్రభుత్వం ఆమోదం తెలిపిన తర్వాత… ఈ విధానం అమల్లోకి వస్తుందని. వాహన స్క్రాపింగ్ ప్రారంభమవుతుందని ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు చెప్తున్నారు. వాహనాల స్క్రాపింగ్‌ కోసం ఇప్పటికే మూడు కంపెనీలు ముందుకొచ్చాయన్నారు. కాలుష్య కారకమైన వాహనాలను, రోడ్డుపై నడిపేందుకు అర్హత లేని వాహనాలను తొలగించడమే తమ లక్ష్యమని అంటున్నారు ట్రాన్స్‌పోర్ట్‌ అధికారులు. ప్రభుత్వ శాఖలోని 15ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయస్సున వాహనాలకు సంబంధించి RTA శ్వేతపత్రం విడుదల చేయాలని తెలంగాణ ఆటో, మోటర్ వెల్ఫేర్ యూనియన్ డిమాండ్‌ చేస్తోంది. జీహెచ్‌ఎంసీలో ఆటో టిప్పర్లు, అంబులెన్సులు, ఫైరింజన్లు, ఆర్టీసీ బస్సులు, ఇతర ప్రభుత్వ వాహనాలు పొగను వెదజల్లుతూ రోడ్లపై తిరుగుతున్నాయి.

15ఏళ్ల దాటిన ప్రైవేట్‌ వాహనాలను రద్దు చేసినట్టే… ప్రభుత్వ వాహనాలను కూడా స్ర్కాప్‌కు పంపాలని కోరుతున్నారు.15ఏళ్లు దాటిన వాహనాలతో రోడ్డుప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని కేంద్ర మంత్రిత్వ శాఖ చెప్తోంది. 2022లో… 15 ఏళ్లు దాటిన వాహనాల వల్ల… రాష్ట్రంలో 1306 ప్రమాదాలు జరిగాయని తెలిపింది. ఆ ప్రమాదాల్లో 418 మంది మరణించగా… 1100 మందికిపైగా గాయపడ్డారని నివేదిక ఇచ్చింది. పాత ఆటోమొబైల్స్‌.. ముఖ్యంగా 15ఏళ్లు పైబడిన వాహనాల్లో తరచూ సాంకేతిక సమస్యలు తలెత్తుతుంటాయని రోడ్‌ సేఫ్టీ అధికారులు చెప్తున్నారు.

బ్రేక్‌ ఫెయిలవడం వంటివి ఎక్కువగా జరుగుతాయంటున్నారు. అంతేకాదు క్లచ్‌లు కూడా గట్టిగా మారతాయి, గేర్లు మార్చడం కష్టంగా మారుతుంది. అలాంటప్పుడు… వాహనం ఆగిపోతుంది. లేదా వాహనంపై డ్రైవర్‌ నియంత్రణ కోల్పోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. కనుక… వీలైనంత వరకు కాలం చెల్లిన వాహనాలు నడకపకపోవడమే ఉత్తమం అంటున్నారు రోడ్‌ సేఫ్టీ నిపుణులు.

Telangana

 

New traffic rules come into effect | అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ | Eeroju news

Related posts

Leave a Comment