Ration card | అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు | Eeroju news

అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు

అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు

నల్గోండ, సెప్టెంబర్ 20, (న్యూస్ పల్స్)

Ration card

రేష‌న్ కార్డులు జారీకి ప‌టిష్ట‌ కార్యాచ‌ర‌ణ ప్ర‌ణాళిక రూపొందించాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. నూత‌న రేష‌న్ కార్డుల కోసం అక్టోబ‌రు రెండో తేదీ నుంచి ద‌ర‌ఖాస్తుల‌ను స్వీక‌రించాల‌ని సూచించారు. రేష‌న్ కార్డుల జారీకి సంబంధించిన విధివిధానాల‌పై ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర స‌చివాల‌యంలో స‌మీక్ష నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా రేష‌న్ కార్డుల జారీకి సంబంధించి మంత్రులు ఉత్త‌మ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి, దామోద‌ర రాజ‌న‌ర‌సింహ అధికారుల‌కు ప‌లు సూచ‌న‌లు చేశారు. అర్హులంద‌రికీ డిజిట‌ల్ రేష‌న్ కార్డులు ఇచ్చేదానిపై క‌స‌ర‌త్తు చర్చించారు.

ఈ అంశంపై త్వ‌ర‌లోనే మ‌రోసారి స‌మీక్ష నిర్వ‌హించాల‌ని నిర్ణ‌యించారు. స‌మావేశంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి శాంతికుమారితో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.చాలా రోజులుగా కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే కొత్త కార్డుల జారీ కోసం ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సబ్ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ కొద్దిరోజులుగా రేషన్ కార్డుల జారీకి సంబంధించి అధ్యయనం చేస్తోంది. ఇటీవలనే సబ్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది.

అక్టోబర్ నుంచి కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తులు స్వీకరించాలని నిర్ణయించింది. దీనికి సంబంధించిన నిబంధనలు, విధి విధానాలపై త్వరలోనే వివరాలు వెల్లడిస్తామని ప్రకటించింది. కొత్తగా 15 లక్షల రేషన్ కార్డులు జారీ చేసే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 89.96 లక్షల రేషన్‌కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. కొత్త రేషన్‌కార్డులు, హెల్త్‌ కార్డులు విడివిడిగా అందిస్తామని వెల్లడించారు. కొత్త రేషన్‌కార్డుల జారీపై తుది ప్రక్రియ నెలాఖరులోగా పూర్తి చేస్తామన్నారు. అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్‌ కార్డులు, హెల్త్‌కార్డులు అందిస్తామన్నారు.

అర్హులైన ప్రతి ఒక్కరికీ రేషన్, హెల్త్ కార్డులు జారీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. కొత్త రేషన్ కార్డు విధివిధానాలు రూపొందిస్తున్నామన్నారు. వైట్ రేషన్ కార్డులకు ఎవరు అర్హులనేదానిపై వచ్చే భేటీలో నిర్ణయిస్తామన్నారు. ఇతర రాష్ట్రాల్లో రేషన్ కార్డులు ఎలా ఇస్తున్నారనేదానిపై అధ్యయనం చేస్తున్నామన్నారు. కొత్త రేషన్ కార్డుల జారీకి నిబంధనలు ఎలా ఉండాలని రాజకీయ పార్టీలకు లేఖ రాశామన్నారు. కొన్ని పార్టీలు సూచనలు చేశాయన్నారు. ఇలా వచ్చిన సూచనలపై సమావేశంలో చర్చించామన్నారు.

తెలంగాణలో దాదాపు 90 లక్షల రేషన్ కార్డులు ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు.ప్రస్తుతం రేషన్ కార్డులపై ఆరు కిలోల బియ్యం ఉచితంగా ఇస్తామని మంత్రి ఉత్తమ్ తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో కేవలం 49 వేల రేషన్ కార్డులు మాత్రమే ఇచ్చిందన్నారు. అవి కూడా ఉప ఎన్నికలు వచ్చిన నియోజకవర్గాల్లో ఇచ్చారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రేషన్ కార్డులు ఇవ్వలేదని విమర్శించారు. సెప్టెంబర్ 21వ తేదీన మరోసారి కేబినెట్ సబ్ కమిటీ సమావేశం ఉంటుందన్నారు. ఈ నెలాఖరులోగా ప్రభుత్వానికి నివేదిక అందిస్తామన్నారు.

అక్టోబరు 2 నుంచి రేషన్ కార్డుల దరఖాస్తులు

 

Ration card | రేషన్ కార్డులకు లైన్ క్లియర్ | Eeroju news

Related posts

Leave a Comment