Suspense thriller movie ‘Fear’ teaser release on 20th of this month | ఈ నెల 20న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” టీజర్ రిలీజ్ | Eeroju news

Suspense thriller movie 'Fear' teaser release on 20th of this month

ఈ నెల 20న వేదిక సస్పెన్స్, థ్రిల్లర్ మూవీ “ఫియర్” టీజర్ రిలీజ్

 

Suspense thriller movie ‘Fear’ teaser release on 20th of this month

 

హీరోయిన్ వేదిక లీడ్ రోల్ లో నటిస్తున్న సినిమా “ఫియర్”. ఈ సినిమాను దత్తాత్రేయ మీడియా బ్యానర్ పై ప్రొడ్యూసర్ ఏఆర్ అభి నిర్మిస్తున్నారు. సుజాత రెడ్డి కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. సస్పెన్స్ థ్రిల్లర్ కథతో దర్శకురాలు Dr. హరిత గోగినేని ఫియర్ మూవీని రూపొందిస్తున్నారు. అరవింద్ కృష్ణ ఓ స్పెషల్ రోల్ లో కనిపించనున్నారు. “ఫియర్” సినిమా విడుదలకు ముందే వివిధ అంతర్జాతీయ ప్రతిష్టాత్మక ఫిలిం ఫెస్టివల్స్ లో 60 కి పైగా అవార్డ్స్ లను గెల్చుకుని కొత్త రికార్డ్ క్రియేట్ చేసింది.

ఈ రోజు “ఫియర్” సినిమా టీజర్ రిలీజ్ అనౌన్స్ మెంట్ చేశారు మేకర్స్. ఈ నెల 20వ తేదీన ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. రీసెంట్ గా స్టార్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా చేతుల మీదుగా రిలీజ్ చేసిన “ఫియర్” సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ కు హ్యూజ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ నేపథ్యంలో “ఫియర్” సినిమా టీజర్ పై మంచి క్రేజ్ ఏర్పడుతోంది. డిఫరెంట్ సస్పెన్స్ థ్రిల్లర్ కథతో రూపొందిన “ఫియర్” సినిమా త్వరలోనే గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు సిద్ధమవుతోంది.

నటీనటులు – వేదిక, అరవింద్ కృష్ణ, జెపి ( జయప్రకాష్ ), పవిత్ర లొకేష్, అనీష్ కురువిల్ల, సాయాజి షిండే, సత్య కృష్ణ, సాహితి దాసరి, షాని తదితరులు

Suspense thriller movie 'Fear' teaser release on 20th of this month

 

The teaser of the movie ‘Manmayi’ was released by the famous producer Raj Kandukuri | ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి చేతుల మీదుగా “మన్మయి” సినిమా టీజర్ విడుదల | Eeroju news

 

Related posts

Leave a Comment