New railway line works to start | కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు | Eeroju news

New railway line works to start

కొత్తగా ప్రారంభం కానున్న రైల్వే లైన్ పనులు

ఖమ్మం, ఆగస్టు 24, (న్యూస్ పల్స్)

New railway line works to start

తెలంగాణలో మరో కొత్త ట్రైన్ మార్గం నిర్మించనున్న సంగతి తెలిసిందే. ఒడిశాలోని మల్కన్‌గిరి నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం మీదుగా బూర్గంపాడు మండలం పాండురంగాపురం వరకు కొత్త రైల్వే లైన్‌ నిర్మాణం చేపట్టనున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టు నిర్మాణానికి మార్గం సుగమమైంది. 173.61 కి.మీల మార్గం కోసం రైల్వేశాఖ నిధులు మంజూరు చేసింది. రూ.3,591.76 కోట్లు మంజూరు చేసినట్లు ఆ శాఖ ప్రకటన విడుదల చేసింది. కొత్త ట్రైన్ ట్రాక్‌లో భాగంగా సివిల్‌ ఇంజినీరింగ్‌ పనులకు రూ.3,061.91 కోట్లు, ఎలక్ట్రికల్‌ ట్రాక్షన్‌ డిస్ట్రిబ్యూషన్‌కి మరో రూ.342.15 కోట్లు, ఎలక్ట్రికల్‌ (జనరల్‌)కు రూ.50.97 కోట్లు, ట్రాక్ సిగ్నల్, టెలి కమ్యూనికేషన్స్‌కు రూ.136.73 కోట్లు వెచ్చించనున్నట్లు రైల్వేశాఖ అధికారులు తెలిపారు.

ఈ ట్రైన్ మార్గాన్ని వచ్చే ఐదేళ్లలో అంటే 2029-30 కల్లా పూర్తిచేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ట్రైన్ మార్గంలో ఒక్క లెవల్‌ క్రాసింగ్‌ కూడా లేకుండా ఈ ప్రాజెక్టును నిర్మించేలా రైల్వేశాఖ డిజైన్ రూపొందించింది. ఈ కొత్త ట్రైన్ మార్గం మెుత్తం పొడవు 200.60 కి.మీ. కాగా.. ఈ మార్గంలో ఏకంగా 301 వంతెనలను నిర్మించనున్నారు. మూడు భారీ వంతెనలు, 34 పెద్ద బ్రిడ్జిలు 264 చిన్న బ్రిడ్జిలు, 41 ఆర్వోబీలు, 76 ఆర్‌యూబీలు ఈ ట్రైన్ మార్గంలో నిర్మించనున్నారు.

ఒడిషాలోని మల్కన్‌గిరి నుంచి ప్రారంభమై దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాద్రి మీదుగా పాండురంగాపురం వరకు నిర్మించ తలపెట్టిన ఈ మార్గంలో 14 రైల్వే స్టేషన్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ స్టేషన్లు ఎక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై త్వరలోనే స్పష్టత రానుంది. భద్రాచలం వద్ద గోదావరి నదిపై భారీ బ్రిడ్జి నిర్మించేందుకు అధికారులు ఇప్పటికే డీపీఆర్ సిద్ధం చేశారు. ఇప్పటికే గోదావరిపై రోడ్డు మార్గంలో రెండు వంతెనలు ఉన్నాయి. త్వరలో రైలు రాకపోకలకు వీలుగా మరో వంతెనను నిర్మించనున్నారు. భద్రాచలం- సారపాక మధ్యలో గోదావరి నదిపై సుమారు 2 కి.మీ. మేర పొడవైన బ్రిడ్జి నిర్మించే వీలుంది.

New railway line works to start

 

ఇక స్లీపర్ వందే భారత్ | India is the sleeper vande | Eeroju news

Related posts

Leave a Comment