ట్రాఫిక్ జాం… క్యాబ్ ల మోత
హైదరాబాద్, ఆగస్టు 21, (న్యూస్ పల్స్)
Traffic jam the problem of cabs
రాజ్ ఆకుల అనే వ్యక్తి పని మీద ఏడు కిలోమీటర్ల దూరంలో ఉన్న తన కార్యాలయానికి వెళ్లాలనుకున్నాడు. వర్షం పడుతున్నందున క్యాబ్ బుక్ చేసుకున్నాడు. ఆయన క్యాబ్ ఎక్కినప్పుడు ఫేర్ రీజనబుల్ గానే ఉంది. కానీ గమ్యానికి చేరుకునేసరికి మైండ్ బ్లాంక్ అయిపోయింది. బిల్లు రూ. 3100 చూపించింది. కట్టక తప్పదు కాబట్టి కట్టేశారు. రాజ్ ఆకుల ప్రయాణిస్తున్నప్పుడు వర్షం పడింది. ట్రాఫిక్ జామ్ అయింంది. ఈ కారణంగా బాగా ఆలస్యం అయింది. అయితే అంత మాత్రాన… ఒక్క సారే .. వందల నుంచి వేలకు బిల్లు తీసుకెళ్తారా అని ఆశ్చర్యపోయారు.
కస్టమర్ కేర్‌ను సంప్రదిస్తే.. బిల్లింగ్‌లో ఎలాంటి పొరపాటు లేదని.. అది సరైన చార్జీనేనని స్పష్టం చేశారు. దీంతో ఇది కార్పొరేట్ లూఠీ అని సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఉబెర్‌కు.. కేంద్ర రవాణా మంత్రిత్వ శాఖకూ ట్యాగ్ చేశారు. రాజ్ ఆకుల ట్వీట్ కింద క్యాబులతో తాము పడిన బాధల్ని ఇతరులు పంచుకోవడం ప్రారంభించారు. క్యాబుల్ని తరచూ బుక్ చేసుకునేవారందరికీ ఇలాంటి అనుభవాలు ఉన్నాయని ఆ ట్వీట్ల రిప్లయ్‌లను చూస్తే అర్థమవుతుంది.
గత వారం రోజులుగా రోజూ ఉదయం పూట ఎం.. మధ్యాహ్నం నుంచి వర్షం దంచి కొడుతోంది. ఆ వర్షాలుమామూలువి కావు. రోడ్లు బ్లాక్ అయిపోతున్నాయి. ఫలితంగా ట్రాఫిక్ జామ్ అయిపోయి వాహనాలు ఎక్కడివక్కడ ఆగిపోతున్నాయి. గంటల తరబి ముందుకు కదలడం లేదు. ఈ ట్రాఫిక్‌లో క్యాబ్ ఇరుక్కుపోతే.. డ్రైవర్లు దిలాసాగానే ఉంటున్నారు. కానీ ప్యాసింజర్లకు మాత్రం గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. కొన్ని ఏరియాల్లో క్యాబుల్లో వెళ్తున్న వారి జేబుకు చిల్లులు పడుతున్నాయి.
New traffic rules come into effect | అమల్లోకి కొత్త ట్రాఫిక్ రూల్స్ | Eeroju news