Bharti as party mouthpiece…? | పార్టీ మౌత్ పీస్ గా భారతి…? | Eeroju news

Bharti as party mouthpiece...?

పార్టీ మౌత్ పీస్ గా భారతి…?

కడప, ఆగస్టు 20, (న్యూస్ పల్స్)

Bharti as party mouthpiece…?

ఏపీ రాజకీయాల్లో రెండురోజులుగా ఓ వార్త తెగ హంగామా చేస్తోంది. అది వైసీపీ పార్టీ గురించే. ఇంతకీ దాని సారాంశం ఏంటంటే.. పార్టీ పగ్గాలు భారతి చేతుల్లోకి వెళ్లబోతోందనేది అసలు వార్త. దీనిపై వైసీపీ నేతలు, కార్యకర్తలు రకరకాలుగా చర్చించుకోవడం మొదలైంది. ఇది కలా.. నిజమా అన్న చర్చ లేకపోలేదు.అధికారం పోయిన తర్వాత గడిచి రెండునెలల్లో ఐదుసార్లు బెంగుళూరు వెళ్లారు వైసీపీ అధినేత జగన్. ఎందుకు వెళ్లారన్నది పక్కనబెడితే.. మీడియా ముందుకు వచ్చిన ప్రతీసారీ ఆయన తర్జనభర్జన పడుతున్నారు. ఏ విషయంపైనా క్లారిటీ ఇవ్వలేదు. మీడియా ప్రశ్నలకు సమాధానం దాటవేసే ప్రయత్నం చేస్తున్నారు.జగన్ వ్యవహారశైలిని గమనించిన ఆ పార్టీకి చెందిన నేతలు అధినేత ఇలా వ్యవహరిస్తున్నారేంటి అని చర్చించుకోవడం మొదలైంది.

వైసీపీ ప్రభుత్వం చేసిన అవినీతిపై చంద్రబాబు సర్కార్ దృష్టి సారించింది. ఇప్పటివరకు 13 కేసులు నమోదు చేసింది. రేపోమాపో వాటిని సీఐడీ బదలాయించాలని భావిస్తోంది. ఎందుకంటే ఆయా కేసుల్లో మనీ లాండరింగ్ అంశాలు ముడిపడి ఉన్నట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష హోదా కావాలని జగన్ డిమాండ్ చేయడం వెనుక ఉద్దేశం ఇదేనని అంటున్నారు టీడీపీ నేతలు. ప్రతిపక్ష నేతయితే అరెస్టు వంటివి ఏమైనా జరిగితే ముందుగా గవర్నర్ వద్దకు విషయం వెళ్తుందని, తనకున్న పరిచయాలతో కేంద్రంతో మేనేజ్ చేసుకోవచ్చని భావించి ప్రతిపక్ష హోదా గురించి డిమాండ్ చేశారని అంటున్నారు. లిక్కర్ స్కామ్.. కోట్లాది రూపాయలు అవినీతి జరిగిందని టీడీపీ ప్రధాన ఆరోపణ.

ప్రస్తుతం విచారణ జరుగుతోంది. బేవరేజ్ మాజీ ఎండీని సీఐడీ అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. రేపు మాపో జగన్ చుట్టూ ఉచ్చు బిగుసుకోవచ్చని అంటున్నారు. జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో భారతికి పార్టీ పగ్గాలు అప్పగించేందుకు జగన్ సిద్ధమైనట్లు ఆ పార్టీలో నుంచి ఫీలర్ బయటకు వచ్చింది. జగన్ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఇలాంటి ఫీలర్ వైసీపీ నుంచి బయటకు వచ్చింది. తాను జైలుకి వెళ్తే.. సతీమణికి పగ్గాలు అప్పగించాలని జగన్ అప్పట్లో  భావించినట్లు వార్తలు వచ్చాయి. మరి ఏ విధంగా మేనేజ్ అయ్యిందో తెలీదుగానీ అది గాసిప్ గానే మిగిలిపోయింది.

జగన్ అధికారం కోల్పోయాక అధికార టీడీపీపై విమర్శలు సంధిస్తున్నారు. రూలింగ్ పార్టీ కంటే.. కాంగ్రెస్ నుంచి వైసీపీకి కౌంటర్లు పడిపోతున్నాయి. షర్మిలను ఎదుర్కోవాలంటే భారతి బెటరని భావిస్తున్నా రట మాజీ సీఎం. మీడియా ముందు ఎలా మాట్లాడాలి.. ప్రత్యర్థులను ఎలాంటి విషయాల్లో ఇరుకున పెట్టాలనే దానిపై భారతికి ట్రైనింగ్ ఇస్తున్నట్లు సమాచారం. భారతి మాట్లాడితే పార్టీకి జోష్ వస్తుందని, కూటమి సర్కార్ అంతగా రియాక్ట్ కాదని ఆలోచన చేస్తున్నారట జగన్. మరి ఈ వార్తయినా నిజమవుందా? లేక గాసిప్‌గా మిగిలిపోతుందన్నా అన్నది చూడాలి.

Bharti as party mouthpiece...?

 

Jagan is going to do a yatra to reassure the activists | YS Jagan | కార్యకర్తలకు భరోసా ఇచ్చేందుకు యాత్ర చేయబోతున్న జగన్ | Eeroju news

Related posts

Leave a Comment