ఉల్లికి భారీ డిమాండ్
కర్నూలు, ఆగస్టు 19 (న్యూస్ పల్స్)
Onion is in huge demand
దేశవ్యాప్తంగా ఉల్లిగడ్డ ధరలు భారీగా పెరిగిన విషయం తెలిసిందే. కొన్ని నెలల క్రితం కేజీ ఉల్లి ధర రూ.20-30 వరకు ఉండగా.. ప్రస్తుతం అదే ఉల్లి రూ.50కి చేరింది. ఉల్లి ధర 50కిపైగా శాతం పెరిగింది. బహిరంగ మార్కెట్‌లో ఉల్లి కిలో రూ.50 పలుకుతోంది. అలాగే రైతు బజారులో కిలో ఉల్లి రూ.42 నుంచి రూ.45 పలుకుతుంది. పెరిగిన ధరలతో సామాన్య ప్రజలు ఉల్లి అంటేనే భయపడిపోతున్నారు. సాధారణంగా ఉల్లి ధరలు సెప్టెంబర్ సమయంలో పెరుగుతాయి. అయితే ఈసారి ముందుగానే ప్రారంభమయ్యాయి.
ఈ ఏడాది మహారాష్ట్రలో ఉల్లి పంట దెబ్బతినడమే అందుకు కారణం. మహారాష్ట్రలో ఉల్లి పంటదెబ్బ తినడంతో కర్నూలు ఉల్లికి భారీగా డిమాండ్ పెరిగింది. దానికి తోడు కర్నూలు జిల్లాలో ఉల్లి సాగు విస్తీర్ణం భారీగా తగ్గిపోయింది. 30 వేల హెక్టార్లలో పండే ఉల్లి పంట.. ఇప్పుడు కేవలం 9 వేల హెక్టార్లలో మాత్రమే సాగు అవుతోంది. వర్షాలు లేక ఉల్లి దిగుబడి తక్కువ అయినట్లు తెలుస్తుంది.
కర్నూలు ఉల్లి మార్కెట్‌లో క్వింటాలు ఉల్లి రూ.2,500 నుంచి రూ.3,500 పలుకుతోంది. దాంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గత సంవత్సరం క్వింటాలు ఉల్లి ధర రూ.500 కూడా లేకపోవడంతో రైతులు కన్నీరు మున్నీరయ్యారు. ఉల్లి రేట్లు రాను రోజుల్లో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. పంట చేతుకి వచ్చే సమయంలో పడుతున్న వర్షాల వల్ల ఉల్లి మురిగిపోయే అవకాశాలు ఉన్నాయి.
కూరగాయల ధరలకు రెక్కలు.. | Wings for vegetable prices.. | Eeroju news