Covert politics | మళ్లీ తెరపైకి కోవర్టు పాలిటిక్స్.. | Eeroju news

Covert politics

మళ్లీ తెరపైకి కోవర్టు పాలిటిక్స్..

హైదరాబాద్, ఆగస్టు  13 (న్యూస్ పల్స్)

Covert politics

తెలంగాణ రాజకీయం మయా రంజుగా నడుస్తోంది. రోజుకో ఇష్యూపై నేతలు మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. లేటెస్ట్‌గా బీజేపీ నేతల తీరుపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ నేతలు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ఒకటేనని మళ్లీ రచ్చ మొదలెట్టారు. తెలంగాణలో షాడో మంత్రుల పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు రెండు విలీన ప్రచారంతో ఉక్కబోత అనుభవిస్తున్నాయి….. మాకు.. మాకూ ఏ సంబంధం లేదు నమ్మండి మహాప్రభో అంటూ చెప్పుకోవడానికి నానాపాట్లూ పడుతున్నాయి…. ఇంతకీ విలీన ప్రచారం ఎందుకు జరుగుతోంది…ఈ ప్రచారంలో వాస్తవమెంత… ఈ ప్రచారంతో మునిగేదెవరు…తేలేదెవరు….?నిజం గడపదాటేలోపు… అబద్ధం ఊరంతా తిరిగొస్తుందంటా…. ఈ సామెత ఎవరు చెప్పారోగానీ… రాష్ట్రంలో బీఆర్ఎస్, బీజేపీ నేతలు ఇప్పుడు ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.

బీజేపీలో బీఆర్ఎస్ విలీనమట…. అంటూ సోషల్‌ మీడియాలో మొదలైన ప్రచారం అబద్ధమని చెప్పుకోడానికి ఇరుపార్టీల నేతలు నానా తంటాలు పడుతున్నారు.తప్పుడు ప్రచారం చేసిన వారిని కోర్టుకు ఈడుస్తామని బీఆర్ఎస్ హెచ్చరిస్తుంటే… అసలు అలాంటి ఊసేలేదంటూ బీజేపీ నేతలు మొత్తు కొంటున్నారు. ఇదే సమయంలో ఈ ప్రచారానికి మరింత మసాలా దట్టిస్తూ కాంగ్రెస్ నేతలు పండగ చేసుకుంటున్నారు.ఎవరు పుట్టించారో… ఎందుకు పుట్టించారో… ఏం ఆశిస్తున్నారో… కానీ, బీజేపీలో బీఆర్ఎస్ విలీనమనే ప్రచారం రెండు పార్టీలకు ఇబ్బందికరంగా మారిందంటున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రతిపక్షంగా రెండు పార్టీలూ చేతులు కలిపి ప్రభుత్వంపై పోరాడటానికి కూడా భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందంటున్నారు.

రాజకీయ వ్యూహాలు రచించడంలో అపర చాణుక్యుడిగా పేరు తెచ్చుకున్న మాజీ సీఎం కేసీఆర్‌కే ఇలాంటి సంకట స్థితి ఎదురుకావడం…. ఈ క్లిష్ట పరిస్థితి నుంచి ఆయన ఎలా బయటపడతారనేది ఆసక్తి పుట్టిస్తోంది.వాస్తవానికి బీజేపీలో బీఆర్ఎస్ విలీనమన్న ప్రస్తావన రెండు పార్టీల నేతలు అసలు ఊహించలేకపోతున్నారు. నిజమో అబద్ధమో తేలకపోయినా.. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుతో వెళ్లాలనే ప్రయత్నం బిఆర్ఎస్ చేసిందనే టాక్ నడిచింది. అదప్పుడు పట్టాలెక్కలేదు. అయితే పార్లమెంట్ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పూర్తిగా డీలా పడిపోవడంతో ఇక విలీన ప్రచారం జోరందుకుంది. ఆ దిశగా రెండు వైపుల నుంచి ఎలాంటి కదలిక లేకపోయినా, అసలు అలాంటి అవసరం ఇప్పుడు రెండు పార్టీలకూ ఏ మాత్రం లేకపోయినా…. ఈ ప్రచారానికి ప్రభుత్వ పెద్దలు ఎక్కువ ప్రాధాన్యమివ్వడం ఆసక్తికరంగా మారింది.

అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్‌, బీజేపీ మధ్య సత్సంబంధాలు ఉన్నాయనే ప్రచారంతోనే రెండు పార్టీలూ నష్టపోయాయనే విశ్లేషణలు ఉన్నాయి. ఆ తర్వాత రెండు పార్టీలు పొత్తులు కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయనే ప్రచారంతో లోక్ సభ ఎన్నికల్లో కారుకు గండి పడింది. ఇక ఇప్పుడు ఆ రెండు పార్టీలూ కలిసిపోనున్నాయనే ప్రచారంతో బీజేపీ, బీఆర్ఎస్ ఉక్కిరిబిక్కిరి అవుతున్నాయిబీఆర్ఎస్‌ నేత వివేకానంద. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీలు కలిసి పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. ఆ రెండు పార్టీల మధ్య బంధం రోజురోజుకూ బలపడుతోందన్నారు. అంతేకాదు కేంద్రమంత్రి బండి సంజయ్‌పైనా ఘాటుగా రియాక్ట్‌ అయ్యారు. సీఎం రేవంత్‌ రెడ్డికి బండి సంజయ్ కోవర్టులా మారారని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు బండి సంజయ్ కేంద్ర మంత్రి కాదని.. సీఎం రేవంత్ రెడ్డికి సహాయ మంత్రిగా పనిచేస్తున్నారని వివేకానంద హాట్‌ కామెంట్స్‌ చేయడం ఇప్పుడు తెలంగాణలో చర్చనీయాంశమైంది.

సీఎం రేవంత్‌రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు వివేకానంద. బీజేపీ నేతలపై రేవంత్ రెడ్డి పొగడ్తల వర్షం కురిపిస్తున్నారన్నారు. ఢిల్లీలో కుస్తీ, గల్లీలో దోస్తీ అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్‌, బీజేపీ స్నేహం వల్ల రాష్ట్రానికి ఉపయోగం లేకపోగా.. నష్టం ఎక్కువ జరుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఆ రెండు పార్టీలకు ప్రజలు… చెరో ఎనిమిది మంది ఎంపీలను గెలిపించినా కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి వచ్చింది గుండు సున్నా అని ఎద్దేవా చేశారు వివేకానంద. రేవంత్‌రెడ్డి బీజేపీతో ఫ్రెండ్‌షిప్‌ను పక్కనపెట్టి… పాలనపై దృష్టి పెట్టాలన్నారు.ఇటు మరో బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి సైతం… బీజేపీ, కాంగ్రెస్‌ ఒకటేనన్నారు.

కేటీఆర్‌ను జైలులో వేస్తామంటున్న బండి సంజయ్‌…అసలు కేంద్రమంత్రా, ముఖ్యమంత్రా…? అని ప్రశ్నించారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీ కలిసి పని చేస్తున్నాయని.. కిషన్ రెడ్డి, రేవంత్ రెడ్డి, బండి సంజయ్‌ మధ్య ఓ అవగాహన ఉందన్నారు. అంతకుముందు బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కూడా పలుసార్లు ఇవే కామెంట్స్‌ చేశారు. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు ముమ్మాటికి ఒకటేనంటూ విమర్శలు గుప్పించారు. మరోవైపు కాంగ్రెస్‌ మాత్రం… బీఆర్ఎస్‌, బీజేపీ పార్టీలు ఎప్పటినుంచో ఫ్రెండ్స్‌ అని ఆ విషయం అందరికి తెలుసంటోంది. ఇటు బీజేపీ సైతం ఏం తగ్గట్లేదు.. హే మాకు ఎవరిదో దోస్తీ లేదు అసలు కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ పార్టీలే కలిసి పనిచేస్తున్నాయంటూ కౌంటర్‌ ఎటాక్‌కి దిగుతున్నారు.

Covert politics

 

BJP as a full fledged national party | పూర్తి స్థాయి జాతీయ పార్టీగా బీజేపీ… | Eeroju news

Related posts

Leave a Comment