There are four airports in AP | ఏపీలో నాలుగు ఎయిర్ పోర్టులు | Eeroju news

There are four airports in AP

ఏపీలో నాలుగు ఎయిర్ పోర్టులు

విజయవాడ, ఆగస్టు 12, (న్యూస్ పల్స్)

There are four airports in AP

ఏపీలో మరో నాలుగు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు కానున్నాయి. మరో నాలుగుచోట్ల ఎయిర్‌పోర్టులు నిర్మించేందుకు కేంద్రం ప్రణాళికలు రచిస్తోంది. ఈ విషయాన్ని కేంద్ర పౌరవిమానయానశాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు స్వయంగా వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా మూలపేట, చిత్తూరు జిల్లా కుప్పం, నెల్లూరు జిల్లాలోని దగదర్తి, గుంటూరు జిల్లా నాగార్జునసాగర్‌లలో కొత్తగా విమానాశ్రయాలను నిర్మించడంపై ఆలోచిస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. భోగాపురం ఎయిర్‌పోర్టు పనులను పరిశీలించిన రామ్మోహన్ నాయుడు.. అనంతరం ఈ వ్యాఖ్యలు చేశారు. అలాగే భోగాపురం విమానాశ్రయాన్ని కూడా 2026 జూన్ నెలలోపు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర మంత్రి చెప్పారు.

ఆ ప్రకారమే పనులన్నీ వేగంగా జరుగుతున్నట్లు వివరించారు. మరోవైపు భోగాపురం విమానాశ్రయం పూర్తి అయితే ఉత్తరాంధ్ర రూపురేఖలు మారిపోతాయన్న మంత్రి… తాము అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్మాణంలో వేగం పెరిగినట్లు తెలిపారు. జీఎంఆర్‌, ఎల్‌అండ్‌టీ సంస్థలు నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేస్తున్నాయని వివరించారు. జులై నెల నుంచి ఇప్పటి వరకూ భోగాపురం ఎయిర్‌పోర్టు పనుల్లో నాలుగు శాతం పురోగతి ఉన్నట్లు చెప్పారు. భోగాపురం విమానాశ్రయం పనులు ఇప్పటి వరకూ 36 శాతం పూర్తి అయ్యాయన్న మంత్రి రామ్మోహన్ నాయుడు.. గడువు కంటే ముందే ఎయిర్‌పోర్టు నిర్మాణం పూర్తిచేస్తా్మని తెలిపారు. ప్రతి నెలా ఎయిర్‌పోర్టు పనులను పరిశీలిస్తానని అధికారులకు స్పష్టం చేశారు.

మరోవైపు కేంద్రంలోని ఎన్డీఏ కూటమిలో టీడీపీ కీలక భాగస్వామిగా ఉండటంతో పౌరవిమానయానశాఖ.. టీడీపీ ఎంపీ అయిన కింజరాపు రామ్మోహన్ నాయుడికి దక్కింది. దీంతో రాష్ట్రంలో అవసరమైన ఎయిర్‌పోర్టుల నిర్మాణం, విమానాశ్రయాల అభివృద్ధి పనులను వేగంగా పూర్తిచేసుకోవాలని టీడీపీ భావిస్తోంది. ఈ క్రమంలోనే మంత్రి కూడా భోగాపురం ఎయిర్ పోర్టు పనుల నిర్మాణంపై ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. ప్రతి నెలా పనులను క్షేత్రస్థాయిలో పరిశీలిస్తున్న రామ్మోహన్ నాయుడు.. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని ప్రజలకు వివరిస్తున్నారు. అలాగే రాష్ట్రంలో మిగతా ప్రాంతాల్లో విమానాశ్రయాల ఏర్పాటుపైనా రామ్మోహన్ నాయుడు దృష్టిసారించారు. ఈ క్రమంలో దగదర్తి, కుప్పం, శ్రీకాకుళం, నాగార్జునసాగర్ ప్రాంతాల్లో నూతన విమానాశ్రయాల ఏర్పాటుపై ఆలోచనలు చేస్తున్నారు.

There are four airports in AP

 

Elevated Corridor | ఏ రెండు ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రాజెక్టులు | Eeroju news

Related posts

Leave a Comment