Nagashaurya, Ram Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films Production No. 1 Regular Shooting Begins Today | నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 1 రెగ్యులర్ షూటింగ్ ఈరోజు ప్రారంభం | Eeroju news

Nagashaurya, Ram Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films Production No. 1 Regular Shooting Begins Today

నాగశౌర్య, రామ్ దేశిన, శ్రీనివాసరావు చింతలపూడి, శ్రీ వైష్ణవి ఫిల్మ్స్ ప్రొడక్షన్ నెం 1 రెగ్యులర్ షూటింగ్

ఈరోజు ప్రారంభం

 

Nagashaurya, Ram Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films Production No. 1

Regular Shooting Begins Today

 

హీరో నాగ శౌర్య తన నూతన చిత్రాన్ని అనౌన్స్ చేశారు. డెబ్యుటెంట్ రామ్ దేశిన (రమేష్) దర్శకత్వం వహించే ఈ చిత్రాన్ని శ్రీ వైష్ణవి ఫిలింస్ బ్యానర్‌పై న్యూకమ్మర్ శ్రీనివాసరావు చింతలపూడి నిర్మిస్తున్నారు. ఈ నూతన చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు ప్రారంభమైయింది. డైరెక్టర్ రమేష్, ప్రముఖ దర్శకులు గౌతమ్ వాసుదేవ్ మీనన్, వైవిఎస్ చౌద, శ్రీను వైట్ల వద్ద డైరెక్షన్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేశారు. అనేక విజయవంతమైన చిత్రాలకు సహ రచయితగా పనిచేశారు.యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందే ఈ చిత్రంలో సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్‌కుమార్‌లతో సహా ప్రముఖ నటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ చిత్రానికి టాప్ టెక్నీషియన్స్ పని చేస్తున్నారు. ప్రముఖ సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ డీవోపీగా పనిచేస్తుండగా హారిస్ జయరాజ్ తెలుగు సినిమాకి కంబ్యాక్ ఇస్తూ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఆర్ట్ డిపార్ట్‌మెంట్‌ను రాజీవ్ నాయర్ పర్యవేక్షించగా, కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్ గా పని చేస్తున్నారు.

నటీనటులు: నాగ శౌర్య, సముద్రఖని, రాజేంద్ర ప్రసాద్, సాయికుమార్, మైమ్ గోపి, శ్రీదేవి విజయ్ కుమార్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ, పృథ్వి, అజయ్, ప్రియ, నెల్లూరు సుదర్శన్, కృష్ణుడు, చమక్ చంద్ర, శివన్నారాయణ

Nagashaurya, Ram Desina, Srinivasa Rao Chintalapudi, Sri Vaishnavi Films Production No. 1 Regular Shooting Begins Today

 

Ninnu Vadalanu movie is coming in horror suspense thriller genre | హర్రర్ సస్పెన్స్ థ్రిల్లర్ జోనర్లో వస్తున్న సినిమా నిన్ను వదలను | Eeroju news

Related posts

Leave a Comment