The movie that connects all the lovers is ‘Pagal vs. Kadal’ – Young Hero Vijay Shankar | ప్రేమికులంతా కనెక్ట్ అయ్యే సినిమా “పాగల్ వర్సెస్ కాదల్” – యంగ్ హీరో విజయ్ శంకర్ | Eeroju news

The movie that connects all the lovers is 'Pagal vs. Kadal' - Young Hero Vijay Shankar

 ప్రేమికులంతా కనెక్ట్ అయ్యే సినిమా “పాగల్ వర్సెస్ కాదల్” – యంగ్ హీరో విజయ్ శంకర్

 

The movie that connects all the lovers is ‘Pagal vs. Kadal’ – Young Hero Vijay Shankar

 

“దేవరకొండలో విజయ్ ప్రేమకథ”, “ఫోకస్” వంటి చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. యంగ్ టాలెంటెడ్ హీరో విజయ్ శంకర్. ఆయన హీరోగా నటించిన కొత్త సినిమా “పాగల్ వర్సెస్ కాదల్”. ఈ చిత్రంలో విషిక హీరోయిన్ గా నటిస్తోంది. శివత్రి ఫిలింస్ బ్యానర్ పై పడ్డాన మన్మథరావు నిర్మిస్తున్నారు. రాజేశ్ ముదునూరి దర్శకత్వం వహిస్తున్నారు. రొమాంటిక్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన “పాగల్ వర్సెస్ కాదల్” సినిమా ఈ నెల 9న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ తో పాటు చిత్ర విశేషాలను తాజా ఇంటర్వ్యూలో తెలిపారు హీరో విజయ్ శంకర్.

– డైరెక్టర్ రాజేశ్ ముదునూరి “పాగల్ వర్సెస్ కాదల్” కథ చెప్పినప్పుడు యూనిక్ గా ఉందనిపించింది. ప్రతి కామన్ ఆడియెన్ కు రీచ్ అయ్యే సబ్జెక్ట్ ఇది. మనం మన లైఫ్ లో ఇలాంటి సందర్భాలు, క్యారెక్టర్స్ చూశామనే ఫీల్ కలుగుతుంది. “పాగల్ వర్సెస్ కాదల్” సినిమాలో నేను కార్తీక్ అనే క్యారెక్టర్ చేస్తున్నాను. అతనో సాఫ్ట్ వేర్ ఎంప్లాయ్. చాలా ఇన్నోసెంట్ పర్సన్. అతను ఓ గయ్యాలి అమ్మయిని లవ్ చేస్తుంటాడు. ఇలాంటి భిన్న వ్యక్తిత్వాలు ఉన్న ప్రేమికుల మధ్య రిలేషన్ ఎలా ముందుకు సాగింది అనేది ఎంటర్ టైన్ మెంట్, రొమాంటిక్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకునేలా ఉంటుంది.- ఈ తరం ప్రేమికులంతా “పాగల్ వర్సెస్ కాదల్” కథకు కనెక్ట్ అవుతారు. ప్రతి ప్రేమికుడి జీవితంలో ఇలాంటి సందర్భం ఒకటి వచ్చిందని అనిపిస్తుంది. సినిమా చూస్తే మీకు ఈ ఫీల్ తప్పకుండా కలుగుతుంది. ఈ టైటిల్ మా స్టోరీకి పర్పెక్ట్ గా యాప్ట్ గా పెట్టాం. మా మూవీలో సిచ్యువేషనల్ కామెడీ ఉంటుంది.

– “పాగల్ వర్సెస్ కాదల్” సినిమాలో బ్రహ్మాజీ, షకలక శంకర్ క్యారెక్టర్స్ కీలకంగా ఉంటాయి. కథను వాళ్లిద్దరు నెరేట్ చేస్తుంటారు. బిగినింగ్ నుంచి ఎండింగ్ వరకు బ్రహ్మాజీ, షకలక శంకర్ పాత్రలు మూవీలో కొనసాగుతాయి. బ్రహ్మాజీ గారు అంత పేరున్న నటుడు అయినా మాకు ఎంతో సపోర్టివ్ గా, స్నేహంగా ఉండేవారు.
– నా పెయిర్ గా నటించిన విషికకు అందరి ప్రశంసలు దక్కుతాయి. తను గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ లో ప్రేక్షకులు ఇంప్రెస్ అయ్యేలా నటించింది. మీరు సినిమా చూస్తే తను యాక్టింగ్ చేస్తుందా లేక రియల్ గా ఉందా అనుకుంటారు. “పాగల్ వర్సెస్ కాదల్” సినిమాను మా దర్శకుడు రాజేశ్ ముదునూరి ఎంగేజింగ్ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈ సినిమా తర్వాత ఆయనకు మంచి పేరొస్తుందని చెప్పగలను. వెరీ టాలెంటెడ్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు.
– టెక్నికల్ గా మంచి క్వాలిటీతో మా మూవీ ఉంటుంది. శ్యామ్ కుమార్ ఎడిటింగ్, నవధీర్ సినిమాటోగ్రఫీ, ప్రవీణ్ సంగడాల మ్యూజిక్ ఆకర్షణ అవుతాయి. కథకు తగినట్లు  శివత్రీ ఫిలింస్ ప్రొడక్షన్ వ్యాల్యూస్ ఆకట్టుకుంటాయి.

– మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను బాగా అభిమానిస్తాను. టాలీవుడ్ లో యంగ్ టాలెంట్ కు మంచి ఎంకరేజ్ మెంట్ ఉంది. మాది శ్రీకాకుళం. నేను ఏ సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చాను. ఒక సినిమా ఆఫర్ వచ్చాక అది చేసేసి తిరిగి వెళ్లిపోదాం అనుకున్నా. కానీ అవకాశాలు వస్తున్నాయి. కంటిన్యూగా సినిమాలు చేస్తున్నాను. నా మూవీస్ థియేటర్ లో రిలీజై, ఓటీటీలో కూడా స్ట్రీమింగ్ అవుతున్నాయి. అది నాకు ఒక యంగ్ హీరోగా ఎంతో ఎంకరేజింగ్ గా అనిపిస్తోంది. ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ నమ్మడం వల్లే అవకాశాలు వస్తున్నాయి. కెరీర్ పరంగా సంతృప్తిగా ఉన్నాను. మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం 9 సినిమాలు కంప్లీట్ చేశాను. వాటిలో ఒక బిగ్ బడ్జెట్ మూవీ రాచరికం కూడా ఉంది. దాదాపు 10 కోట్ల రూపాయలతో ఈ సినిమా రూపొందుతోంది. తెలుగు ఆడియెన్స్ ఆదరణ పొందాలి, మా పేరెంట్స్, నా వాళ్లంతా గర్వంగా చెప్పుకోవాలి అనేదే హీరోగా నా లక్ష్యం.

The movie that connects all the lovers is 'Pagal vs. Kadal' - Young Hero Vijay Shankar

 

Dead Pull & Wolverine | లేడీ డెడ్ పుల్ తో ప్రేక్ష‌కుల ముందుక రానున్న డెడ్ పుల్, విడుద‌లైన డెడ్ పుల్ & వాల్వ‌రిన్ ఫైన‌ల్ ట్రైల‌ర్ | Eeroju news

Related posts

Leave a Comment