కుమ్కీ ఏనుగుల కోసం పవన్
బెంగళూరు, ఆగస్టు 8
Pawan for kumki elephants
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఇవాళ బెంగళూరులో పర్యటించారు. కర్నాటక పర్యావరణ, అటవీ మంత్రి ఈశ్వర్ బి.ఖంద్రేతో ఆయన భేటీ కానున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఓ దీర్ఘకాలిక సమస్య పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ ఆయనతో చర్చలు జరపనున్నారు. ఈ చర్చలు ఫలిస్తే మన రాష్ట్రంలో పలు జిల్లాల్లో జనం ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యంలో పవన్ ఈ ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబుకు మైనస్, పెద్దిరెడ్డికి ఫ్లస్ పాయింట్, అధికారం వచ్చినా రివర్స్ అయ్యింది ఏపీలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా, పార్వతీపురం జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఏనుగులు ఊళ్ళ మీదకు వచ్చి పంటలు నాశనం చేస్తున్నాయి. దీంతోపాటు జనానికి ప్రాణ హాని కలిగిస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి తరిమేందుకు అటవీ శాఖ ప్రస్తుతం చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఈ సమస్య నానాటికీ తీవ్రమవుతోంది. ఈ నేపథ్యంలో ఇలా ఊళ్లపైకి వస్తున్న అటవీ ఏనుగులకు చెక్ పెట్టేందుకు ఓ ప్రత్యేక తరహా కుమ్కీ ఏనుగులు అవసరమని అధికారులు పవన్ కు తెలిపారు.