విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, రవితేజ ముళ్లపూడి, రామ్ తాళ్లూరి, ఎస్‌ఆర్‌టి ఎంటర్‌టైన్‌మెంట్స్ ‘మెకానిక్ రాకీ’ నుంచి వైబ్రంట్
ఫోక్ సాంగ్- ఫస్ట్ సింగిల్ గుల్లేడు గుల్లేడు రిలీజ్
Vishwak Sen, Meenakshi Chaudhary, Ravi Teja Mullapudi, Ram Talluri, Vibrant Folk Song from SRT
Entertainments ‘Mechanic Rocky’- First Single Gulledu Gulledu Release
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ తన అప్ కమింగ్ మూవీ ‘మెకానిక్ రాకీ’తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమౌతున్నారు. ఈ మోస్ట్ ఎవైటెడ్ మూవీని మాస్ యాక్షన్, కామెడీ ఎంటర్ టైనర్ గా రూపొందించారు. ఈ చిత్రానికి రవితేజ ముళ్లపూడి రచన, దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత రామ్ తాళ్లూరి తన SRT ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మించారు. ఫస్ట్ లుక్, ఫస్ట్ గేర్‌కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. మేకర్స్ ఫస్ట్ సింగిల్ గుల్లేడు గుల్లేడు రిలీజ్ చేయడంతో మ్యూజిక్ జర్నీ ప్రారంభించారు. ఈ పాట లైవ్లీ ఫోక్ టచ్ తో ఆకట్టుకుంది. లిరిక్ రైటర్ సుద్దాల అశోక్ తేజ ట్రెడిషన్ ఉట్టిపడేలా అద్భుతమైన సాహిత్యాన్ని అందించారు.
జేక్స్ బెజోయ్ సాంగ్ ని ఫోక్ రూట్స్ తో పెప్పీ బీట్‌లతో, డైనమిక్, ఎనర్జిటిక్ మ్యూజిక్ ఎక్స్ పీరియన్స్ ని క్రియేట్ చేశారు. వెడ్డింగ్ షెనానిగన్స్, ఫోక్ ఎనర్జీ తో కలిసినప్పుడు రిజల్ట్ వైబ్రెంట్ సెలబ్రేషన్ లా వుంటుంది. ఇది ట్రెడిషన్స్ తో ఎంటర్టైన్మెంట్ ని బ్లెండ్ చేసి మెమరబుల్ వైబ్ ని క్రియేట్ చేస్తోంది. సింగర్ మంగ్లీ ప్లజెంట్, ఎంగేజింగ్ పెర్ఫార్మెన్స్ తో సాంగ్ ని పాడటం ఆకట్టుకుంది. ఈ పాటలో విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరిల ఎట్రాక్టివ్ డ్యాన్స్ మూవ్స్ మరింత ఆకర్షణను పెంచాయి. వారి ఎలిగెంట్ కెమిస్ట్రీ, కొరియోగ్రఫీ వీడియోను విజువల్ డిలైట్‌గా మార్చాయి, యష్ మాస్టర్ కొరియోగ్రఫీ ఆకట్టుకుంది.అద్భుతమైన సెట్‌లో చిత్రీకరించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి.
ట్రెడిషనల్, మోడరన్ ఎలిమెంట్స్ కూడిన గుల్లేడు గుల్లేడు మోమరబుల్ హిట్ అవుతుందని ప్రామిస్ చేసింది. మెకానిక్ రాకీ సౌండ్‌ట్రాక్స్ పై హై బార్‌ను సెట్ చేసింది.శ్రద్ధా శ్రీనాథ్ మరో హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి మనోజ్ కటసాని సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. అన్వర్ అలీ ఎడిటర్, క్రాంతి ప్రియం ప్రొడక్షన్ డిజైనర్. సత్యం రాజేష్, విద్యాసాగర్ జె ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు.మెకానిక్ రాకీ అక్టోబర్ 31న దీపావళికి విడుదల కానుంది.
తారాగణం: విశ్వక్ సేన్, మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్, నరేష్, వైవా హర్ష, హర్షవర్ధన్, రోడీస్ రఘు రామ్