Ganesh celebrations in the city from September 7 | నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు | Eeroju news

Ganesh celebrations in the city from September 7

నగరంలో సెప్టెంబర్ 7 నుంచి గణేష్ ఉత్సవాలు

హైదరాబాద్

Ganesh celebrations in the city from September 7

 

సామూహిక గణేశ ఉత్సవాలకు భాగ్యనగరం ముస్తాబవుతుందని అందులో భాగంగా ఈరోజు హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి కార్యాలయాన్ని ప్రారంభించుకోవడం జరిగిందని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ సమితి సెక్రటరీ శశిధర్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెప్టెంబర్ 7వ తేదీన ప్రారంభమయ్యే గణేష్ ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీన గణేష్ నిమజ్జనంతో ముగుస్తాయని… అందుకుగాను పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు.

భాగ్యనగర్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నది ఏంటంటే  ఈ ఉత్సవాలు ఏ విధంగా జరుగుతున్నాయని తెలుసుకోవడానికి, ఈ ఉత్సవాలను స్ఫూర్తిగా తీసుకొని దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా హిందూ సమాజం సామూహికమైనటువంటి ఉత్సవాలను నిర్వహించుకుంటా ఉంది కాబట్టి ఈ సంవత్సరం మరింత ఉత్సాహంతోటి ప్రదేశం సదర్వం సంస్కృతి పరిరక్షించుకోవాలనేటువంటి ఒక లక్ష్యంతోటి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం లోపట ప్రతి గణేష్ మండపముని యొక్క భాగస్వామ్యాన్ని తీసుకొని ముందుకు పోతుంది.

అదేవిధంగా ప్రభుత్వం కూడా అన్ని విభాగాలు సమన్వయపర్చడానికి ఈపాటికి పనులు సమావేశాలు ప్రారంభమైన అన్ని ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యొక్క అన్ని ప్రభుత్వ విభాగాలను కూడా సమన్వయపరచుకుంటూ మా సూచనలు సలహాలు ప్రభుత్వం ముందు పెడుతూ గతంలో ఉన్నటువంటి అనుభవాలను ప్రభుత్వం ఈ సంవత్సరం అధిక బడ్జెట్ను కూడా కేటాయించి ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించడం లోపట ప్రభుత్వాన్ని కూడా పూర్తి సహకారం ఉంటుందని మేము ఆశిస్తున్నాం ప్రభుత్వం కూడా ఆ రకమైన సిద్ధం కావాలని కోరుకుంటున్నామని  అన్నారు.

Ganesh celebrations in the city from September 7

 

Special Pujas of Bhatti Vikramarka at Nalla Pochamma Temple | నల్ల పోచమ్మ ఆలయంలో భట్టీ ప్రత్యేక పూజలు | Eeroju news

Related posts

Leave a Comment