Arrest of BRS MLAs Speaker is serious about dharna videos | బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ | Eeroju news

BRS

బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అరెస్ట్ –

ధర్నా వీడియోలపై స్పీకర్ సీరియస్    

హైదరాబాద్, ఆగస్టు 1

Arrest of BRS MLAs Speaker is serious about dharna videos

తెలంగాణ అసెంబ్లీలో స్పీకర్ చాంబర్ ముందు ధర్నా చేస్తున్న  బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను మార్షల్స్ బయటకు తీసుకు వచ్చారు. వారిని తర్వాత పోలీసులు అరెస్టు చేసి బస్సులో స్టేషన్‌కు తరలించారు. రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాల్సిందేనని ఎమ్మెల్యేలు పట్టుబట్టారు. నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించడం సరి కాదని.. స్పీకర్ చాంబర్ ముందు నుంచి అందరూ వెళ్లిపోవాలని చెప్పినా కదలకపోవడంతో.. మార్షల్స్ వారిని ఎత్తుకుని తీసుకెళ్లారు. అక్కడ వారిని పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్‌కు తలించారు. తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ధర్నా వ్యవహారం వివాాస్పదమయింది.

అసెంబ్లీ ప్రారంభమైన తర్వాత ఎమ్మెల్యేలు మహిళా ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తర్వాత అసెంబ్లీలోని సీఎం చాంబర్ ముందు ఎమ్మెల్యేలు ధర్నా చేశారు. ఈ వీడియోలు సోషల్ మీడియాలోకి వచ్చాయి. నిజానికి అసెంబ్లీ ప్రాంగణం మొత్తంలో ఫోటోలు, వీడియోలు తీయాలన్నా.. తీసిన వాటిని బయటకు పంపాలన్నా.. ప్రసారం చేయాల్నా స్పీకర్ అనుమతి ఉండాల్సిందే. కానీ ఉద్దేశపూర్వకంాగ వీడియోలు తీసి ధర్నా చేసినట్లుగా మీడియాకు లీక్ చేయడంపై స్పీకర్  తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు రహస్యంగా రికార్డు చేసినట్లుగా అనుమానిస్తున్నారు. రికార్డు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించడంతో అసెంబ్లీ సిబ్బంది సీసీ కెమెరా ఫుటేజీ పరిశీలించి ఫోన్ రికార్డు చేసన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి..   బుధవారం మీడియా ప్రతినిధులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ.. కొంత మందిపై సమయం సందర్భాన్ని బట్టి అనర్హతా వేటు వేసేందుకు అవకాశం ఉందని చెప్పారు. ఇలాంటి తప్పుల వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఇరుక్కుపోతారని ఇప్పుడు..టార్గెట్ గా పెట్టుకున్న ఎమ్మెల్యేలే ఈ వీడియోలు రికార్డు చేశారని రికార్డు చేసుకుని చర్యలు తీసుకునే అవకాశాలు కూడా ఉంటాయి.

బుధవారం అసెంబ్లలో జరిగిన పరిణామాలతో  బీఆర్ఎస్ ..  సీఎం రేవంత్ క్షమాపణ చెప్పాలన్న సింగిల్ పాయింట్ ఎజెండాగా రాజకీయం ప్రారంభించారు. గురువారం రాష్ట్ర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మల దహనానికి పిలుపునిచ్చారు. ప్రతీ రోజూ సాఫీగా సాగే అసెంబ్లీలో ఇవాళ స్కిల్ యూనివర్శిటీపై చర్చ జరగాల్సి ఉన్నా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆసక్తి చూపించలేదు. వారు రేవండ్ రెడ్డి క్షమాపణలు చెప్పాలన్న డిమాండ్ కే  కట్టుబడ్డారు. తర్వాత సీఎం చాంబర్ ముందు ధర్నా చేసి.. వీడియోలు తీసుకున్నారు. దీంతో మార్షల్స్ వారిని అక్కడ్నుంచి  బలవంతంగా తరలించారు.

BRS

 

How many people are left in BRS? | బీఆర్ఎస్ లో మిగిలేది ఎంత మంది | Eeroju news

Related posts

Leave a Comment