Sirisila is the top in cell phone recovery | సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల టాప్ | Eeroju news

Sirisila is the top in cell phone recovery

సెల్ ఫోన్ల రికవరీలో సిరిసిల్ల టాప్

కరీంనగర్, జూలై  30, (న్యూస్ పల్స్)

Sirisila is the top in cell phone recovery

గత కొన్ని రోజుల నుండి పోగొట్టుకున్న, దొంగలించబడిన ఫోన్లను రికవరీ చేసి సంబంధిత బాధితులకు అప్పగించారు సిరిసిల్ల పోలీసులు.. గత ఏడాది ఏప్రిల్ 20 నుండి జులై 28వ తేదీ వరకు జిల్లాలో 1,200 సెల్ ఫోన్లు సిఈఐఆర్ టెక్నాలజీ ద్వారా గుర్తించి 1019 ఫోన్లు సంబంధిత బాధితులకు అప్పగించారు. సెల్ఫోన్ పోయిందంటే టెన్షన్ పడవద్దని.. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని పోలీసులు నిరూపిస్తున్నారు. సిరిసిల్ల జిల్లాలో ఈ రోజు వరకు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా 1200 ఫోన్లు గుర్తించి 1019 ఫోన్లను సబంధిత బాధితులకు అందించారు. 84శాతం రికవరీ ఫోన్లతో రాష్టంలోనే మొదటి స్థానంలో జిల్లా నిలిచించింది.

రికవరీ చేసిన సొత్తు విలువ సుమారుగా కోటి రూపాయలు. రాష్ట్రంలో కమిషనరేట్స్ కాకుండా మిగితా మిగిలిన జిల్లాలతో పోల్చుకుంటే సిరిసిల్ల జిల్లాలో అత్యధికంగా 1000 పైగా ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అప్పగించడం విశేషం. మీ బంధువులు, స్నేహితుల్లో ఎవరిదైనా ఫోన్ దొంగతనం జరిగినా.. ఎక్కడైనా పోగొట్టుకున్నా.. వెంటనే పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయాలని బాధితులకు జిల్లా ఎస్పీ సూచించారు.కేంద్ర టెలికాం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది. సెల్ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ముందుగా ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్సైట్లో లాగిన్ కావాలి.

అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాప్ట్/ స్టోలెన్ అనే లింకై క్లిక్ చేసి, సెల్ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏ రోజు, ఎక్కడ పోయింది. రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ఫోన్ నెంబర్ ఇవ్వాలి ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చన్నారుసీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84% రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన ఐటీ కోర్ జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులను అందజేశారు. పోయిన ఫోను ఇక దొరకదు అనుకున్నామని.. పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి తమ ఫోన్ రికవరీ చేసి అందించినందుకు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.

సెల్ ఫోన్ పోయిందా…సీఈఐఆర్ పోర్టల్ లో నమోదు చేయండి‌.

సెల్ ఫోన్ పోయిందా.. అయితే టెన్షన్ పడవద్దు. వెంటనే సీఈఐఆర్ లాగిన్ అయి వివరాలు నమోదు చేసుకుంటే తొందర్లోనే ఫోన్ ఎక్కడుందో కనిపెట్టొచ్చని ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. కేంద్ర టెలికాం మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన సీఈఐఆర్ అనే పోర్టల్ ద్వారా సెల్ ఫోన్ పోయినా, దొంగతనానికి గురైనా వెతికి పట్టుకునేందుకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు. సెల్ ఫోన్ పోయిన వ్యక్తి ముందుగా సంబంధిత పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయాలి, లేదా మీసేవ కేంద్రానికి వెళ్లి www.ceir.gov.in అనే వెబ్ సైట్లో లాగిన్ కావాలి.

అందులో రిక్వెస్ట్ ఫర్ బ్లాకింగ్ లాస్ట్/ స్టోలెన్ అనే లింక్ పై క్లిక్ చేసి, సెల్ ఫోన్ నెంబర్, ఐఎంఈఐ నెంబర్, కంపెనీ పేరు, మోడల్, కొన్న బిల్లు అప్లోడ్ చేయాలి. దీంతో పాటు ఏరోజు, ఎక్కడ పోయింది….రాష్ట్రం, జిల్లా, పోలీస్టేషన్ లో ఫిర్యాదు చేసిన వివరాలు నమోదు చేయాలి. చివరిగా వినియోగదారుడి పేరు, చిరునామా, గుర్తింపు కార్డు, ఈమెయిల్ ఐడీ, ఓటీపీ కోసం మరో సెల్ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఇదంతా పూర్తయిన తరువాత ఒక ఐడీ నెంబర్ వస్తుంది. తద్వారా సంబంధిత ఐడీ ఫోన్ స్టేటస్ తెలుసుకోవచ్చన్నారు.

ఐటీ కోర్ సిబ్బందికి అభినందనలు

సీఈఐఆర్ అప్లికేషన్ ద్వారా జిల్లాలో పోయిన మొబైల్ ఫోన్స్ 84 శాతం రికవరీ చేసి బాధితులకు అప్పగించడంలో కృషి చేసిన ఐటీ కోర్ సిబ్బందిని ఎస్పీ అభినందించారు. ఎస్.ఐ కిరణ్ కుమార్, కానిస్టేబుల్ రాజాతిరుమలేష్ లను నగదు రివార్డులను అందజేశారు. పోయిన ఫోన్ దొరకదు అనుకున్న తరుణంలో పోలీసులు టెక్నాలజీ ఉపయోగించి ఫోన్ రికవరీ చేసి అందించినందుకు సంబంధిత బాధితులు జిల్లా ఎస్పీకి, పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.

Sirisila is the top in cell phone recovery

 

The CJ Bench that conducted the inquiry on the phone tapping | ఫోన్ ట్యాపింగ్ పై విచారణ చేపట్టిన సిజె ధర్మాసనం | Eeroju news

 

Related posts

Leave a Comment