Thats why we dont include MLAs in BJP.. Raghunandan | ఎమ్మెల్యేలను మేము బీజేపీలో అందుకే చేర్చుకోవట్లేదు.. | Eeroju news

Raghunandan

ఎమ్మెల్యేలను మేము బీజేపీలో అందుకే చేర్చుకోవట్లేదు..

రఘునందన్ షాకింగ్ కామెంట్స్

హైదరాబాద్

Thats why we dont include MLAs in BJP.. Raghunandan

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వంపై మెదక్ ఎంపీ రఘనందనరావు  తీవ్ర విమర్శలు గుప్పించారు. ఏడు నెలల్లో గులాబీ రంగు మూడు వర్ణాలు అయింది తప్ప. పాలనలో మార్పు లేదని విమర్శించారు. రాజకీయ వ్యభిచారానికి పాల్పడుతోన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ కు బుద్ది చెబుతామని హెచ్చరించారు. పదవికి రాజీనామా చేస్తేనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకుంటామని స్పష్టం చేశారు. బీజేపీలో చేరటానికి చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. బీజేపీ కార్యాలయంలో మీడియాతో రఘునందన్ మాట్లాడుతూ.

ఉప ఎన్నికకు సిద్ధంగా ఉంటేనే చేర్చుకుంటామని టచ్‌లో ఉన్న ఎమ్మెల్యేలకు చెప్పామని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌ను అరెస్ట్ చేయటానికి రేవంత్ సర్కార్ ఎందుకు భయపడుతోందని ప్రశ్నించారు. అవినీతికి పాల్పడిన సంబంధిత మంత్రులను అరెస్ట్ చేయటానికి మీనమేషాలు లెక్కిస్తోందని విమర్శలు చేశారు. ఏడు నెలల్లో,ఆర్ ట్యాక్స్, బీ ట్యాక్స్, యూ ట్యాక్స్ రాజ్యమేలుతోందని ధ్వజమెత్తారు. ఎన్నికల హామీ మేరకు వెంటనే కొత్త రేషన్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రుణమాఫీ, రైతు భరోసా కోసం పోరాటం చేయాలని కార్యవర్గ సమావేశాల్లో తీర్మానించామని అన్నారు.

నిరుద్యోగ యువతకు అండగా ఉండాలని నిర్ణయించామని చెప్పారు. నిరుద్యోగులపై ప్రతిపక్షంలో ఒకమాట.. అధికారంలో వచ్చాక మరోమాట కాంగ్రెస్ మాట్లాడుతోందని చెప్పుకొచ్చారు. ఓటమి భయంతోనే ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేస్తోందని చెప్పారు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు జరపాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతికి రూ.4,116 లేవు కానీ. సీఎం రేవంత్ రూ. 4 లక్షలు నెల జీతం తీసుకుంటున్నాడని చెప్పారు. దేశంలో ఎక్కువ నెల జీతం రేవంత్ తీసుకుంటున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఇందిరమ్మ ఇల్లు కూడా ఇవ్వలేదని ఎంపీ రఘనందనరావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Raghunandan

 

BRS chief KCR seems to have good days coming | గులాబీ కలిస్తొస్తున్న కాలం | Eeroju news

Related posts

Leave a Comment