కార్మికుల సొమ్ము దర్జాగా దోపిడీ!
హైదరాబాద్, జూలై 12, (న్యూస్ పల్స్)
Extortion of Hyderabad workers’ money
బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ వెల్ఫర్ బోర్డు (బీఓసీడబ్ల్యూడబ్ల్యూ) యాక్ట్ 1996 ప్రకారం, ఏదైనా భవనం నిర్మాణంలో ఉంటే, ఒక శాతం సెస్‌ను వెల్ఫేర్ బోర్డుకు బదులాయించాలి. తెలంగాణలో ఏటా రూ.500 కోట్ల వరకు కార్మికుల కటుంబాలకు ఖర్చు పెట్టేందుకు ఆ ఆదాయం సమకూరుతుంటుంది. అయితే, ఇదే అదునుగా కార్మికుల సొమ్ముని దర్జాగా దోచేశారు. అందుకు రక్త పరీక్షల స్కీమ్ వెనుక జరిగిన స్కామ్ ఉదాహరణ. బయటకు అన్నీ పక్కాగా కనిపించినా, అనేక లొసుగులతో కొట్లాది రూపాయలు కొల్లగొట్టారు. డిజిటల్ ఇండియా స్కీమ్‌ని వాడుకుంటూ కొత్త పంథాలో స్కామ్‌కు తెరతీశారు. నవంబర్ 14, 2022. జీవో 20ని బీఓసీడబ్ల్యూడబ్ల్యూకి హెల్త్ స్ర్కీనింగ్ స్కీమ్ అంటూ తీసుకొచ్చారు.
పారదర్శకంగా ఉండేందుకు సెంట్రల్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సీఎస్సీ(కామన్ సర్వీస్ సెంటర్) ద్వారా పీపీపీ మోడల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. సీజీహెచ్ఎస్ రేట్ల ప్రకారమే టెస్టులు చేయాలని రికమండేషన్ చేశారు. 22 టెస్టులకు గాను రూ.3,256 ఇవ్వాల్సిందిగా నిర్ణయించారు. ఈ రేటుతోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రైవేట్ హాస్పిటల్స్ వైద్యం అందిస్తాయి. అయితే, తెలంగాణలో ఎలాంటి సెంటర్స్ లేకుండానే, అనుభవం లేని కంపెనీకి కేవలం కాంట్రాక్ట్ పద్దతిలో కట్టబెట్టడం వెనకాలే స్కామ్‌కి తెరలేపారు. పథకాలపై అవగాహన లేకుండా ఉండే కార్మికులని టార్గెట్ చేసుకుని స్కీమ్ అమల్లో స్కామ్ చేశారు. డిజిటల్ ఇండియా పథకంలో మొత్తం సీఎస్సీ ద్వారానే అమలు చేస్తారు.
ఢిల్లీలో కంపెనీ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించి, ముంబైలో హెడ్ ఆఫీస్ ఉంటుంది. వీరికి మహారాష్ట్ర ప్రభుత్వంతో చేసిన అనుభవం ఉందని అంటున్నా, అక్కడ హిందూ ల్యాబ్స్ అనే సంస్థ ఇలాంటి పథకాలకు సర్వీస్‌లు అందిస్తోంది. కానీ, సీఎస్సీ పేరు ఉంటే ఎవరికీ అనుమానం రాదనే ఉద్దేశంతో కూడా ఈ పేరుతో తెలంగాణలో అమలు చేద్దామని అనుకున్న 3 నెలల ముందే కంపెనీ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. అప్పటికి తెలంగాణలో ఒక్క ల్యాబ్ కూడా లేదు. ఈ కాంట్రాక్ట్ దక్కించుకున్న తర్వాత 6 నెలల్లో ల్యాబ్స్‌ని ఏర్పాటు చేసుకునేందుకు సమయం తీసుకున్నారు. దీనికి తోడు ప్రతి లేబర్‌కి కాల్ చేసి టెస్టులకు ఒత్తిడి చేశారు. ఇప్పటి వరకు 14 లక్షల కార్మికుల్లో 11 లక్షల మందికి టెస్టులు చేశారు. ఇవి నాణ్యత లేనివిగా కార్మికులు భావిస్తున్నారు. ఈసీజీ తీయకుండానే పంపిస్తున్నారని ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
ఇలా అనేక లోపాలతో వందల్లో ఖర్చుకు వేలల్లో తీసుకుంటూ, తక్కువ స్టాఫ్‌తో క్యాంపులు ఏర్పాటు చేసి ఫోటోలు అప్ లోడ్ చేస్తున్నారని సీపీఎం నేత శ్రీనివాస్ అరోపిస్తున్నారు. ఇన్ డైరెక్ట్‌గా ప్రైవేట్ హాస్పిటల్స్‌కి మేలు చేసేలా వ్యవహరిస్తున్నారని విమర్శిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ స్కీమ్‌లో ఎక్కువ మొత్తంలో మనీ మిస్ యూజ్ అవుతోందని గుర్తించింది. ఆ డబ్బుతో కార్మికుల పిల్లలకు ప్రత్యేక స్కాలర్ షిప్స్ ఇస్తూ విద్యను ప్రొత్సహిస్తోంది. ఇదే టెస్టులను ప్రైవేట్ ల్యాబ్‌లో కేంధ్ర ప్రభుత్వ ఉద్యోగులకు అయ్యే ఖర్చుతోనే బిల్స్ క్లెయిమ్ చేస్తున్నారు. అనవసరంగా టెస్టులు చేసి ప్రైవేట్ హాస్పిటల్స్‌కి పంపిస్తున్నారని అక్కడి స్కామ్‌తో తేలింది. దీంతో తెలంగాణలో కూడా కొత్త సర్కార్ ఈ పథకంపై పునరాలోచించాలనే డిమాండ్ పెరుగుతోంది.
తెలంగాణ రాష్ట్రం అవిర్భవించాక పంపకాల్లో లేబర్ సెస్ మొత్తంలో రూ.1,463 కోట్లను పీవీ మురళీ సాగర్ అక్రమంగా ఏపీ ప్రభుత్వ అకౌంట్స్‌కి బదిలీ చేశారు. అక్టోబర్ 29, 2014న ఎలాంటి లెక్కలు తేలకుండానే, రేషియో ప్రకారం తెలంగాణకు రూ.609 కోట్లు రావాల్సి ఉండగా ఎలాంటి అనుమతులు లేకుండానే చెక్కులు జారీ చేశారు. దీనిపై తెలంగాణ కమిషనర్ చిక్కడిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎఫ్ఐఆర్ 560/2014 కేసు నమోదు చేసి, అకౌంట్స్‌ని ఫ్రీజ్ చేశారు. అయితే, ఈ వివాదం ముగించేందుకు ఈమధ్య కలిసిన ఇరు రాష్ట్రాల సీఎంల మీటింగ్ ఎజెండాలో చేర్చారు. కానీ, డిస్కషన్ చేయకుండానే వదిలేశారు. అభం, శుభం తెలియకుండా కాయ కష్టాన్నే నమ్ముకుని బిల్డింగ్, కన్స్ట్రక్షన్ పనులు చేసుకునే కార్మికుల సెస్ సొమ్ముపైనే అందరి దృష్టి ఉంటుంది.
ప్రతి నిర్మాణ రంగంలో లేబర్‌కి ఒక శాతం సెస్‌ల రూపంలో కంపెనీల నుంచి చెల్లించాలి. వాటిని వారి కుటుంబాల అవసరాలకే ఖర్చు చేయాలి. కానీ, కేసీఆర్ బీసీ బంధుకి రూ.300 కోట్లు, కరోనా ఖర్చుల్లో రూ.1000 కోట్లు వాడేసుకున్నారు. ఇప్పటికీ మరో వెయ్యి కోట్లకు పైగానే ఖజానా ఉంది. కానీ, వాటిని అనవసరపు ఖర్చులకు, పనికి రాని స్కీమ్‌లకు ఖర్చు చేసేందుకు ఉన్నతాధికారులు ప్లాన్ చేస్తున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి పెట్టి కార్మికుల కుటుంబాల జీవితంలో వెలుగు నింపేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.