దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ మంత్రులు
విజయవాడ
Ministers of Telangana visited Durgamma
తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుదిల్ల శ్రీధర్ బాబు, సిడబ్ల్యుసి సభ్యులు రుద్రరాజు తదితరులు మంగళవారం నాడు విజయవాడ కనుకదుర్గ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. వారికి కనుకదుర్గ ఆలయం వద్ద ఆలయ ఈవో మరియు జిల్లా రెవిన్యూ అధికారి, జిల్లా యంత్రాంగం ఘనంగా స్వాగతం పలికారు . ఆలయంలో ఆలయ అర్చకులు మల్లయ్య శాస్త్రి, మరియు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
అమ్మవారి గర్భగుడిలో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని, సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో తెలంగాణ రాష్ట్రం విలసిల్లాలని ప్రత్యేక పూజలు, అర్చనలు చేయించారు. భట్టి విక్రమార్క స్పీచ్ మాట్లాడుతూ ఎన్నో ఆశలు ఆకాంక్షలతో తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం ఇందిరమ్మ రాజ్యం ప్రజా ప్రభుత్వ పాలనలో సుభిక్షంగా, సురక్షితంగా ఉండాలని అమ్మవారిని మొక్కుకున్నానని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం ప్రపంచంతో పోటీపడి అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని సమగ్ర అభివృద్ధి చేయడానికి అమ్మవారు ఆశీర్వదించాలని వేడుకున్నాను. ప్రపంచంలో ఉన్న తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో చల్లగా ఉండే విధంగా అమ్మవారి దీవించాలని కోరాను. తెలంగాణ రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడి పంటలతో రైతులు అన్ని వర్గాల ప్రజలు సుఖ సంతోషాలతో విలసిల్లాలని కనుకదుర్గ అమ్మవారిని వేడుకున్నానని వెల్లడించారు.
ఇక 4 వైపుల నుంచి నారాయణుడి దర్శనం | Darshan of Narayan from 4 sides | Eeroju news