26 members of the Britain Parliament are Indians | బ్రిటన్ పార్లమెంట్ లో 26 మంది బార్న్ ఇండియన్స్ | Eeroju news

26 members of the Britain Parliament are Indians

బ్రిటన్ పార్లమెంట్ లో 26 మంది బార్న్ ఇండియన్స్

హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్)

26 members of the Britain Parliament are Indians

బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో భారత సంతతి నేతలు సత్తా చాటారు. పార్లమెంటు దిగువ సభ అయిన హౌస్ ఆఫ్ కామన్‌లో భారత సంతతి హవా కొనసాగింది. భారత మూలాలు ఉన్న 26 మంది అక్కడి పార్లమెంటుకు ఎన్నికయ్యారు. తెలుగు సంతతికి చెందిన ఉదయ్‌ నాగరాజు, చంద్ర కన్నెగంటి మాత్రం ఓడిపోయారు. ఈ ఎన్నికల్లో గెలుపొందిన భారత సంతతి నేతల్లో ప్రధాని రిషి సునాక్ ముందున్నారు. రిచ్మండ్ అండ్ నార్తర్న్ అలర్టన్ స్థానం నుంచి విజయం సాధించారు. మాజీ హోం మంత్రులు సుయెల్లా బ్రేవర్మన్, ప్రీతి పటేల్ తమ స్థానాలను నిలబెట్టుకున్నారు.

భారత సంతతికి చెందిన క్లెయిర్ కౌటిన్హో కూడా విజయం సాధించారు. సౌత్‌వెస్ట్‌ హెర్డ్‌ఫోర్డ్‌ షైర్‌ నుంచి కన్జర్వేటివ్ నేత గగన్ మొహీంద్ర, లైసెస్టర్ ఈస్ట్ నుంచి శివానిరాజా విజయం సాధించారు. లేబర్ పార్టీకి చెందిన రాజేశ్ అగర్వాల్‌పై శివాని విజయం సాధించారు. కన్జర్వేటివ్ పార్టీకి చెందిన శైలేష్ వారా, తొలిసారి పోటీలో దిగిన అమిత్ జోగియాలు స్వల్ప ఓట‍్ల తేడాతో ఓడిపోయారు. భారత సంతతి విజేతల్లో ఎక్కువ మంది వామపక్ష లేబర్‌ పార్టీ నుంచే విజయం సాధించారు. బ్రిటన్‌ పార్లమెంటులో అడుగు పెట్టబోతున్నారు.

వీరిలో సీమా మల్హోత్రా (వాల్సాల్ నియోజకవర్గం), వాలెరీ వాజ్ (బోక్స్ విచ్).. ఆమె సోదరి కీత్ వాజ్, లీసా నాండీ (విగాన్)లు భారీ మెజార్టీతో గెలుపొందారు. బ్రిటిష్ సిక్కు ఎంపీలు ప్రీత్ కౌర్ గిల్, తన్మంజిత్ సింగ్ దేహిలు మరోసారి విజయం సాధించారు. నావెందు మిశ్రా, రదిమా విటోమ్‌లు లేబర్‌ పార్టీ నుంచి భారీ మెజార్టీతో తమ స్థానాలను నిలబెట్టుకున్నారు. ఇదిలా ఉంటే.. 12 మంది బ్రిటన్‌ పార్లమెంటులో తొలిసారి అడుగు పెట్టబోతున్నారు. లేబర్ పార్టీకి చెందిన జాస్ అథ్వాల్, two శంకర్, సత్వీర్ కౌర్, హర్జోత్ ఉప్పల్, వారిందర్ జస్, గురిందర్ జోసన్, కనిష్క నారాయణ్, సోనియా కుమార్, సురీనా బ్రాకెన్‌బ్రిడ్జ్‌, కిరిత్ ఎంట్విజిల్, జీవన్ సంధేర్, సోజాన్ జోసెఫ్‌ తొలిసారిగా బ్రిటన్ పార్లమెంటులో అడుగుపెట్టనున్నారు.

26 members of the Britain Parliament are Indians

 

Prabhakar Rao to India in phone tapping case..? | ఇండియాకు ప్రభాకరరావు..? | Eeroju news

Related posts

Leave a Comment