బీటీ బ్యాచ్ ఎంత పని చేసిందో…..
హైదరాబాద్, జూలై 6, (న్యూస్ పల్స్)
How much work did KCR, Revanth Reddy BT batch
చేర్చుకుంటున్నప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అధికారం పోయిన తర్వాత ఎవరూ ఉండరు. ఇది అన్ని పార్టీలకూ అప్లయ్ అవుతుంది. నాడు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చేసిన తప్పులే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. నాడు తమ పార్టీ నుంచి వెళ్లి బీఆర్ఎస్ లో పదవులు పొంది, పదేళ్ల పాటు కాంగ్రెస్ పార్టీని విమర్శించిన వారిని కూడా వదలడం లేదు. ఎవరిని బడితే వారిని.. వస్తామంటే కండువా కప్పేశామా? లేదా? వాళ్లకు అస్సలు ప్రజల్లో ఇమేజ్ ఉందా? వారివల్ల భవిష్యత్ లో పార్టీకి ఉపయోగం ఉందా? అన్నది ఆలోచించడం లేదు.
తాజాగా ఆరుగురు ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ లో చేరారంటే నిజంగా కేసీఆర్ గతంలో చేసిన తప్పులేనని చెప్పక తప్పదు.నాడు కూడా కేసీఆర్ అన్ని రకాలుగా ఊసిపోయిన వాళ్లను తీసుకొచ్చి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు. అంతే తప్ప తెలంగాణ ఉద్యమంలో తనతో పాటు తిరిగి, కేసుల్లో ఇరుక్కున్న వారిని మాత్రం పక్కన పెట్టారు. నాడు కేసీఆర్ ఎడా పెడా కాంగ్రెస్, టీడీపీ, కమ్యునిస్టులు ఇలా ఏ పార్టీని వదలకుండా నేతలను తమలో కలిపేసుకునే ప్రయత్నంలో భాగంగా కండువాలు కప్పారు. పదేళ్లు బాగానే ఉంది. కేసీఆర్ కు ఇదే నేతలు జై కొట్టారు. ఆయనంతటి లీడర్ లేడంటూ పొగిడేశారు. కానీ ఎప్పుడైతే అధికారం కోల్పోయిన వెంటనే తాను పిలిచి పదవులు ఇచ్చిన వాళ్లే నేడు తూచ్ అంటూ జారుకుంటున్నారు.
నిజంగా కేసీఆర్ కు తెలిసిరావాల్సిందే. ఆయనకు జరగాల్సిందేనన్నది గులాబీ పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.పార్టీ కోసం కష్టపడిన నేతలను పక్కన పెట్టారు. ఉద్యమంలో అన్నీ వదిలి జెండాను పట్టుకున్న నాయకులను వదిలేశారు. గొంతెత్తి అరిచిన లీడర్లను కూడా తోసి పారేశారు. కనీసం నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి కూడా పదేళ్లు కేసీఆర్ కు మనసు రాలేదు. కానీ గతంలో ఎప్పుడో గెలిచిన వారిని, కాంగ్రెస్ లో పదవులు పొందిన వారిని తెచ్చుకుని నెత్తిన పెట్టుకున్నారు. ఏదో ఘన కార్యం సాధించినట్లు బిల్డప్ ఇచ్చారు.
కాంగ్రెస్ ను ఖాళీ చేశానని జబ్బలు చరుచుకున్నారు. కానీ నేడు ఏమయింది రాత్రికి రాత్రే మకాం మార్చేశారు. వాళ్లకు కావాల్సింది అధికారం. అంతే తప్ప పార్టీ మీద ప్రేమ కాదన్నది ఇప్పటికైనా కేసీఆర్ కు అర్థమయి ఉండాలి. రెడీ అవుతున్న సర్కార్ కాంగ్రెస్ లో చేర్చుకోవడంపై… అయితే ఇదే నేతలను కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడంపై కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ నిలకడలేని, నమ్మకం లేని నేతలను తెచ్చి పెట్టుకుని కేసీఆర్ చేసిన తప్పులనే కాంగ్రెస్ నేతలు చేస్తున్నారా? అని పార్టీ క్యాడర్ నుంచి వినిపిస్తున్న ప్రశ్నలు.
వచ్చేవాళ్లంతా తమది కాంగ్రెస్ రక్తమేనని చెబుతున్నప్పటికీ ఈ ఐదేళ్లు ఆ బ్లడ్ వారిలో ఉంటుంది. అధికారం కోల్పోతే తర్వాత బ్లడ్ లేదు.. ఫ్లడ్ వచ్చినట్లు వెళ్లిపోతారన్నది గమనించుకోవాలని కార్యకర్తలు మండిపడుతున్నారు. అయితే శాసనమండలిలో బలం తక్కువగా ఉండటంతో ఏకంగా ఒకేసారి ఆరుగురిని చేర్చుకున్నామని అధికార కాంగ్రెస్ పార్టీ పైకి చెబుతున్నప్పటికీ వీరు ఎప్పటికీ పార్టీకి శాశ్వతం కాదు. అయితే ఆ నిజం తెలిసేలోగా ఐదేళ్లు ముగిసిపోతాయి.మళ్లీ ఇలాంటి నేతలను అధికారంలో బీఆర్ఎస్ వస్తే చేర్చుకోదన్న గ్యారంటీ కూడా ఏమీ లేదు. అదీ అసలు విషయం. మన నేతల బాగోతం.