New criminal justice laws from July 1 | జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు | Eeroju news

New criminal justice laws from July 1

జులై 1 నుంచే కొత్త నేర న్యాయ చట్టాలు

న్యూఢిల్లీ జూన్ 28

New criminal justice laws from July 1

సీఆర్పీసీ, ఐఈఏ చట్టాల స్థానంలో ఇటీవల కొత్తగా తీసుకొచ్చిన భారతీయ న్యాయ సంహిత 2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత 2023, భారతీయ సాక్ష అధినియమ్ 2023 పేరుతో మూడు చట్టాలు జులై 1 నుంచి దేశ వ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ సాక్ష్య బిల్లు-2023, భారతీయ నాగరిక్ సురక్ష సంహిత- 2023లు 1860 నాటి భారతీయ శిక్షాస్మృతి, క్రిమినల్ ప్రొసీజర్ (CrPC) కోడ్ -1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్- 1872 స్థానాలను భర్తీ చేయనున్నాయి.వీటికి 2023లో పార్లమెంట్ ఆమోదం తెలిపింది. డిసెంబర్‌లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముఆమోదం తర్వాత చట్టాలుగా మారాయి.

జాతీయ భద్రతకు ప్రమాదకరమైన టెర్రరిజం, కొట్టిచంపడం వంటి నేరాలకు కఠిన శిక్షలను ఈ చట్టాలు నిర్దేశిస్తున్నాయి. ఏడేళ్లు, అంతకు పైబడి శిక్ష పడిన నేరాల్లో ఫోరెన్సిక్ తప్పనిసరని ఈ చట్టాలు చెబుతున్నారు.భారతీయ న్యాయ సంహితలో 20 కొత్త నేరాలు చేర్చగా, IPCలో ఉన్న 19 నిబంధనలను తొలగించారు. 33 నేరాల్లో జైలు శిక్షను పెంచారు. 83 నిబంధనలలో జరిమానా పెంచగా.. 23 నేరాలలో తప్పనిసరి కనీస శిక్షను ప్రవేశపెట్టారు. ఆరు నేరాల్లో సమాజసేవను శిక్షగా మార్చారు. కొత్త చట్టాలు భారతీయత, భారత రాజ్యాంగం, ప్రజల శ్రేయస్సుకు ప్రాధాన్యతనిస్తాయని కేంద్ర హోం మంత్రి అమిత్ షా గతంలో చెప్పారు.

మూడు చట్టాల పరిధిలోని అన్ని వ్యవస్థలు అమల్లోకి వస్తే ఐదేళ్లలో భారత నేర న్యాయ వ్యవస్థ ప్రపంచంలోనే అత్యంత అధునాతనంగా మారుతుందని ఆయన పేర్కొన్నారు. జీరో ఎఫ్ఆర్,
ఆన్లైన్లో పోలీస్ ఫిర్యాదు, ఎలక్ట్రానిక్ రూపం లోనే సమన్లు, దారుణమైన నేరాలకు సంబంధించి నేరం జరిగిన ప్రదేశాన్ని తప్పనిసరిగా వీడియో చిత్రీకరించడం వంటివి కీలక అంశాలుగా ఇందులో ఉండనున్నాయి. ఈ కొత్త చట్టాల ప్రకారం పోలీస్ స్టేషన్కు వెళ్లనవసరం లేకుండానే ఆన్లైన్లో ఫిర్యాదు చేసే వీలు కలుగనుంది. తద్వారా తేలికగా,వేగంగా సమస్యను తెలియజేయడంతోపాటు| పోలీస్ స్పందనను సులభతరం చేస్తుంది. ఏదైనా సంఘటన సమాచారాన్ని ఏ పోలీస్ స్టేషన్ కైనా ఆన్లైన్ తెలియజేయవచ్చు. జీరో ఎఫ్ఎఆర్ ప్రకారం? ఏ వ్యక్తి అయినా పోలీస్ స్టేషన్ పరిధితో సంబంధం లేకుండా ఏ పోలీస్ స్టేషన్లోనైనా ఫిర్యాదు చేయవచ్చు.

బాధితులతోపాటు నిందితులు కూడా ఎన్ఐఆర్ కాపీలను ఉచితంగా పొందే వీలుంది. వీటితోపాటు పోలీస్ రిపోర్టు,సాక్షాలు తారుమారు కాకుండా ఉండేందుకు నేరం జరిగిన ప్రదేశంలో ఆధారాలు సేకరించేక్రమాన్ని వీడియో చిత్రీకరించాలి. పిల్లలు, మహిళలపై నేరాల్లో బాధితులకు ప్రాథమిక చికిత్స లేదా పూర్తి వైద్యం ఉచితంగా అందించాల్సి ఉంటుంది. అత్యాచార నేరాల కేసుల్లో బాధితురాలి వాంగ్మూలాన్ని ఆడియో, వీడియో ద్వారా పోలీస్ లు నమోదు చేయాలి.మహిళలు, దివ్యాంగులు, దీర్ఘకాల వ్యాధిగ్రస్థులతోపాటు 15ఏళ్ల లోపు పిల్లలు, 60 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్నవారు పోలీస్ స్టేషను వెళ్లడం నుంచి మినహాయింపు ఉంటుంది. వారు నివాసం ఉన్న చోటే పోలీస్ల సాయం పొందవచ్చు. స్వల్ప నేరాలకు సంబంధించి నేరస్థులకు సమాజసేవ చేసే అవకాశాన్ని కొత్త చట్టాలు కల్పిస్తున్నాయి.

బ్రిటిష్ వలస పాలన నాటి ఐపిసి, ఛార్జిషీట్, స్టేట్మెంట్లు ఇతర డాక్యుమెంట్లు, 14 రోజుల్లోగా పొందవచ్చు. అరెస్ట్ సందర్భాల్లో, బాధితుడు తమ సన్నిహితులు, బంధువులకు, ఆ పరిస్థితిని తెలియజేసే హక్కు ఉంటుంది. తద్వారా తక్షణ సహాయం పొందేందుకు వీలు కలుగుతుంది. తీవ్రమైన నేరాల్లో ఫోరెన్సిక్ నిపుణులు తప్పనిసరిగా సంఘటన స్థలాన్ని పరిశీలించాలి.

New criminal justice laws from July 1

 

Changing politics of Kurnool Corporation | మారనున్న కర్నూలు కార్పొరేషన్ రాజకీయాలు | Eeroju news

Related posts

Leave a Comment