Progress will be made in the cases | కేసుల్లో పురోగతి సాధించండి | Eeroju news

Progress will be made in the case 

కేసుల్లో పురోగతి సాధించండి

బద్వేలు

Progress will be made in the case

కేసుల్లో పురోగతి సాధించాలని నెలవారి నేర సమీక్ష సమావేశంలోజిల్లా ఎస్పీ కృష్ణారావు దిశ నిర్దేశం చేశారు. బుధవారం రాయచోటి ఎస్పీ కార్యాలయంలో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పురోగతి సాధించి పరిష్కరించాలనీ ఆదేశించారు. కోర్ట్ లో  స్పీడ్‌ ట్రయిల్‌ మానిటరింగ్‌ ద్వారా కేసుల లోని నిందితులకు తగిన శిక్షపడేలా కృషి చెయ్యాలని సూచించారు. ప్రాపర్టీ నేరాల్లో నిందితులను త్వరగా పట్టుకోని రికవరీ శాతాన్ని పెంచాలన్నారు.

ఎన్ఫోర్స్మెంట్ ముమ్మరం చేసి చట్ట వ్యతిరేక,అసాంఘీక కార్యక్రమాలను కట్టడి చెయ్యాలని స్పష్టం చేశారు. జిల్లా ప్రధాన కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ నందు  జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ పరిధిలో ఉన్న  వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసు అధికారులతో నెలవారి నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ సబ్ డివిజనల్ పరిధివారి గా పరిశీలించారుఈ సమావేశంలో ఎస్పీ ప్రత్యేకించి పలు కేసులు, గ్రేవ్ కేసులు, పి.డి యాక్టు మరియు ఇతర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. తొలుత కొత్త చట్టాలపై భారతీయ న్యాయ సంస్థ , భారతీయ నాగరిక సురక్ష సమితి వంటి వాటిపై పోలీసు అధికారులకు అవగాహన కల్పించారు. జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీసు స్టేషన్లో పరిధిలో పలు కేసులను సమీక్షించి, తీవ్ర నేరాలతో వున్న కేసుల దర్యాప్తు వివరాలు, కోర్ట్ లో చార్జిషీట్ ధాఖలు, ప్రస్తుతం కోర్టులో ట్రయల్ ఏ దశలో ఉన్నాయి వంటి వివరాలు అడిగి  తెలుసుకొని, సంబంధిత సీడీ ఫైల్స్ ను క్షుణ్ణంగా పరిశీలించారు. కోర్ట్ లో  స్పీడ్‌ ట్రయిల్‌ మానిటరింగ్‌ ద్వారా కేసుల లోని నిందితులకు తగిన శిక్షపడే విధంగా చూడాలని అధికారులను ఎస్పీ గారు ఆదేశించారు.

తీవ్ర నేరాల కేసుల లోని వారిపై నిరంతర నిఘా ఉంచి, యాక్టీవ్ గా ఉన్న వారిని బైండ్ ఓవర్ చేయాలని సూచించారు. హత్య, రేప్, పోక్సో, ప్రాపర్టీ, గంజాయి మున్నగు గ్రేవ్ కేసుల్లో దర్యాఫ్తు, ముద్దాయిలు అరెస్టులపై సర్కిల్ వారీగా పోలీసు అధికారులను ఆరా తీసి, అపరిష్కృతంగా ఉన్న గ్రేవ్ కేసుల్లో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ తో పురోగతి సాధించి పరిష్కరించాలని, కేసు నమోదు నుండి చార్జిషీట్ వరకు ప్రతి విషయాన్నికూలంకుషంగా పరిశోధన చేసి ఫైనల్ చేయాలన్నారు.కేసుల చేదనలో అత్యాధునిక టెక్నాలజీ ఉపయోగించాలనీ, పెరుగుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని అన్నారు. గుడ్ ట్రయల్ మానిటరింగ్ ద్వారా  కేసుల్లో నిందితులకు శిక్షలు పడేలా చూడాలని సూచించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దర్యాప్తు అధికారులు నేరం చేసిన వ్యక్తిని గుర్తించి, వెంటనే అరెస్టు చేయాలి.

తరచుగా దొంగతనాలు, దారి దోపిడీలు, చైన్ స్నాచింగ్ వంటి నేరాలు జరిగే ప్రాంతాలను గుర్తించి సంబంధిత యస్ డి పిఓ లు ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్ఫోర్స్మెంట్ విధులను పెంచి నేరాలకు అడ్డుకట్ట వేయాలి.ఫోక్సో కేసులకు సంబంధించిన ముద్దాయిలను కేసు నమోదు చేసిన వెంటనే అరెస్టు చేయాలి, ఎట్టి పరిస్థితులలో కూడా పెండింగ్ ఉండరాదు. యస్ డి పిఓ లు ప్రతి వారంలో ఒకరోజు తమ సబ్ డివిజన్ పరిధిలోని ఫోక్సో కేసుల స్థితిగతులపై సమీక్ష చేయాలి.  రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని, వాహన తనిఖీలు చేపట్టి చలానాలు విధిస్తూ వాహనదారులు రోడ్డు భద్రతా నియమాలు పాటించేలా చేయాలని, ఎన్ఫోర్స్మెంట్ వర్క్ పై దృష్టి సారించాలని, రాత్రి గస్తీ పెంచి ఆస్తి నేరాలు జరిగే ప్రాంతాలపై నిఘా ఉంచి దొంగతనాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, చోరీ సొత్తు రికవరీ పెంచాలన్నారు.పోలీస్ స్టేషన్ కు వచ్చే ఫిర్యాదుదారులతో స్నేహపూర్వకంగా మెలగాలని, వారి సమస్యలను ఓపికగా విని, చట్ట పరిధిలో న్యాయం చేయాలని, ప్రజల్లో పోలీసు శాఖపై నమ్మకం కలిగే విధంగా సేవలు అందించాలన్నారు. ఈ నేర సమీక్షా సమావేశం లో జిల్లా అదనపు జిల్లా ఎస్పీ డాక్టర్  వి.బి రాజ్ కమల్, డిఎస్పీలు,ఏఆర్ డిఎస్పీ, సీఐలు,యస్ఐ లు మరియు తదితరులు పొల్గొన్నారు.

Progress will be made in the case 

 

Police raids on pawn shops and fast food centers | పాన్ షాపులు,ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో పోలీసుల ఆకస్మిక తనిఖీలు | Eeroju news

Related posts

Leave a Comment