Failure to attend the assembly will result in disqualification | అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతకు చాన్స్ | Eeroju news

Failure to attend the assembly will result in disqualification :

అసెంబ్లీకి హాజరు కాకపోతే అనర్హతకు చాన్స్

విజయవాడ, జూన్ 24, (న్యూస్ పల్స్)

Failure to attend the assembly will result in disqualification :

ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఊహించని మలుపులు తిరిగాయి. ఓడలు బండ్లు అయ్యాయి. బండ్లు ఓడలయ్యాయి. వైఎస్ఆర్‌సీపీ ప్రధాన ప్రతిపక్ష హోదాకు దూరమయింది. పూలమ్మిన చోట రాళ్లమ్మడం ఎలా అని జగన్ అనుకుంటున్నారేమో కానీ అసెంబ్లీ వైపు రావాలని ఆయన అనుకోవడం లేదు. ప్రమాణ స్వీకారం తప్పనిసరి కాబట్టి ఆ తంతు  పూర్తి చేసి పది నిమిషాలు కూడా అసెంబ్లీలో ఉండకుండా వెళ్లిపోయారు. స్పీకర్ ఎన్నికలకు తాను డుమ్మా కొట్టారు. తన పార్టీ సభ్యులను కూడా వెళ్లనీయలేదు. ఇటీవల పార్టీ కార్యకవర్గ సమావేశంలో  ఆయన మాట్లాడిన మాటలను బట్టి చూస్తే భవిష్యత్ లో కూడా అసెంబ్లీకి హాజరయ్యే అవకాశాలు లేవని ఎక్కువ మంది నమ్ముతున్నారు. గతంలో అలా అసెంబ్లీని బహిష్కరించిన ట్రాక్ రికార్డు జగన్‌కు ఉండటమే దీనికి కారణం. ప్రతిపక్ష నేత హోదా కూడా లేకుండా అసెంబ్లీకి వచ్చేందుకు జగన్ సిద్ధంగా లేరు. ముఖ్యంగా అయ్యన్న పాత్రుడు స్పీకర్ గా ఉన్నారు. ఆయనను అధ్యక్షా అని సంబోధించేందుకు జగన్ మనస్థత్వం అంగీకరించని వైఎస్ఆర్‌సీపీ నేతలే చెబుతూంటారు. అలాగే అసెంబ్లీలో పవన్ కల్యాణ్, రఘురామకృష్ణరాజు వంటి వాళ్లు ఉన్నారు.

జగన్మోహన్ రెడ్డి తన రాజకీయాన్ని వ్యక్తిగతంగా.. రాజకీయంగా చూడరు. మొత్తం ఒకటే అనుకుంటారు. రాజకీయ ప్రత్యర్థులు వ్యక్తిగత శత్రువులుగానే  చూస్తారు. పార్టీ, ప్రభుత్వం ఒకటే అని అధికారంలో ఉన్నప్పుడు అనుకునేవారు. అలా.. ఇతర పార్టీల నేతలతో రాజకీయంగా ఓ సంబంధం.. వ్యక్తిగతంగా మరో సంబంధం ఉండదని.. మొత్తం ఒకటేనని నమ్ముతారు. అందుకే తన రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగానే పరిగణించి.. ఎక్స్‌ట్రీమ్  ఎటాక్ చేస్తారు. దాని వల్ల ఆయనకు రాజకీయంగానే కాదు వ్యక్తిగతంగానూ అందరూ శత్రువులుగానే కనిపిస్తున్నారు.  గత అసెంబ్లీలో వైసీపీ సభ్యులు .. టీడీపీ సభ్యులకు చేసిన అవమానాలకు ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటారని దాని వల్ల జగన్ పైనే ఎక్కువగా ఎటాక్ చేస్తారని అనుకుంటున్నారు. ఈ పరిస్థితుల్ని ఎదుర్కోవడం కన్నా.. అసెంబ్లీకి డుమ్మా కొట్టడమే మంచిదని జగన్ నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇలాంటి కౌరవ సభలో మనం ఏదో మాట్లాడుతామని.. పోరాటం చేస్తామని నాకైతే నమ్మకం లేదు అని  జగన్ నేరుగా పార్టీ కార్యవర్గ సమావేశంలో చెప్పారు. అంటే ఎమ్మెల్యేలు కూడా హాజరవకూడదని ఆయన ఉద్దేశం అనుకోవచ్చు.

జగన్ కు గతంలోనూ అసెంబ్లీని బహిష్కరించిన రికార్డు ఉంది. 2017లో పాదయాత్ర ప్రారంభించే ముందు అసెంబ్లీని బహిష్కరించారు. తన పార్టీ ఎమ్మెల్యేలను కూడా ఆయన అసెంబ్లీకి వెళ్లడానికి అంగీకరించలేదు. నాలుగు సెషన్ల పాటు ఈ బహిష్కరణ సాగింది. అప్పట్లో టీడీపీ మాత్రమే అసెంబ్లీని నిర్వహించింది. టీడీపీ సభ్యులే ప్రతిపక్ష పాత్ర కూడా పోషించారు. జగన్ నిర్ణయంపై తీవ్ర విమర్శలు వచ్చినా వెనక్కి తగ్గలేదు. గతంలో తమిళనాడులో జయలలిత, ఉమ్మడి ఏపీలో ఎన్టీఆర్ అసెంబ్లీలను బహిష్కరించారు కానీ.. వారి ఎమ్మెల్యేలు మాత్రం సభకు వెళ్లారు. చంద్రబాబునాయుడు కూడా అసెంబ్లీని బహిష్కరించి శపథం చేసి వచ్చేశారు కానీ.. టీడీపీ ఎమ్మెల్యేలు హాజరయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం తాను వెళ్లకపోతే ఎమ్మెల్యేలు కూడా వెళ్లాల్సిన అవసరం లేదనుకుంటారు. అందుకే ఎమ్మెల్యేలతో కూడా సమావేశాలను బహిష్కరింప చేసే అవకాశాలను కొట్టి పారేయలేమని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఎమ్మెల్యేలుగా ప్రమాణ స్వీకారం చేసినా వరుసగా మూడు సెషన్లకు స్పీకర్ అనుమతి తీసుకోకుండా డుమ్మా కొడితే.. అనర్హతా వేటు వేసేందుకు స్పీకర్‌కు సర్వాధికారాలు ఉంటాయి.

సెలవు పెట్టకుండా అసెంబ్లీకి రాకపోతే అనర్హత వేటు వేయడం..నియమాలు, సంప్రదాయాలకు సంబంధించినదని.   వరుసగా మూడు సెషన్లకు రాకపోతే అనర్హతా వేటు వేయవచ్చని నిబంధనలు చెబుుతున్నాయి.  యితే ఇంత వరకూ దేశంలో.. ఇలాంటి ఘటన జరగలేదు. సభకు హాజరు కాకపోతే స్పీకర్ దగ్గర అనుమతి తీసుకుంటే అనర్హతా వేటు నుంచి తప్పించుకోవచ్చు. అయితే వైసీపీ సభ్యులు బహిష్కరించాలనుకుంటే.. తమకు సెలవు కావాలని దరఖాస్తు చేసుకునే అవకాశం ఉండదు. దరఖాస్తు చేసుకుంటే ఇస్తారు కానీ దాని వల్ల రాజకీయంగా అనేక విమర్శలు వస్తాయి. అసెంబ్లీ సెషన్స్ రాకపోతే.. నిబంధనల ప్రకారం అనర్హతా వేటు వేసే అవకాశం వస్తే..  టీడీపీ ఖచ్చితంగా ఉపయోగించుకుంటుందన్న అంచనాలు ఉన్నాయి.

అసెంబ్లీకి హాజరు కాకపోవడం ద్వారా స్పీకర్ అనర్హతా వేటు వేస్తే.. ఆ నిర్ణయాన్ని కోర్టుల్లో కూడా సవాల్ చేయలేరు. శాసన వ్యవస్థకు సంబంధించి  స్పీకర్ అత్యంత పవర్ ఫుల్ . ఆయన నిర్ణయమే ఫైనల్. ఒక వేల ఇలాంటి పరిస్థితి తెచ్చుకుని  వైసీపీ ఎమ్మెల్యేలు ఉపన్నికలు తెచ్చుకుంటే పులివెందులలోనూ గడ్డు పరిస్థితిని ఎదుర్కోవాల్సి రావొచ్చు. అధికారంలో ఉన్న పార్టీకి సహజంగా ఉపఎన్నికలు అనుకూలంగా ఉంటాయి. బీటెక్ రవి లాంటి గట్టి ప్రత్యర్థి కూడా ఉన్నందున అలాంటి పరిస్థితి తెచ్చుకోవడం జగన్మోహన్ రెడ్డికి రిస్కే అన్న అభిప్రాయం ఉంది. అందకే వైసీపీ సభ్యులు అన్నీ ఆలోచించుకుని అసెంబ్లీకి రావడంపై నిర్ణయం తీసుకుంటారని రాజకీయవర్గాలు భావిస్తున్నాయి. వచ్చే నెలలోనే ఈ అసెంబ్లీ మొదటి సెషన్ జరిగే అవకాశం ఉంది.

 

Failure to attend the assembly will result in disqualification :

వైసీపీకి పునర్విభజన… టెన్షన్ | Redistribution to YCP… tension | Eeroju news

 

Related posts

Leave a Comment