Officers and staff should follow the time regime | అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి | Eeroju news

Officers and staff should follow the time regime

అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలి

జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
జయశంకర్ భూపాలపల్లి, 


Officers and staff should follow the time regime

అధికారులు, సిబ్బంది సమయ పాలన పాటించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ తెలిపారు.  మంగళవారం  ఐడిఓసి కార్యాలయంలోని అన్ని శాఖలను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు.  ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. కార్యాలయ పరిసరాలు అపరిశుభ్రత లేకుండా  పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు. అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని ఆయన స్పష్టం చేశారు.

అనంతరం ఐడిఓసి లో ఏర్పాటు చేసిన సోలార్ విద్యుత్ ప్లాంటును పరిశీలించారు. మొదటి విడతగా ఏర్పాటు చేసిన 100 కిలో వాట్స్ సామర్థ్యం కలిగిన సోలార్ ప్లాంట్ ద్వారా కలెక్టర్ కార్యాలయం వరకు సోలార్ విద్యుత్ వినియోగిస్తున్నామని ఆయన తెలిపారు.  ఒక్క రోజు దాదాపు 429 యూనిట్లు విద్యుత్ వినియోగం జరిగినట్లు ఆయన తెలిపారు.  విద్యుత్ పొదుపు చేయాలనే లక్ష్యంతో ఐడిఓసి కార్యాలయంలో సోలార్ ప్లాంట్ ఏర్పాటు చేయడం జరిగిందని, విడతల వారిగా అన్ని శాఖలకు సోలార్ ప్లాంట్ ద్వారా విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

ఈ తనిఖీలో అదనపు కలెక్టర్ వెంకటేశ్వర్లు, కలెక్టరేట్ ఏఓ మహేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు.

 

Officers and staff should follow the time regime

 

ఛత్తీస్‌గఢ్ విద్యుత్ కొనుగోళ్లతో రాష్ట్ర ప్రభుత్వానికి రూ.6 వేల కోట్లకుపైగా నష్టం | Chhattisgarh’s power purchases cost the state government more than Rs.6 thousand crores | Eeroju news

 

Related posts

Leave a Comment