Andhra Pradesh:పిఠాపురం కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు తప్పుతోందా? అక్కడ సోలో పవర్‌గా ఎదగడానికి జనసేన స్కేచ్ గీస్తోందా? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి.. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే, పది నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు.
పిఠాపురంలో కూటమి కుమ్ములాటలు
కాకినాడ, ఏప్రిల్ 7
పిఠాపురం కూటమి పార్టీల్లో ఏం జరుగుతోంది? డిప్యూటీ సీఎం పవన్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఆ నియోజకవర్గంలో టీడీపీ పట్టు తప్పుతోందా? అక్కడ సోలో పవర్‌గా ఎదగడానికి జనసేన స్కేచ్ గీస్తోందా? అంటే పరిస్థితులు అలాగే కనిపిస్తున్నాయి.. పవన్ కోసం టీడీపీ నేత వర్మ 2024 ఎన్నికల్లో తన సీటు త్యాగం చేసారు. ఆ సమయంలోనే ఎమ్మెల్సీ సీటు పైన హామీ దక్కింది. అయితే, పది నెలలు పూర్తయినా ఎమ్మెల్సీగా అవకాశం రాలేదు. ఇక జనసేన సభలో నాగబాబు చేసిన కామెంట్స్ వర్మ మద్దతు దారులు, టీడీపీ శ్రేణులకు ఆగ్రహం తెప్పించాయి..పిఠాపురంలో వర్మకు చెక్ పెడుతున్నారా? నాగబాబు ఎమ్మెల్సీ హోదాలో పిఠాపురంలో ఎంట్రీ ఇచ్చి హడావుడి చేస్తుండటంతో టీడీపీ కేడర్‌లో ఈ సందేహం మొదలైంది. నాగబాబు పిఠాపురంలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. అన్నా క్యాంటీన్ ను ప్రారంభించారు. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మకు ప్రాధాన్యత లేకుండా జనసేన నేతలు వ్యవహరిస్తున్న తీరు వర్మ టీడీపీ కేడర్ కు నచ్చటం లేదంట. దీంతో, పార్టీకి అనుకూలంగా కాకుండా జై వర్మ అంటూ స్లోగన్స్ ఇచ్చారు. నాగబాబు పర్యటన సమయంలో వర్మ మద్దతు దారుల నినాదాలకు కౌంటర్‌గా జనసేన కేడర్ జై జనసేన అంటూ నినాదాలు చేసారు. పిఠాపురం కేంద్రంగా రోజు రోజుకీ ముదురుతున్న ఈ వివాదం ఇప్పుడు రెండు పార్టీల శ్రేణులకు అంతు పట్టకుండా తయారైందంట.ఇటీవల పిఠాపురంలో జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు చేసిన వ్యాఖ్యలతో రెండు పార్టీ శ్రేణుల మధ్య గ్యాప్ మరింత పెరిగింది.
వర్మకు ఎమ్మెల్సీ ఇవ్వకుండా పవన్ సోదరుడు నాగబాబుకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వటం.. మంత్రిగానూ ఛాన్స్ ఇవ్వాలని నిర్ణయించటం టీడీపీ కేడర్ కు ఆగ్రహం తెప్పిస్తోంది. పిఠాపురంలో పవన్ గెలుపులో వర్మ కీలక పాత్ర పోషించారు.ఎన్నికల తరువాత క్రమేణా వర్మ – జనసేన శ్రేణుల మధ్య గ్యాప్ పెరుగుతోంది. స్వల్ప ఘర్షణలు చోటు చేసుకున్నాయి. జనసేన ప్లీనరీ వేదికగా నాగబాబు ఎవరైనా పవన్ విజయం వెనుక ఉన్నామని భ్రమ పడితే అది వారి ఖర్మ అంటూ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యల పైన టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి.ఇటీవల పిఠాపురం జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్‌తో టీడీపీ శ్రేణులు వాగ్వాదానికి దిగారు. వర్మకు ప్రాధాన్యత ఇవ్వకపోవటంపైన నిలదీసిన కార్యకర్తలు.. వర్మ చెబితేనే పవన్‌కు ఓటు వేసామని తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వర్మ ను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయాలంటూ స్థానికులు కోరుతున్న విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో నాగబాబు రెండు రోజుల పాటు పిఠాపురంలో పర్యటనకు వచ్చారు. నియోజకవర్గం పెత్తనం తన సోదరుడు చేతిలో పెట్టేలా పవన్ డిసైడ్ అయినట్లు చెబుతున్నారు.ఇక నుంచి పిఠాపురం బాధ్యతలు నాగబాబు చూస్తారని జనసేన వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆ సెగ్మెంట్లో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు చేతుల మీదుగా ప్రారంభిస్తున్నారు. త్వరలోనే నాగబాబు మంత్రిగా బాధ్యతలు చేపట్టనున్నారు. నాగబాబు ఎంట్రీతో నియోజకవర్గంలో రెండు పార్టీల కేడర్ మధ్య గ్యాప్ స్పష్టంగా కనిపించింది. జనసైనికులు పార్టీ నినాదాలతో హోరెత్తిస్తే, టీడీపీ శ్రేణులు వర్మ అనుకూల నినాదాలతో మోత మోగిస్తున్నాయి. ఆ క్రమంలో పిఠాపురం కేంద్రంగా వర్మ లక్ష్యంగా చోటు చేసుకునే రాజకీయంగా పై ఉత్కంఠ కొనసాగుతోంది.
టీడీపీ నేతలపై కేసులు
అలజడి జరిగింది నాగబాబు పర్యటనలోనే అయినా, టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది మాత్రం ఆయన కాదు. అయితే ఫిర్యాదు చేసిన జనసేన నేత పేరు కూడా నాగబాబే కావడంతో అత్యుత్సాహంతో కథనాలు వండి వారుస్తోంది. టీడీపీ నేతలపై పోలీసులకు ఫిర్యాదు అందింది వాస్తవమే, అయితే ఫిర్యాదు చేసింది ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు కాదు, మొయిళ్ల నాగబాబు. ఆయన కూడా జనసేన నాయకుడే. ఆయన ఎవరిపై కేసు పెట్టారనేదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు టీడీపీ నేతలేనా, లేక పసుకు కండువాల ముసుగులో ఉన్న అల్లరి మూకలా..? పోలీస్ విచారణలో తేలాల్సి ఉందినాగబాబు పిఠాపురం పర్యటనలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అనంతరం ఆయన ప్రత్యేకంగా సీఎం చంద్రబాబుకి, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి ధన్యవాదాలు చెబుతూ ఓ ప్రెస్ నోట్ విడుదల చేశారు. తన కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు స్థానిక జనసేన నేతలకు కూడా థ్యాంక్స్ చెప్పారు. అయితే టీడీపీ నేతలు రచ్చ చేయడంపై ఆయన ఎక్కడా పెదవి విప్పలేదు.
నాగబాబు పిఠాపురం పర్యటనలో తనను అడ్డుకుని మోటార్ సైకిల్ అద్దాలు పగలగొట్టారని జనసేన నేత మొయిళ్ల నాగబాబు పోలీసులకు ఫిర్యాదు చేయడం విశేషం. తన విధులకు ఆటంకం కలిగించారంటూ పిఠాపురం అడిషనల్ ఎస్సై జానీ భాషా కూడా మరో ఫిర్యాదు చేశారు. ఈ రెండు ఫిర్యాదులపై గొల్లప్రోలు పోలీసులు రెండు వేర్వేరు కేసులు నమోదు చేయడం విశేషం.పిఠాపురం వ్యవహారం రెండు పార్టీల అధిష్టానాల వద్దకు వెళ్లింది. ప్రస్తుతానికి ఈ వ్యవహారంపై అధినేతలిద్దరూ సైలెంట్ గానే ఉన్నారు. నాగబాబు తొలి పర్యటనే ఇలా జరగడంతో అటు జనసేన నేతలు కూడా గుర్రుగా ఉన్నారు. పిఠాపురంలో జనసేనకు పక్కలో బల్లెంలా మారేందుకు టీడీపీ నేత వర్మ శక్తి వంచన లేకుండా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్సీ పదవి వచ్చి ఉంటే వర్మ సైలెంట్ గా ఉండేవారు. కానీ అటు సీటు త్యాగం చేసి, ఇటు పదవి రాకపోవడంతో ఆయన హర్ట్ అయ్యారు. దీంతో పిఠాపురం కాస్త హాట్ సీట్ గా మారింది. ప్రస్తుతానికి కేసుల వరకు వ్యవహారం వచ్చింది. ముందు ముందు ఇంకే జరుగుతుందో చూడాలి.
Read more:Andhra Pradesh: రైజింగ్ స్టేట్ గా ఆంధ్ర