Andhra Pradesh:భవిష్యత్తు అంతా టూరిజమే

future is all about tourism

Andhra Pradesh:భవిష్యత్తు అంతా టూరిజమే:రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం 2 వ రోజు ప్రారంభంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికల పై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నాం. దాదాపు 30 ఏళ్ల క్రితం నేను టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డు పడుతుంటే అప్పుడు నేను కమ్యునిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, భవిష్యత్తు అంతా టూరిజానిదే అని అన్నప్పుడు కమ్యునిస్టులు నాపై విరుచుపడారు.

భవిష్యత్తు అంతా టూరిజమే

అమరావతి
రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరుగుతున్న మూడవ జిల్లా కలెక్టర్ల సమావేశం 2 వ రోజు ప్రారంభంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా జిల్లా అభివృద్ధి ప్రణాళికల పై రాష్ట్రస్థాయిలో చర్చిస్తున్నాం. దాదాపు 30 ఏళ్ల క్రితం నేను టూరిజాన్ని ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తుంటే ప్రతిపక్ష సభ్యులు అడ్డు పడుతుంటే అప్పుడు నేను కమ్యునిజం లేదు, క్యాపిటలిజం లేదు, సోషలిజం లేదు, భవిష్యత్తు అంతా టూరిజానిదే అని అన్నప్పుడు కమ్యునిస్టులు నాపై విరుచుపడారు. పేదరికం నిర్మూలనకు సంపదను సృష్టించే టూరిజం తదితర అంశాలకే భవిష్యత్తు అంతా ప్రధాన్యత నిస్తుందని, భౌతిక వాదమే వస్తుందని అన్నాను. దాదాపు 30 ఏళ్ల తదుపరి నిన్న మంగళవారం తెలంగాణా బడ్జెట్ సమావేశాల సందర్బంగా తెలంగాణా శాసన సభ్యలో సిపిఐ సభ్యులు ఇదే అంశాన్ని ప్రసావిస్తూ, పైసా ఖర్చు లేనిది టూరిజమే నని రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను అభివృద్ది పర్చాలని ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 30 ఏళ్ల క్రితం అంటే అందరికీ కోపం వచ్చిందని సిపిఐ శాసన సభ్యులు ఉటంకించారన్నారు. తెలంగాణాలో అనేక పర్యాటక ప్రాంతాల ఉన్నాయి, వాటి అభివృద్దిపై శ్రద్ద పెట్టాలని ఆయన కోరారు. నేను 30 సంవత్సరాల క్రితం అన్న విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇంత కాలం పట్టిందని అన్నారు.

కాబట్టి నేను చెప్పేదంతా జిల్లా కలెక్టర్లు అందరూ అర్థం చేస్తుకుని క్షేత్ర స్థాయిలో రియల్ టైమ్ లో అమలు పరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. మన రాష్ట్రంలో ఐదు జోన్ లు ఉన్నాయి. జోన్-1 లో విశాఖపట్నం, జోన్-2 లో రాజమండ్రి, జోన్-3 లో రాజదాని అమరావతి, జోన్-4 లో తిరుపతి మరియు జోన్-5 లో అనంతపురం పవర్ హబ్ లుగా ఉన్నాయి. ఆ పవర్ హబ్ల ఆధారంగా ఆయా జోన్లలోని అన్ని జిల్లాలను అభివృద్ది పర్చే విధంగా జిల్లా కలెక్టర్లు జిల్లా అభివృద్ది ప్రణాళికలను రూపొందించి అమలు పరిస్తే రాష్ట్ర భవిష్యత్తు ఎంతో ఉజ్వలంగా ఉంటుంది.
#ప్రతి జోన్కు ఒక సీనియర్ అధికారిని ఇన్ చార్జిగా ఉంచాము, ప్రతి జిల్లాకు ఇన్ చార్జి మంత్రి కూడా ఉన్నాడు. వీరందరూ కలిసి ఆయన జిల్లాలను, ప్రాంతాలను ఏ విధంగా అభివృద్ద పర్చాలో సమగ్రంగా చర్చించి క్షేత్ర స్థాయిలో తగు చర్యలు తీసుకోవాల్సి ఉంది. గ్రామాల్లోని వాస్తవ విషయాలను తెలుసుకుని అందుకు తగ్గట్టుగా అభివృద్ది కార్యాచరణ ప్రణాళికలను రూపొందించే విధంగా మరియు గ్రామాల్లోని సమస్యలను తెలుసుకుని వాటిని రియల్ టైమ్ లో పరిష్కరించేందుకై వచ్చే మాసం నుండి సీనియర్ అధికారులు అంతా గ్రామాల్లో మూడు నాలుగు రోజులు ప్యటించాలని అన్నారు.

Read more:Tandoor:ఆన్లైన్ గేమ్స్ తో జీవితాలు నాశనం చేసుకోవద్దు

Related posts

Leave a Comment