Hyderabad:బడ్జెట్ ప్రసంగమా ? రాజకీయ ప్రసంగమా ?:దక్షతతో, బాధ్యతగా హామీలు ఇచ్చాం, నెరవేర్చడం మాకు కష్టం కాదు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మీద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఒక్క ఏడాది నోరు కట్టుకుంటే అన్ని హామీలు నెరవేరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక మధ్యంతర బడ్జెట్ తో కలిపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నది మూడో బడ్జెట్. అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారం వెరసి తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
బడ్జెట్ ప్రసంగమా ? రాజకీయ ప్రసంగమా ?
అసెంబ్లీ సాక్షిగా అబద్దాల చిట్టా చదివారు
పదేళ్ల బీఆర్ఎస్ పాలనా వికాసాన్ని15 నెలల కాంగ్రెస్ పాలనలో విధ్వంసం చేశారు
మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్
దక్షతతో, బాధ్యతగా హామీలు ఇచ్చాం, నెరవేర్చడం మాకు కష్టం కాదు ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీల మీద ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మాట్లాడారు. ఒక్క ఏడాది నోరు కట్టుకుంటే అన్ని హామీలు నెరవేరుస్తాం అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఒక మధ్యంతర బడ్జెట్ తో కలిపి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెడుతున్నది మూడో బడ్జెట్. అజ్ఞానం, అనుభవరాహిత్యం, అహంకారం వెరసి తెలంగాణలో ప్రస్తుతం నడుస్తున్న పాలన అని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. రెండేళ్ల పాలన పూర్తి కాక ముందే తెలంగాణ ఆర్థిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేశారు .. 2050 తెలంగాణ రైజింగ్ ప్రణాళిక తయారు చేస్తున్నాం అని చెప్పడం హస్యాస్పదం కేసీఆర్ గారి నాయకత్వంలో పదేళ్లలో తెలంగాణ రాష్ట్రంలో జిల్లాలు, రెవిన్యూ డివిజన్లు, కొత్త మండలాల ఏర్పాటుతో పాలన వికేంద్రీకరించబడింది పదేళ్ల కేసీఆర్ పాలనలో విధ్వంసం మూలంగానే తెలంగాణ తలసరి ఆదాయంలో, తలసరి విద్యుత్ వినియోగంలో నంబర్ వన్ గా నిలిచిందా ? విద్యారంగం, వైద్యరంగంలో మార్పులు, ప్రాజెక్టుల నిర్మాణం, సాగునీటి సదుపాయం మూలంగా పంటల ఉత్పత్తిలో అగ్రస్థానంలో నిలిచింది వాస్తవం కాదా ? పదేళ్లలో పచ్చబడ్డ తెలంగాణను ఎండబెట్టి చోద్యం చూస్తున్నది కాంగ్రెస్. అధ్బుతమైన మిషన్ భగీరథ పథకం అమలై ప్రజలు బిందెలు పట్టుకుని వెళ్లే పరిస్థితి లేకుండా మార్చిన తెలంగాణలో మళ్లీ నీటి ఎద్దడితో బిందెలు పట్టుకుని వెళ్లే మంచినీటి కటకట దుస్థితి తెచ్చింది కాంగ్రెస్. పల్లెప్రగతితో పల్లెలు, పట్టణ ప్రగతితో కళకళలాడిన పల్లెలు, పట్టణాలు నేడు పారిశుధ్యం లోపించి కంపుకొడుతున్నాయి. హరితహారం మొక్కలు నీళ్లు పోసే దిక్కు లేక ఎండిపోతున్నాయి.
విశ్వవిద్యాలయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కర్ఫ్యూ పరిస్థితి తీసుకువచ్చిందని అన్నారు.
పారిశుద్ద కార్మికులు, అంగన్వాడీ, ఆశాలు, ప్రభుత్వ ఉద్యోగుల వరకు అన్ని వర్గాలను ఆశల పల్లకిలో ఊరేగించి అధం పాతాళానికి విసిరేసింది కాంగ్రెసని అన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ అని రైతులకు ఆశ చూపి మోసం చేశారు. ఎకరాకు ఏడాదికి రూ.15 వేల రైతుభరోసా అని చెప్పి 15 నెలల పాలనలో రెండు సార్లు ఎగ్గొట్టి రూ.12 వేలకు కుదించి కూడా కనీసం మూడు ఎకరాలు ఉన్న రైతులకు ఇవ్వలేదు. వ్యవసాయ కూలీలకు ఏడాదికి రూ.12 వేలు మొదలే పెట్టలేదు .. దానిని అమలు చేస్తున్నాం అని పచ్చి అబద్దాలు చెప్తున్నారు. కౌలు రైతులకు కూడా ఎకరాకు ఏడాదికి రూ.15 వేలు అని చెప్పి దాని ఊసెత్తడం లేదు. సన్నవడ్లకు క్వింటాలుకు రూ.500 బోనస్ బోగస్ అని తేలిపోయింది .. అసలు రాష్ట్రంలో పంటల కొనుగోలు అన్నదే ప్రహసనంగా మారింది. కాంగ్రెస్ 15 నెలల పాలన పాపం ఫలితంగా 450 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. విద్యారంగంలో కాంగ్రెస్ 15 నెలల పాలన విధ్వంసం రేపింది .. గురుకుల పాఠశాలలలో 50 మందికి పైగా విద్యార్థులు వివిధ కారణాలతో మరణించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని, కేసీఆర్ పాలనలో పూర్తయిన పరీక్షల ఫలితాలు ప్రకటించి నియామక పత్రాలు అందించి మేమే ఇచ్చాం అని గొప్పలు చెప్పుకుంటున్నారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో తెలంగాణలో వెలుగులు మాయమై చీకట్లు అలుముకున్నాయి. కేవలం 15 నెలలలో రూ.లక్ష 58 వేల కోట్లు అప్పులు చేసి ఒక్క పథకం అమలు చేయలేదు .. ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు. బడ్జెట్ ప్రసంగం నిండా అన్నీ అబద్దాలే వండి వార్చారు. ధ్వంసం, విధ్వంసమే కాంగ్రెస్ రచన .. నవ నిర్మాణాన్ని నరనరాన నింపుకుని పనిచేసిన కేసీఆర్ సర్కార్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ పార్టీకి లేదని అన్నారు.