Hyderabad:ఉస్మానియా వర్శిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం

Ban on protests and sit-ins at Osmania University

Hyderabad:ఉస్మానియా వర్శిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం:ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా.. 1969 లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు దారితీసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో.. ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు.

ఉస్మానియా వర్శిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం

హైదరాబాద్, మార్చి 18
ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎన్నో ఉద్యమాలకు వేదికగా నిలిచింది. తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాలకు వ్యతిరేకంగా.. 1969 లోనే ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థులు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ ఉద్యమం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు డిమాండ్‌కు దారితీసింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో.. ఉస్మానియా విద్యార్థులు కీలక పాత్ర పోషించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఓయూ విద్యార్థుల కృషి ఎంతో గొప్పది.ఉస్మానియా యూనివర్సిటీ వందేమాతరం ఉద్యమంలో కీలక పాత్ర పోషించింది. ఈ ఉద్యమంలో దివంగత ప్రధాని పి.వి.నరసింహారావు ముఖ్యపాత్ర పోషించారు. ఇలా ఎన్నో పోరాటాలు జరిగాయి. విద్యార్థులు తమ హక్కుల సాధన కోసం కదంతొక్కిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇటీవలి కాలంలో కూడా విద్యార్థుల హక్కుల కోసం, విశ్వవిద్యాలయంలో మెరుగైన సౌకర్యాల కోసం నిరసనలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్సిటీ అధికారులు సంచలన నిర్ణయం తీసుకున్నారు.ఉస్మానియా యూనివర్సిటీలో ధర్నాలు, ఆందోళనలపై నిషేధం విధించారు. దానికి రకరకాల కారణాలు చెబుతున్నారు.

యూనివర్సిటీ విభాగాలు, పరిపాలనా భవనాల్లో ధర్నాలు, ఆందోళనలు నిర్వహించడం వల్ల విద్యార్థుల చదువులకు, యూనివర్సిటీ పరిపాలనా కార్యకలాపాలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెబుతున్నారు. దీనివల్ల విద్యా వాతావరణం దెబ్బతింటుందని, విద్యార్థులు తమ చదువులపై దృష్టి సారించలేకపోతున్నారని అధికారులు అంటున్నారు.కొన్నిసార్లు ఆందోళనలు హింసాత్మకంగా మారే అవకాశం ఉందని.. దీనివల్ల యూనివర్సిటీలో శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అధికారులు భావిస్తున్నారు. అలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తగా ఈ నిర్ణయం తీసుకున్నారు. యూనివర్సిటీ నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు.ఈ నిషేధంపై విద్యార్థి సంఘాలు, ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా విమర్శిస్తున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమాలకు కేంద్ర బిందువని, ఇక్కడ ఆందోళనలను నిషేధించడం ప్రజాస్వామ్య విరుద్ధమని అంటున్నారు. అలాగే, విద్యార్థుల సమస్యలను పరిష్కరించకుండా.. వారి గొంతు నొక్కడం సరికాదనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. యూనివర్సిటీ విభాగాలు, పరిపాలనా భవనాల్లో మాత్రమే ధర్నాలు నిషేధించామని అధికారులు చెబుతున్నారు. విద్యా, పరిపాలనా విధులకు ఆటంకం కలగకుండా మాత్రమే సర్క్యులర్‌ ఇచ్చామని అంటున్నారు.

Read also:24 11మంది సెలబ్రెటీలపై కేసులు

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్లపై కొరడా ఝళిపించారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11మంది సెలబ్రిటీలపైన కేసులు నమోదు చేశారు. బెట్టింగ్ యాప్స్ కు మద్దతు తెలిపిన విష్ణుప్రియ, సుప్రిత, రీతూచౌదరితో పాటు హర్షసాయి, టేస్టింగ్ తేజ, ఇమ్రాన్ పైన కేసు నమోదు చేశారు పంజాగుట్ట పోలీసులుబెట్టింగ్ యాప్స్ కు సంబంధించి తెలంగాణ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఇప్పటికే ఐపీఎస్ అధికారి సజ్జనార్.. బెట్టింగ్ యాప్స్ ను ప్రమోట్ చేస్తున్న వారికి చాలా సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు. బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులకు సూచించారు.దాంతో బెట్టింగ్ యాప్ లను ప్రమోట్ చేస్తున్న 11 మంది యూట్యూబర్లపై పంజాగుట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. విష్ణుప్రియ, సుప్రిత, ఇమ్రాన్ ఖాన్, హర్షసాయి, టేస్టింగ్ తేజతో సహా 11మందిపై కేసు ఫైల్ చేశారు.

వీరంతా సోషల్ మీడియా వేదికగా ప్రభావితం చేస్తున్నట్లు ఈ కేసులో పొందుపరించారు. ఎఫ్ఐఆర్ లోనూ కీలక అంశాలను ప్రస్తావించారుకాగా, తాము కావాలని యాప్స్ ను ప్రమోట్ చేయలేదని, పొరపాటు జరిగిందని కొందరు సెలబ్రిటీలు క్షమాపణ కూడా చెప్పారు. సారీ చెబుతూ రీతూ చౌదరి ఒక వీడియోను రిలీజ్ చేశారు. ఇది జరిగిన కొన్ని గంటలకే పోలీసులు షాక్ ఇచ్చారు. 11 మంది సెలబ్రిటీలపై యాక్షన్ తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు.బెట్టింగ్ యాప్స్ ద్వారా చాలా ఈజీగా, భారీగా డబ్బులు సంపాదించొచ్చని కొందరు యూట్యూబర్లు ప్రమోషన్లు చేస్తున్నారు. ఇది నిజమేనని నమ్మి యువత పెడదోవ పడుతోంది. బెట్టింగ్స్ యాప్స్ కారణంగా డబ్బులు పోగొట్టుకుంటున్నారు. అప్పులపాలైపోతున్నారు. డబ్బులు కట్టే పరిస్థితి లేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. ఇప్పటివరకు ఎంతో మంది యువకులు ఇలా బెట్టింగ్ యాప్ లకు బలైపోయారు.

Read more:Hyderabad:అసెంబ్లీలో ఏం జరగబోతోంది

Related posts

Leave a Comment