Hyderabad:అసెంబ్లీలో ఏం జరగబోతోంది

Will KCR reveal the entire list of sins? He said that he will further say in the meetings to be held on the 19th and 20th that this is just an interval.

Hyderabad:అసెంబ్లీలో ఏం జరగబోతోంది:కేసీఆర్ పాపాల చిట్టా అంతా బయటపెడుతారా. ఇది ఇంటర్వెల్‌ మాత్రమేనని 19, 20 తేదీల్లో జరిగే సమావేశాల్లో ఇంకా చెబుతానన్నారు. ఇక అప్పు వద్దు అప్పు చేసి పప్పుకూడా కూడా వద్దంటున్నారు సీఎం. ఆదాయం పెంచి పేదలకు పంచాలన్న ఆలోచనతోనే ఉన్నామని, అబద్ధాల పునాదులపై పాలన నడిపించదలుచుకోలేదంటున్నారు.

అసెంబ్లీలో ఏం జరగబోతోంది..

హైదరాబాద్, మార్చి 16
కేసీఆర్ పాపాల చిట్టా అంతా బయటపెడుతారా. ఇది ఇంటర్వెల్‌ మాత్రమేనని 19, 20 తేదీల్లో జరిగే సమావేశాల్లో ఇంకా చెబుతానన్నారు. ఇక అప్పు వద్దు అప్పు చేసి పప్పుకూడా కూడా వద్దంటున్నారు సీఎం. ఆదాయం పెంచి పేదలకు పంచాలన్న ఆలోచనతోనే ఉన్నామని, అబద్ధాల పునాదులపై పాలన నడిపించదలుచుకోలేదంటున్నారు. . కౌంటర్ ఎటాక్ చేస్తానంటున్నారు. రంగంలోకి దిగితే ఎలా ఉంటుందో చూపిస్తానంటున్నారు. లెక్కలతో సహా వస్తానంటున్నారు. లెక్క తేల్చేస్తానంటున్నారు. సభలోనే తేల్చుకుందామంటున్నారు. నిజానిజాలు బయటపెడుదామంటున్నారు. ఈనెల 19, 20 తేదీల్లో పాపాల చిట్టా విప్పుతానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పడంతో ఏం జరుగుతోంది? ఎలా డీకోడ్ చేస్తారన్న ఉత్కంఠ రాజకీయవర్గాల్లో పెరుగుతోంది.ఒక అబద్ధాన్ని పదే పదే ప్రచారం చేస్తే చాలా మంది అదే నిజం అనుకుంటారు. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ చేస్తున్న ప్రచారంపై ప్రభుత్వం ఇదే అభిప్రాయంతో ఉంది. అసత్యాలను, అర్ధ సత్యాలను తిప్పికొట్టేందుకు మాస్టర్ ప్లాన్ తో ఉంది. ఏ పని మొదలు పెట్టినా అందులో ఏదో ఒకటి తప్పు పట్టడం, తప్పు జరగకముందే జరుగుతాయని ప్రచారాలు చేయడాన్ని సీఎం రేవంత్ సీరియస్ గా తీసుకున్నారు. ఇప్పటికే అసెంబ్లీలో, బయట ఇదే ఇష్యూను ప్రస్తావిస్తున్నారు. అందరి లెక్కలు ముఖ్యంగా మాజీ సీఎం కేసీఆర్ లెక్కలన్నీ సభలోనే తేల్చేస్తానంటున్నారు.

పంటలు ఎండిపోతున్నాయని, 15 నెలల్లోనే విపరీతంగా అప్పులు చేశారని, మూసీ పునరుజ్జీవం పేరుతో దోపిడీకి తెరలేపుతున్నారని, ఫ్యూచర్ సిటీలో పేరుతో భూపందేరం నడుస్తోందని, ఒక్కటేమిటి ఇలా ఎన్నో అంశాలపై విపరీతంగా ప్రచారాలు చేస్తున్న పరిస్థితి. వీటికి ఎప్పటికప్పుడు కౌంటర్లు ఇస్తున్నా.. ప్రతిపక్షానికి డోస్ సరిపోవడం లేదని అధికార పక్షం అనుకుంటోంది. ఎగ్జాంపుల్ సన్న ధాన్యానికి బోనస్ ఇవ్వడం వల్లే రబీ సాగు పెరిగిందని, గత రబీకన్నా ఎక్కువ సాగైందని వివరించాల్సిన పరిస్థితి. రబీలో 35 లక్షల ఎకరాల్లో వరి సాగైతే, ఈసారి 55 లక్షల ఎకరాలు సాగైందని చెబుతున్నారు. ప్రతి ప్రశ్నకు, ఆరోపణలకు ఓపికంగా సమాధానం, వివరణ ఇచ్చుకుంటూ ముందుకెళ్తున్నారు అధికార పార్టీ నేతలు. అయితే ఇలాగే వదిలేస్తే మ్యాటర్ చాలా దూరం వెళ్తుందనుకుంటున్నారు. అందుకే అన్నిటికీ ఒకేసారి చెక్ పెట్టేలా రంగం రెడీ చేశారంటున్నారు.నిజానికి ప్రధాన ప్రతిపక్ష నేత అంటే బాధ్యత బాగానే ఉంటుంది. సభలోపల, బయట చాలానే వర్క్ ఉంటుంది. ప్రజా సమస్యలను ప్రస్తావించడం, ప్రభుత్వ నిర్ణయాలపై సలహాలు, సూచనలు చేయడం ఇలాంటి పరిస్థితి. సీన్ కట్ చేస్తే ప్రధాన ప్రతిపక్ష నేత హోదాలో ఉన్న కేసీఆర్ మాత్రం మళ్లీ ఫాంహౌజ్ కే పరిమితం అవుతున్నారు. బయటకు రావడం లేదు. ఇటీవల అసెంబ్లీకి ఒక్కరోజు హాజరై వెళ్లిపోయారు. అనర్హత వేటు పడకుండా జస్ట్ అటెండెన్స్ వేయించుకున్నారన్న విమర్శలు కూడా వచ్చాయి. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ సభలో లేటెస్ట్ గా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.శాసన సభ్యులు కూడా ప్రభుత్వ ఉద్యోగులేనని సుప్రీంకోర్టు చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూనే కేసీఆర్‌ అసెంబ్లీకి గత 15 నెలల్లో కేవలం రెండు రోజులే వచ్చి అటెండెన్స్ వేయించుని వెళ్లారన్నారు.

ఎమ్మెల్యేగా, ప్రతిపక్ష నాయకుడిగా కేసీఆర్ 57 లక్షల 84 వేల 124 రూపాయలు జీతభత్యాలు తీసుకున్నారన్నారు. నియోజకవర్గ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఎక్కడా పర్యటనలకు కూడా వెళ్లలేదని, ప్రజా సమస్యలపై అసెంబ్లీలో మాట కూడా మాట్లాడలేదని గుర్తు చేశారు. రాజకీయాల్లో వర్క్‌ ఫ్రమ్‌ హోం, వర్క్‌ ఫ్రమ్‌ ఫామ్‌ హౌస్‌ వంటిది ఏమైనా ఉందా? అని కౌంటర్ ఇచ్చారు.నిజానికి కేసీఆర్ ను అసెంబ్లీకి రప్పించాలని హైకోర్టులో పిల్ కూడా దాఖలైంది. ప్రధాన ప్రతిపక్ష నేతగా బాధ్యతలకు దూరంగా ఉండడం కరెక్ట్ కాదని, ఆయన్ను సభకు వచ్చేలా చూడాలంటూ ఇటీవలే పిటిషన్ వేశారు. ఇంకోవైపు 15 నెలల నుంచి కేసీఆర్ కు ఇచ్చిన పదవిని సరిగ్గా నిర్వర్తించడం లేదని, ఇచ్చిన బాధ్యతను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమయ్యారని.. దాంతో ఇన్ని రోజులుగా ఆయనకు ఇచ్చిన జీతాలను రికవరీ చేయాలని కాంగ్రెస్ నేతలు స్పీకర్ ను కలిసి కంప్లైంట్ కూడా ఇచ్చారు.అప్పులు భారీగా చేస్తున్నారన్న ప్రచారాలకు సీఎం రేవంత్ ఘాటుగానే రియాక్షన్ ఇచ్చారు. ఖుల్లం ఖుల్లాగా క్లారిఫై చేశారు. అటు ప్రతిపక్ష నేత కేసీఆర్ లక్ష కోట్ల ఆస్తులపైనా కౌంటర్ ఇచ్చారు. మరి రెండ్రోజుల్లో సీఎం సభలో ఏం తేల్చబోతున్నారు? ఆస్తుల లెక్కల్ని డీకోడ్ చేస్తారా? సీఎం బయటపెట్టబోయే కేసీఆర్ పాపాల చిట్టా ఏంటి? బీఆర్ఎస్ ను కౌంటర్లకు పుల్ స్టాప్ ఎలా పెట్టించబోతున్నారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది.

ప్రభుత్వం అడ్డగోలుగా అప్పులు చేస్తోందంటూ ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని చెప్పిన సీఎం రేవంత్.. గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటికి చెల్లించిన వడ్డీలతో సహా లెక్కలు క్లియర్ కట్ గా చెప్పేశారు. 2023 డిసెంబర్ 1 నాటికి అప్పులు 6,69,257 కోట్ల అప్పులు, చెల్లించాల్సిన పెండింగ్‌ బిల్లులు 40,154 కోట్లు, ఇతర పెండింగ్‌ బిల్లులు 1,09,740 కోట్లు ఉన్నాయన్నారు. ఇవన్నీ కలిపితే మొత్తం అప్పులు 8,19,151 కోట్లు అయ్యాయన్నారు. ఇక తమ ప్రభుత్వం 1,53,359 కోట్ల అప్పులు చేసిందని, ఇందులో కేసీఆర్‌ చేసిపెట్టిన అప్పుకు 15 నెలల్లో చెల్లించింది 88,591 కోట్లు, వడ్డీలకు 64,768 వేల కోట్లు ఇచ్చామన్నారు. ఇవన్నీ పోతే తమ ప్రభుత్వం చేసిన అప్పు 4,682 కోట్లు మాత్రమే అని క్లారిఫికేషన్ ఇచ్చారు.సీఎం పదేపదే ఢిల్లీ వెళ్తున్నారంటూ బీఆర్ఎస్ ప్రచారం చేస్తోంది. వాటికి కూడా సీఎం గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం 15 నెలల్లో 32 సార్లు ఢిల్లీకి వెళ్లి మూడుసార్లు ప్రధాన మంత్రిని కలవడాన్ని గుర్తు చేస్తున్నారు. అటు ఫామ్ హౌస్ లో క్యాప్సికం పండిస్తే ఎకరాకు కోటి రూపాయల ఆదాయం వస్తుంటే.. అదే ఫార్ములా రైతులు, యూత్ కు చెప్పాలని సవాల్ చేస్తున్నారు సీఎం.తెలంగాణ ఆదాయాన్ని పెంచి, ప్రజలకు పంచాలనే ఆలోచనతో ఉన్నామంటున్నారు సీఎంసో గ్రౌండ్ క్లియర్ గా ఉంది. మ్యాటర్ రెడీగా ఉంది. ఇప్పుడు వచ్చింది ఇంటర్వెల్ మాత్రమే. పిక్చర్ అబీ బాకీ హై అంటున్నారు సీఎం. కేసీఆర్ ఆస్తుల చిట్టాను బయటికి తెస్తారా? గత పదేళ్ల పాలనలో జరిగినవి మరింతగా సాక్షాలతో బయటపెడుతారా? మరి 19, 20 తేదీల్లో ఏం జరుగుతుందో చూడాలి.

Read more:Hyderabad:రేవంత్ ధైర్యం ఏమిటీ హైదరాబాద్, మార్చి 16

Related posts

Leave a Comment